8, ఫిబ్రవరి 2018, గురువారం

తెలుగు భాష


తెలుగు భాష ఎంతో పురాతన భాష . భారతీ భాషలలో పురాతన భాషగా గుర్తింపబడింది. తెనుగు,తెలుంగు వంటి పేర్లతోకూడా పిలిచేవారు. శ్రీకృష్ణదేవరాయలు "దేశ భాషలందు తెలుగు లెస్స" అని పొగిడిన భాషయిది.దీన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అంటారు . ఇటలీ భాషలో అక్షరాలు ఎంత అందంగా ఉంటాయో తెలుగు అక్షరాలు కూడా అంత అందంగా ఉంటాయి. ఇది సరళ సుందర మైన భాష. పద్య గద్య రూపాలతో ఎంతో వ్యాప్తి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ తెలుగు మాట్లాడే వారున్నారనడంలో అతిశయోక్తి లేదు.
పాల్కురికి సోమన నన్నయ్య, తిక్కన ఎఱ్రన మన బమ్మెర పోతన వంటి కవులు తమ కావ్యాల ద్వారా తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చారు.
‎అవధాన ప్రక్రియ ఒక్క మన తెలుగు భాష లోనే ఉన్నది.

గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు కే. చంద్రశేఖర రావు గారి తెలుగు భాషా ప్రావీణ్యం అపారం వారు తెలుగు భాష ఔన్నత్యాన్ని,తెలుగు వారి వైభవాన్ని తెలంగాణ ప్రాభవాన్ని ప్రపంచానికి తెలుపడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభల ఉత్సవానికి స్వీకారం చుట్టి నిర్వహిండం మనకు గర్వ కారణం .డిసెంబర్ 15 నుండి 19వరకు సాగుతున్నాయి.మనందరం
స్వచ్చందం గా పాల్గొని విజయవంతం చేయాలి వరంగల్ రూరల్ జిల్లాలో ఈరోజు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం.

భారతదేశంలోని అతి ప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి. భారత ప్రభుత్వం తెలుగు భాషకు “ప్రాచీన భాష” హోదానిచ్చి గౌరవించింది.
తెలుగు మాతృభాషగా కలిగున్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. తెలుగువాళ్లు ప్రపంచంలోని ఏ దేశానికెళ్లినా కనిపిస్తారనడం అతిశయోక్తి కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఎనిమిదన్నర కోట్ల జనాభాతో తెలుగు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో (హిందీ, బెంగాలీల తరవాత) మూడో స్థానంలోనూ, ప్రపంచవ్యాప్తంగా పదిహేనో స్థానంలోనూ నిలిచింది.
భాషాశాస్త్రవేత్తల అంచనా మేరకు తెలుగు భాష కనీసం 2,400 సంవత్సరాల పూర్వం మూలద్రావిడ భాష నుంచి వేరుపడి ప్రత్యేకభాషగా స్థిరపడింది. క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజుల పాలనలో రచించిన “గాధాసప్తశతి” అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్యసంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. తెలుగు పదాలు లిఖితరూపంలో దొరికిన ఆనవాళ్లలో ఇదే ప్రాచీనమైనది. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి శిలాశాసనం క్రీ.శ. ఏడవ శతాబ్దానికి చెందినది. తెలుగు భాష చరిత్ర క్రీ.శ. పదకొండో శతాబ్దం నుండి గ్రంధస్థం చెయ్యబడింది.

తెలుగు లిపి
తెలుగు లిపి ప్రాచీన బ్రాహ్మీ లిపి నుంచి ఉద్భవించింది. అశోకుని మౌర్య సామ్రాజ్యానికి సామంతరాజులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చారు. దక్షిణ భారత భాషలన్నీ మూలద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రం బ్రాహ్మీ నుంచే పుట్టాయి అంటారు.

నన్నయ పదకొండో శతాబ్దంలో రచించిన మహాభారతం తెలుగులో ఆదికావ్యమనీ, నన్నయ ఆదికవి అనీ చెప్పబడుతున్నది. అంతకు ముందు సాహిత్యం అసలే లేకుండా, ఉన్నట్టుండి ఇంత అద్భుతమైన కావ్యం రాయడం అసాధ్యం కాబట్టి, నన్నయకు ముందే మరింత తెలుగు సాహిత్యం ఉండవచ్చని సాహిత్యకారుల అభిప్రాయం.

తెలుగు భాష రక్షణ ఇలా..
1. తెలుగు భాష చరిత్ర పై సమగ్ర పరిశోధనలు జరగాలి.
2. ఆంగ్ల మాధ్యమం తో పాటు తెలుగు కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.
3. కుటుంబం నుంచే తెలుగు భాష అమలు కావాలి.
4. తెలుగు రచయితలను ప్రోత్సహించాలి. వారు రాసిన పుస్తకాలను ముద్రించి సమాజానికి అందించాలి.
5. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, కార్యాలయాల్లో తెలుగులోనే మాట్లాడాలనే నిబంధనలు రావాలి.
6.తెలుగు ఔన్నత్యాన్ని పాఠ్యగ్రంథాల్లో ప్రవేశపట్టాలి.
7. విద్యార్థి దశ నుంచే మాతృభాష పట్ల మమకారం పెంచాలి.
8.తెలుగు కావ్యాలలోని సామాజిక గతాన్ని సమాజానికి చాటి చెప్పాలి.
9.పరభాషను గౌరవించు.. మాతృభాషను ప్రపంచానికే
చాటిచెప్పు అన్న నినాదాన్ని ఇంటింటికి చేర్చాలి.
10.జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి, ప్రతి పల్లెల్లోనూ తెలుగు గ్రంథాలయాల్లో తెలుగు గ్రంధాలు ఏర్పాటు చేయాలి.
11.జానపదాలు, జానపద కళాకారులపై విస్తృత ప్రచారం చేయాలి.
12. తెలుగు సాహిత్యంలో పరిశోధనలు కొనసాగాలి.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...