5, జూన్ 2017, సోమవారం

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.

భూమి వేడెక్కుతోంది. ఇన్నాళ్లూ తల్లిలా చల్లగా చూసిన భూమి భగ్గుమంటోంది. నేలతో పాటు గాలి, నీరు కూడా వేడెక్కుతున్నాయి.
దీంతో అమ్మలాంటి అవని అగ్నిగుండమౌతోంది. కాలాలూ, రుతువులూ గతులు తప్పుతున్నాయి.
గ్లోబల్‌ వార్మింగ్‌ భూగోళానికి మరణతోరణాలు కట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై సాక్షి స్పెషల్‌....
భూమిపై 75 శాతం సముద్రాలు ఉన్నాయి. మిగతా అంతా లాండ్ మాస్. అంటే మనిషి నివసించేందుకు అనుకూలంగా ఉండే ప్రదేశాలు. 100ఏళ్ల నుంచి కాస్త వేగంగా భూమి వేడెక్కుతోంది. ఇంకా చెప్పాలంటే గత 25 సంవత్సరాల్లో ఆ సమస్య మరీ ఎక్కువైందని శాస్ర్తవేత్తలు అంటున్నారు. దీంతో ఆర్కిటిక్‌లోని మంచుకొండలు కరిగిపోతున్నాయని.. సముద్ర మట్టం పెరిగి వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని సర్వేలు గోషిస్తన్నాయి.
వాతావరణంలో సంభవించే మార్పులు భూమిపై నివసించే ప్రతీ జీవిపై ప్రభావం చూపుతాయి. అందుకే గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. వాతావరణాన్ని కలుషితం చేసే చర్యలు మానుకోవాలి. అప్పుడే భూమి వేడెక్కడం తగ్గుతోందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించే ప్రయత్నాలు చేపట్టకపోతే..
భూమి మరో శుక్రగ్రహం అయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పర్యావరణాన్ని కాపాడటానికి అల్టిమేట్‌ మార్గం అంటే చెట్లను పెంచడమే! అయితే దీని కోసం కొన్ని పద్ధతులను ఫాలో అవ్వడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించినవారవుతారు. అందులోని ఐదు అంశాలు!
బ్రష్‌ చేసుకుందామని ట్యాప్‌ దగ్గరికి వెళుతారు కదా. బ్రష్‌ కడిగి దానికి పేస్ట్‌ పెట్టి... బ్రష్‌ నోట్లో పెట్టుకునేంతవరకు నీళ్ల నల్లా బంద్‌ చేయడం మర్చిపోతాం. ఇలా చేయడం వల్ల నిమిషానికి కొన్ని లీటర్ల నీరు వృదా అవుతుంది. అంతేకాదు నల్లా నుంచి చుక్కలుగా నీళ్లు పడుతుంటే డ్రాప్సే కదా అని వదిలేస్తాం. కానీ... సాయంత్రానికల్లా అలా పడిన నీళ్లు కొన్ని లీటర్లవుతాయి. నీటిని వృధా చేయకండి.
రోడ్డుమీదకు వెళ్తే వాహనాల రద్దీ ఇప్పుడొక సమస్య అయిపోయింది. దీని కారణంగా వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. కాబట్టి... మీరు మార్కెట్‌కు వెళ్లాలను కున్నా... రెండు మూడు కిలోమీటర్లలోపు ఇంకెక్కడికైనా వెళ్లాలనుకున్నా మీ మోటార్‌ వెహికిల్‌ను తీయకండి. నడక మొదటి ఆప్షన్‌. సైకిల్‌ ఉంటే ఇంకా మంచిది. మీకు మంచి వ్యాయామం అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పర్యావరణం బాగుంటుంది!
ఫ్లోరోసెంట్‌ లైట్లు ఖరీదు ఎక్కువ కావచ్చు. కానీ... ఒక్కసారి తీసుకుంటే ఎక్కువ కాలం వస్తాయి. అలాగే విద్యుత్‌ కూడా ఆదా అవుతుంది. దీనివల్ల మీ కరెంటు బిల్లు తగ్గుతుంది.
ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఫ్యాన్స్‌, లైట్స్‌ ఆఫ్‌ చేస్తారు. కానీ చార్జింగ్‌ పెట్టిన ప్లగ్‌, టీవీ ప్లగ్‌, సిస్టమ్‌ ప్లగ్‌... ఈ ప్లగ్స్‌ మాత్రం తీసేయరు. దీనివల్ల కూడా విద్యుత్‌ వృధా అవుతుంది. కాబట్టి బయటికి వెళ్లేముందు, వాడనప్పుడు అన్నింటినీ ఆఫ్‌ చేసేయండి. దీనివల్ల కరెంట్‌ బిల్లు తగ్గుతుంది.
మీ ఇంటికి పోస్ట్‌లో కుప్పలు తెప్పలుగా బిల్లులు వస్తుంటాయి. బిల్లు చూడగానే వెంటనే పక్కన పడేస్తారు. కానీ... ఆ పేపర్‌ ఎంతో విలువైనది. అందుకే బిల్లులు అలా రాకుండా, రిసిప్ట్‌ పేపర్‌ వేస్ట్‌ కాకుండా ఉండాలంటే ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించండి. హార్డ్‌ కాపీస్‌ ఇంటికి పంపొద్దని వారికి లెటర్‌ పెట్టండి. దీనివల్ల కొన్ని చెట్లను బతికించినవారవుతారు... తద్వారా భూమిని కాపాడినవారవుతారు.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...