8, జూన్ 2017, గురువారం

మహావీర్‌ వనస్థలి

చుట్టూ పచ్చని చెట్లు, గెంతులు వేస్తూ.. జింకలు..
ఎండాకాలంలోనూ.. విరబూసే అరుదైన మొక్కలు,
కాంక్రీట్‌ జంగల్‌లోనూ ...అడవిని తలపించే వాతావరణం..
ఇవన్నీ హైదరాబాద్‌, విజయవాడ జాతీయ రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న మహావీర్‌ వనస్థలి సొంతం.
హైదరాబాద్ నుండి విజయవాడ కు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై 15 కిలోమీటర్ల దూరంలో వనస్థలిపురం లో ఉంది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో, ఆటో నగర్ కు అనుకోని దాదాపు మూడువేల ఎకరాల్లో విస్తరించి ఉంది.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్క్  అటవీ శాఖ అధీనంలో ఈ పార్క్ ఉంది.

హైదరాబాద్‌ నుంచి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ జాతీయ పార్క్‌ను ముఫ్పై సంవత్సరాల క్రితం జైన తీర్థంకరుడైన  మహావీర్‌ పేరు మీద ఏర్పాటు చేశారు. దట్టమైన అడవి మాదిరిగా ఉండే ఆ ప్రాంతంలో నిజాం రాజులు వేటకు వచ్చేవారు.. ఇక్కడ ఉన్న వాటిలో బ్లాక్‌ బక్స్‌ (నల్ల రంగు జింకలు), ముళ్ల పందులు, కింగ్‌ఫిషర్స్‌ ఎక్కువగా కనిపిస్తాయి. 189 ఎకరాల సువిశాల మైన ఈ జాతీయ పార్క్‌లో తుమ్మచెట్లు, గడ్డిమైదా నాలు, ఎండాకాలంలో నూ పసుపు వర్ణంలో విరబూసే పూలచెట్లు అనేకం కని పిస్తాయి. 

నిజాం కాలంలో ఈ ప్రదేశాన్ని శికార్ గర్ అని పిలిచేవారు. అప్పుడంతా ఈ ప్రదేశం అరణ్యాలతో, జంతువులతో నిండి ఉండేది. వారు ఏమాత్రం తీరిక దొరికిన వేటాడటానికి వచ్చేవారు. హైదరాబాద్ పాలకులలో చివరి వాడైన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వేటాడడానికి వుపయోగించిన దట్టమైన ఈ అటవీ ప్రాంతమే ప్రస్తుతం వున్న ఈ జింకల పార్కు. హైదరాబాద్‌ పాలకుల వేటస్థలంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు జింకల అభయార ణ్యంగా, అనేక రకాల వన్యప్రాణుల పునరావాస కేంద్రంగా రూపుదిద్దుకుంది.
1994 లో ఈ పార్క్ ని జాతీయ పార్క్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

సందర్శన శాల పార్క్ ఆవరణలో సందర్శన శాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులు కూర్చొని చదువుకునేందుకు లేదా యాత్రికులు కూర్చొనేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి. పాము, తాబేలు, నెమలి, ముంగీస, మొసలి, ఎలుగుబంటీ, జింక మొదలైన జంతువుల బొమ్మలు కనిపిస్తాయి. లోపల ఒక మినీ ధియేటర్ కూడా ఉంది. విద్యార్థులు లేదా యాత్రికులు ధియేటర్ లో కూర్చొని జంతువుల ప్రదర్శన చూడవచ్చు.                                                      

సీతాకోక చిలుకల పార్క్                                                                        సీతాకోక చిలుకల పార్క్ పార్క్ లో చూడవలసిన మరో ప్రదేశం సీతాకోక చిలుకల పార్క్. వివిధ రకాల పూల మొక్కలు ఇక్కడ చూడవచ్చు. సుమారు 20 నుండి 30 రకాల సీతాకోక చిలుకలను పార్క్ లో చూడవచ్చు. జంగల్ సఫారీ జాతీయ పార్క్ లో బస్సు సఫారీ ప్రత్యేక ఆకర్షణ. సుమారు 3 కిలోమీటర్ల మేర బస్సు సఫారీ ఆనందించవచ్చు. మొసలి, పాములు, దుప్పులు, జింకలు, అడవి పందులు, నెమళ్ళు, కోతులు మొదలైన వన్య జంతువులను బస్సులో నుంచి తిలకించవచ్చు.     

ఇందులో వన్య జంతువులే కాక ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. వీటిని విరివిగా ఆయుర్వేద, అల్లోపతి మందులలో వినియోగిస్తుంటారు.

ఈ పార్క్‌లో బ్లాక్‌ బక్స్‌ తప్పక చూడాలి. నలుపు, తెలుపు రంగుల్లో , మెలికలు తిరిగిన కొమ్ముతో కనిపించే ఈ జింకలు అరుదైన జాతి. పార్క్‌ను చూపించే గైడ్‌ ఇక్కడ ఉండే అనేక ప్రాణుల గురించి వివరిస్తారు.

సందర్శించు సమయం :
ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదుగంటలవరకు మాత్రమే
సోమవారం రోజూ పార్క్‌కు సెలవు.
పెద్దలకు ఇరవై రూపాయలు, చిన్నారులకు పదిహేను రూపాయలు చెల్లించి టికెట్‌ తీసుకోవాలి. పార్క్‌లో సఫారి చేయాలనుకునే వారు ప్రత్యేక టికెట్ తీసుకోవాలి.

    హైదరాబాద్ లోని అన్ని ప్రదేశాల నుండి వనస్థలి పురం చేరుకోవటానికి సిటీ బస్సులు ఉంటాయి. కోఠి నుండి 100V నెంబర్ గల బస్సు, సికింద్రాబాద్ నుండి 1V నెంబర్ బస్సు, మెహదీపట్నం నుండి 156V బస్సు మరియు కెపిహెబి కాలనీ నుండి 187D/V బస్సులు వనస్థలిపురం వెళతాయి.
                                                 
Location :
Mahavir Harina Vanasthali National Park
2/B, National Highway 9, Auto Nagar, Vanasthalipuram, Mahavir Harina Vanasthali National Park, Auto Nagar, Hyderabad, Telangana 500070
080081 45143

https://goo.gl/maps/mVxVoo1s8rk

Location : Telangana, India
Coordinates17°36′N 78°47′E
Area14.59 km2 (5.63 sq mi)
Timings : every day 9 am - 6 pm except Mondays .
#AAP #DEERPARK #Vanasthalipuram #hyd #nizam #shikargar #Telangana #forest #nationalpark
#ecotourism #safari #jungle #deers #blackbucks #peacocks #educentre #wildlife . #vanaseva

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...