10, జనవరి 2018, బుధవారం

లాడ్‌బజార్‌

చారిత్రక చార్మినార్‌ కట్టడానికి పశ్చిమాన ఉన్న లాడ్‌బజార్‌ గాజులకు ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే గాజులు దేశవిదేశాలలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. లాడ్‌బజార్‌లో అంతర్జాతీయ గాజుల ఎగ్జిబిషన్‌ కూడా జరిగింది. ఈ ప్రదర్శనలో దేశ, విదేశాలకు చెందిన గాజుల తయారీదారులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడ గాజుల ప్రదర్శన జరిగినా ఇక్కడి వ్యాపారులు అందులో పాల్గొని తమ ప్రత్యేకతను చాటుకోవడం ఆనవాయితీగా మారింది. ఇక్కడ గాజుల తయారీ ఓ కుటీర పరిశ్రమగా వర్థిల్లుతోంది. అనేకమంది గాజులు తయారుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దేశవిదేశాల నుంచి నగరానికి వచ్చే సందర్శకులు ప్రధానంగా మహిళలు చార్మినార్‌తో పాటు ఇరువైపులా గాజుల దుకాణాలతో సందడిగా కనిపించే లాడ్‌బజార్‌ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. నిత్యం వ్యాపార లావాదేవీలతో బిజీగా కనిపించే లాడ్‌బజార్‌ను పెడెస్ట్రెయన్‌ జోన్‌ పరిధిలోకి తీసుకువచ్చి మరింత శోభను చేకూర్చి నైట్‌బజార్‌గా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆరవ నిజాం నవాబ్‌ మీర్‌ మహబూబ్‌అలీఖాన్‌ తన భార్య లాడ్లీ బేగం పేరుమీద, ఈ ప్రాంతానికి లాడ్‌బజార్‌ అని పేరు పెట్టారు.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...