10, జనవరి 2018, బుధవారం

మహరాజా కిషన్‌ప్రసాద్‌ బహద్దూర్‌ నివాసంచార్మినార్‌కు దక్షిణాన కిలోమీటర్‌ దూరంలో శాలిబండ వద్ద ఈ భవనం ఉంది. యూరోపియన్‌ వాస్తుశైలిలో నిర్మించిన ఈ సువిశాలమైన, ఆకర్షణీయమైన భవనంలో ప్రస్తుతం సూరజ్‌బాన్‌ భగవతీబాయి ప్రసూతి ఆసుపత్రి ఉంది. ఈ భవనాన్ని నిజాం కొలువులో ప్రధానమంత్రి కిషన్‌ప్రసాద్‌ ముత్తాతగారైన మహరాజా చందూలాల్‌ 1802లో నిర్మించారు. ఇందులోని జిలూఖానాను మొహరం పండుగ సందర్భంగా అందంగా అలంకరిస్తారు. తూర్పు దిశలో ఉన్న ఐనఖానాను డ్రాయింగ్‌ రూంగా, దాని పైఅంతస్తులో ఉన్న బాలాఖానాను డైనింగ్‌ హాల్‌గా ఉపయోగించేవారు. ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌, ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌లు ఇక్కడినుంచే మొహరం పండుగను పురస్కరించుకుని ఏర్పాటుచేసే లంగర్‌ ఊరేగింపు తిలకించేవారు. దీనికి ఉత్తరంలో ఖాస్‌బాగ్‌ ఉండేది. ఇక్కడ అతిథులకు బస ఏర్పాటు చేసేవారు. ఇక్కడ వైస్‌రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ లాంటి ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు. దక్షిణంలో స్త్రీల కోసం ప్రత్యేకంగా నిర్మించిన జనానా ఖానా, దానిపక్కన ఖయ్యాం మహల్‌ ఉంది. వీటిలో అనేక భవనాలు జీర్ణమైపోయాయి. ఇందులోని ''షాద్‌ మాన్షన్‌''లో మాత్రం ప్రస్తుతం సూరజ్‌బాన్‌ ప్రసూతి ఆసుపత్రి ఉంది.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...