8, ఫిబ్రవరి 2018, గురువారం

సర్వతోభద్ర ఆలయంగుట్టలోని రాతి భాగాన్నే మూలవిరాట్టుగా మలచిన వైనం
అబ్బురపరుస్తున్న నయన్‌పాక సర్వతోభద్ర దేవాలయం
నాలుగు ప్రవేశ ద్వారాలతో మందిరం.. 55 అడుగులతో గోపురం
నలు చదరంగా విగ్రహం.. నాలుగు వైపులా వేర్వేరు విగ్రహాలు
నిర్మాణ ప్రత్యేకతను తాజాగా విశ్లేషించిన అమెరికా ప్రొఫెసర్‌:

గుట్ట మీద గుడి కట్టడం సాధారణమే.. కానీ గుట్టనే గుడిగా మలచడం విచిత్రం. అందులోనూ గుట్టలో భాగమైన రాతినే చెక్కి దేవతా విగ్రహాలను తీర్చిదిద్దడం.. దాని నుంచి వెలువడిన రాళ్లనే పేర్చి గుడిని నిర్మించడం మాత్రం అబ్బురమే. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నయన్‌పాక గ్రామశివారులోని గుట్ట మీద ఉన్న సర్వతోభద్ర ఆలయం ప్రత్యేకత ఇది. దేశంలోనే ప్రత్యేక తరహాలో రూపుదిద్దుకున్న ఈ మందిరం కొత్తగా కనుగొన్నదేమీ కాదు. వందల ఏళ్లుగా స్థానికులకు సుపరిచితమే అయిన ఈ ఆలయం నిర్మాణంలోని ప్రత్యేకత తాజాగా నిపుణుల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...