26, జూన్ 2017, సోమవారం

నేడు మానవ అక్రమ రవాణా , మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం.సమాజంలో పౌరుల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. చట్టాలు పకడ్బందీగా అమలుగాక పోవడంతో స్త్రీలు, బాలలపై హింస పేట్రేగిపోతోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఏదో రకమైన హింసకు గురువుతన్నారు. స్త్రీలు, ఆడ పిల్లలపై వివిధ స్థాయిల్లో అణచివేత, దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి జూన్ 26ను అంతర్జాతీయంగా హంసకు గురవుతున్న వారికి చేయూత, మాదక ద్రవ్యాల వ్యతిరేక, మానవ అక్రమ రవాణా నిరోధక దినంగా నిర్ణయించింది.
35 శాతం మహిళలపై దాడులు.. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 35 శాతం మహిళలు గృహ, శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక, సామాజిక, సాంఘిక, అక్రమ రవాణా వంటి హింసకు గురువుతన్నారు. అందులో 50 శాతం బాలికలు హింసకు గురువుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు కేంద్ర ప్రభుత్వం స్త్రీ, పురుష లింగ నిష్పత్తి పెంచడం కోసం బేటీ బచావో-బేటీ పడావో (ఆడపిల్లలను రక్షిద్దాం-ఆడపిల్లలను చదివిద్దాం), బాలికలకు సుకన్య స వృద్ధి యోజన, కిషోరశక్తి యోజన, కౌమార బాలికల పథకం, ఉచితటోల్ ఫ్రీ నెంలు, స్వదార్ గృహాలు, మహిళ పోలీస్ వలీంటర్లు, ఒన్‌స్టాఫ్ సెంటర్, మహిళ సాధికారతకు శిక్షణ, నైపుణ్యాలు పెంపొందించడం కోసం వివిధ పథకాలు అమలు చేస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం... స్త్రీ, బాలలపై హింస నిరోధానికి వివిధ రకాలైనా షీ టీంలు, ఆర్థికంగా అమ్మాయిల కుటుంబాలను ఆదుకోవడానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, గురుకుల విద్యాలయాలు, ఒంటరి, వితంతు మహిళలకు జీవనభృతి తదితర ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేస్తోంది.
శాఖలు.. పథకాలు.. సమాజంలో హింసకు గురవుతున్న వారి కోసం ప్రభుత్వ ఆధీనంలో పలు శా ఖలు తమ విధులను నిర్వహిస్తున్నాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, అనాథ పేద బాలికల కోసం బాల సదనం, కౌమార దశ బాలికలకు (కళాశాల) ఉచిత వస తి, వదిలి వేయబడిన, భర్త చనిపోయిన మహిళలలకు సేవసదనం, ఉద్యోగం చే స్తున్న పేద మహిళలకు వసతిగృహం, అనాథ, పేద బాలికలలకు, వృత్తి విద్యా కో ర్సులు నిర్వహిస్తోంది.
బాలల కోసం.. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్), మహిళలు, పిల్లల పోషణ స్థాయిని మెరుగుపరచడం, వారి పెరుగుదల పర్యవేక్షణ, ఆటపాటల పద్ధతిలో విద్యను అం దించడం, సమగ్ర బాలల పరిరక్షణ పథకం, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో 18 సంవత్సరాలలోపు బాలబాలికల హక్కులను పరిరక్షించడం, బాల్య వివాహాలను అరికట్టడం, బాలకార్మిక నిర్మూలనకు పాటుపడటం, ఆడ పిల్లల రక్షణ, వారి చదువు, ప్రత్యేక సమావేశాలు, బాలల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు, పథకాలను అమలు చేయడం, అవగాహన, శిక్షణ సమావేశాలు నిర్వహించడం వారి బాధ్యత.
మానవ అక్రమ రవాణా.. 80 శాతం మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. ప్రధానంగా ఆయా దేశాల సరిహద్దుల వెంట అధికంగా జరుగుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 70 శాతం మంది మహిళలు, బాలికలు ఉంటున్నారు. ప్రతి ముగ్గురి బాలికల్లో ఇద్దరు అక్రమ రవాణా బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల మహిళలు వారి యొక్క వయస్సు 18 సంవత్సరాలు నిండక ముందే బాల్య వివాహం బారిన పడుతున్నారు. అందులో 1/3 వంతు 15 సంవత్సరాలు నిండక ముందే బాల్య వివాహాలు జరుగుతున్నట్లు నివేదికలు తెలియచేస్తున్నాయి. మహిళల హింస తీవ్రతను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా 119 దేశాల ప్రభుత్వాలు మహిళ, బాలల చట్టాలను చేశాయి.
మత్తు పదార్థాలకు అ లవాటు.. అంతర్జాతీయ డ్రగ్స్ 2017 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 0.6 శాతం మంది డ్రగ్స్ బారిన పడుతున్నారు. మత్తు పదార్థాల్లోని ప్రధానంగా ఓపీఎం అఫ్ఘ్గనిస్తాన్‌లో 85 శాతం ఉత్పత్తి అవుతుండగా, కొకైన్, కన్నాబిస్, వాల్ల్యుసినోజి న్, నార్కోటిక్స్, హెరాయిన్, జబ్బు చేసిన వారు వాడే మందుల బిల్లులు ప్రధానంగా నేర ప్రవృత్తి కల్గి ఉండి, మోసం, నయవంచన చేయటం, మాదక ద్రవ్యాల అక్ర మ రవాణాచేసే నేరగాళ్లు ప్రధాన వ్యాపారంగా చేస్తుంటారు. ప్రతి ఏడాది 322 బిలియన్ యూఎస్ డాలర్ల డ్రగ్స్ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని ఐక్యరాజ్య సమితి డ్రగ్స్ విభాగం నివేదికలు వెల్లడిస్తున్నాయి.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...