23, డిసెంబర్ 2017, శనివారం

అమూల్యమీ ఛాయా చిత్రాలు !

* ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేకం

ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని శుక్రవారం మాదాపూర్‌లోని స్టేట్‌ఆర్ట్‌ గ్యాలరీలో ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటుచేశారు. తెలంగాణకు చెందిన ప్రముఖ ఛాయాచిత్రకారులు దివంగత రాజాదీన్‌దయాళ్‌, రామమధుగోపాల్‌రావు, రామవీరేష్‌బాబు, హర్పాల్‌సింగ్‌, సత్యనారాయణ గోల, బి.నర్సింగ్‌రావు, కె.విశ్వేశ్వర్‌రెడ్డిలు తమ కెమెరాల్లో బంధించిన అందమైన ఫొటోలను ఇక్కడ ఏడు గ్యాలరీల్లో ప్రదర్శనకు ఉంచారు.

హైదరాబాద్‌ ఫొటో ఆర్టిస్ట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాష్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. హైదరాబాద్‌ నగరంలోని చారిత్రక కట్టడాలతోపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే అందమైన ఫొటోలు ఈ ప్రదర్శనలో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజాదీన్‌దయాళ్‌ తీసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. 6వ నిజాంనవాబ్‌లో ఆస్థాన ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన దీన్‌దయాళ్‌ నిజాం కాలంనాటి నగర అందాలకు సంబంధించి తీసిన ఫొటోలు చూడముచ్చటగా ఉన్నాయి. వరంగల్‌కు చెందిన రామమధుగోపాల్‌రావు వరంగల్‌ కోట, వేయిస్తంభాల గుడి నిర్మాణ శైలి ఔనత్యాన్ని చాటుతూ తీసిన ఫొటోలు విశేషంగా ఉన్నాయి. సత్యనారాయణ తెలంగాణ బోనాల విశిష్టతకు అద్దంపడుతూ తీసిన ఛాయాచిత్రాలు కనువిందు చేస్తున్నాయి. ఇక నర్సింగ్‌రావు తీసిన ఫొటోలు తెలంగాణ పల్లె ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తున్నాయి. విశ్వేశ్వర్‌రెడ్డి తెలంగాణలోని రాతి సంపద ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ తీసిన పెద్దపెద్ద బండరాళ్ల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. రాతి సంపద కనమరుగవుతోందన్న సందేశంతో ఆయన తీసిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఆదిలాబాద్‌కు చెందిన హర్పాల్‌సింగ్‌ గిరిజనులు జరుపుకొనే నాగోబా జాతర విశేషాలు తెలిసేలా తీసిని ఛాయాచిత్రాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. రామ వీరేశ్‌బాబు తీసిన సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించిన ఫొటోలు కనువిందు చేస్తున్నాయి.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...