10, జనవరి 2018, బుధవారం

కోఠీ ప్యాలెస్‌

ప్రస్తుతం కోఠి ఉమెన్స్‌ కాలేజి ఉన్న భవనం అప్పట్లో బ్రిటిష్‌ ఉన్నతోద్యోగి క్రిక్‌ పాట్రిక్‌ నివాసం. ఆ భవనాన్ని ఆయన ముచ్చటపడి మరీ కట్టించుకున్నాడు. దాన్ని నిర్మించటానికి నిజామ్‌ అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. పాట్రిక్‌ తాను నిర్మించదలచిన భవనం నమూనాను ఓ పెద్ద కాయితంపై గీసి నిజాం అనుమతికి పంపాడు. నిజాం ఆ ప్లాన్‌ను పరిశీలించి... నిర్మాణానికి అనుమతించలేదు. కారణం ఏమిటో తెలుసుకుందామని దివాన్‌ మీర్‌ ఆలంను సంప్రదించాడు పాట్రిక్‌. ''దొరగారూ! తమరు నిజాం ప్రభువుల భవంతి అంత పెద్దసైజు పేపరుపై ప్లాన్‌ గీస్తే ఎలా? ప్రభువులకు కోపం వచ్చిందేమో. అందుకే అనుమతించలేదు'' అని చెప్పాడు.
తాను అంత పెద్ద భవంతి కట్టుకోవటం నిజాంకు ఇష్టం లేదని పాట్రిక్‌కు అర్థమైంది. ఈసారి విజిటింగ్‌ కార్డు అంత చిన్న కాయితం ముక్కపై ప్లాన్‌ గీసి అనుమతికి పంపాడు.
వెంటనే నిజాం అనుమతి లభించింది. 'కోఠీ ప్యాలెస్‌ మద్రాసులోని గవర్నమెంట్‌ హౌస్‌ కంటే గొప్పగా ఉంది... కలకత్తాలోని గవర్నర్‌-జనరల్‌ నివాసానికి సాటి వస్తుందని' సర్‌ జాన్‌ మాల్కమ్‌ అనే పెద్దమనిషి కితాబు ఇచ్చాడు కూడా.
ఇందులోని ఫర్నిచర్‌ కూడా లండన్‌ కార్ల్‌టన్‌ హౌస్‌లో బ్రిటిష్‌ రాజోద్యోగులు వాడిందే.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...