10, జనవరి 2018, బుధవారం

మక్కామసీదు


చార్మినార్‌కు నైరుతి దిక్కున 100 గజాల దూరంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మక్కామసీదు ఉన్నది. మక్కా లోని ఒక గొప్ప మసీదు పేరును ఈ మసీదుకు పెట్టారు. 67మీటర్ల పొడవు, 54 మీటర్ల వైశాల్యం ఉన్న ఈ మసీదు 23 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిలో మొత్తం 15 కమాన్లున్నాయి. ఇవి కప్పు కు ఆధారంగా కూడా ఉంటాయి. భారతదేశంలోని గొప్ప మసీదులలో ఇది ఒకటి. ఇందులో ఒకేసారి 10 వేల మంది ప్రార్థనలు చేయవచ్చు. దీనిని చౌదరి రంగయ్య, దరోగా మీర్‌ ఫైజుల్లా బేగ్‌ ల సూచనల మేరకు మహమ్మద్‌ కుతుబ్‌షా నిర్మించాడు. 8 వేల మంది తాపీపనివారు, కూలీలు దీని నిర్మాణంలో పనిచేశారు. అబ్దుల్లా కుతుబ్‌షా, అబుల్‌ హసన్‌షా కాలంలో నిర్మాణ పనులు ప్రారంభం కాగా క్రీ.శ. 1694లో ఔరంగజేబు కాలంలో పూర్తయ్యాయి.
ఈ నిర్మాణం గురించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. ఈ మసీదు శంఖుస్థాపన ను చేయటానికి అన్ని మతాలకు చెందిన మత పెద్దలను కుతుబ్‌షా పిలిపించారు. జీవితకాలంలోప్రతి రోజు ప్రార్ధన చేసే వ్యక్తిని నిర్మాణానికి శంకుస్థాపన చేయమని ఆహ్వానించాడు. కాని ఎవరూ ముందుకు రాలేదు. తన 12 ఏళ్ల వయస్సు నుంచి మధ్య రాత్రి ప్రార్ధనను కూడా తప్పకుండా చేస్తున్న కుతుబ్‌షానే స్వయంగా చేసినట్లు చెపుతారు.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...