10, జనవరి 2018, బుధవారం

నయాఖిలాడక్కన్‌ ప్రాంతాన్ని కులీకుతుబ్‌షాహీలు విజయవంతంగా పరిపాలిస్తున్న సమయం అది. ఈ గోల్కొండ కోటపై మొఘల్‌ రాజు ఔరంగజేబు కన్నుపడింది. తన దండయాత్రలో ఎన్నో రాజ్యాలను గెలిచిన ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో తన సైన్యాన్ని గోల్కొండ శివారు ప్రాంతాలకు తరలించాడు. ఆ సమయంలో గోల్కొండను పరిపాలిస్తున్న అబ్దుల్లా కుతుబ్‌షా గోల్కొండ కోట ద్వారాలను మూయించాడు. గోల్కొండ కోటపైకి ఫిరంగులను గుప్పించేందుకు ఔరంగజేబుకు ఎక్కడా స్థావరం దొరకలేదు. గోల్కొండ కోటకు ఉత్తర ఈశాన్యం ప్రాంతంలో ఒక ఎత్త్తెన గుట్ట ఉండటం ఔరంగజేబుకు వరంగా మారింది. ఆ గుట్టను స్థావరంగా చేసుకుని గోల్కొండ కోటపైకి ఫిరంగి గుళ్ల వర్షం కురిపించాడు. ఎన్నిరోజులు గుళ్లవర్షం కురిపించినా ఫలితం లేకపోవడంతో వెనుదిరిగాడు. మొగల్‌ రాజు ఔరంగజేబుకు స్థానం కల్పించిన ఆ గుట్టను గోల్కొండ కోటలో భాగం చేయాలని భావించిన గోల్కొండ రాజు అబ్దుల్‌ కుతుబ్‌షా ఆ గుట్టచుట్టూ కొత్తగా ప్రహరీగోడ నిర్మించి ఆ ప్రాంతానికి నయాఖిలా (కొత్త కోట) అని పేరు పెట్టారు. గోల్కొండ కోటలో కలసిన ఈ నయాఖిలా సుందరప్రదేశంగా పేర్కొనవచ్చు. సుందరమైన చెరువు, పచ్చిక బయళ్లతో ఎప్పుడూ కళకళలాడే ఈ నయాఖిల్లా మొత్తం 50 ఎకరాలలో ఉంది. ఇక్కడే ప్రపంచప్రఖ్యాతి గాంచిన బూరుగు వృక్షం ఉంది. ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడే నయాఖిలాకు నవంబరు, మార్చి నెలల్లో రెండు దఫాలుగా విదేశీపక్షులు వలసవస్తాయి. దాదాపు 40 రోజుల పాటు ఇక్కడ గడిపి వెళతాయి. ఆనాటి నిజాం కుటుంబీకులు ఈ నయాఖిలాకు విహారానికి వచ్చేవారట. వందల సంఖ్యలో వలసపక్షులు రావడంతో టూరిజంశాఖ ఈ నయాఖిలాను పక్షుల అవాసకేంద్రంగా మార్చాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే నయాఖిలా ప్రక్కనేగల జమాలి దర్వాజ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్‌ గోల్ఫ్‌ కోర్టుకు 200 ఎకరాలు కేటాయించింది. అయితే తమకు మరో 50 ఎకరాలు నయాఖిలా స్థలం కేటాయించాలని కోరగా, కేంద్రపురావస్తుశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. పురాతన కట్టడాలు ఉన్న ఈ నయాఖిలా ప్రాంతంను గోల్ఫ్‌ సెంటర్‌కు ఇవ్వమని పురావస్తుశాఖ అధికారులు తేల్చిచెప్పారు. టూరిజం శాఖ పక్షుల ఆవాసకేంద్రానికి పురావస్తుశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...