10, జనవరి 2018, బుధవారం

దారుల్‌షిఫా ఆసుపత్రి

భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి ఇన్‌ పేషంట్‌ సౌకర్యం గల ఆసుపత్రి దారుల్‌షిఫా. ప్రపంచ ప్రసిద్ధమైన మూడు ఆసుపత్రులలో ఇది ఒకటి కావడం విశేషం. ఉచితంగా వైద్య సేవలు అందించిన ఈ ఆసుపత్రిలో దేశీయ వైద్యులే గాకుండా గ్రీస్‌, ఇటలీ తదితర దేశాలనుంచి వచ్చిన నిపుణులైన డాక్టర్లు (హకీంలు) పనిచేసేవారు, వారే విద్యార్థులకు వైద్య విద్య నేర్పేవారు. పురానా హవేలీ సమీపంలోని ఉద్యానవనాల్లో ఈ రెండంతస్తుల భవనాన్ని మహ్మద్‌ ఖులీఖుతుబ్‌షా 1595లో నిర్మించాడు. సుమారు 600 గజాల స్థలంలో నిర్మించిన ఈ భవనాన్ని యునానీ వైద్యంలో రెసిడెన్షియల్‌ కమ్‌ టీచింగ్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. ఈ ఆసుపత్రిలో ఒకేసారి 400 మంది రోగులకు వసతి సౌకర్యం ఉంది. కింది భాగంలో డబుల్‌ బెడ్‌రూంలు, మొదటి అంతస్తులో ఇన్‌పేషంట్ల కోసం గదులు ఏర్పాటు చేశారు. ఉత్తరం నుంచి వచ్చే గాలి రోగుల ఆరోగ్యానికి మంచిదని గదులను ఉత్తరముఖంగా నిర్మించారు. ఈ భవనంలో ఓ మూలన అషూర్‌ఖానా ఉండేది. చిన్నగా చీకటిగా ఉన్న అషూర్‌ఖానా స్థానంలో మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కొత్త దానిని నిర్మించారు. ఈ ఆసుపత్రిని రెండో నవాబ్‌ నిజాం అలీఖాన్‌ కాలంలోనే మూసివేశారు. ఈ భవనాలను నిజాం ఎస్టేట్‌ ప్రధాన కేంద్రంగా సర్ష్‌-ఇ-ఖాన్‌గా మార్చారు. నిజాం పదాతి దళాలు ఇక్కడ ఉండేవి. 1948లో పోలీసు చర్య తర్వాత ఇక్కడి నుంచి సైన్యాన్ని తరలించారు. రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ ప్రస్తుతం ఈ భవనంలోనే ఉంది.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...