3, జూన్ 2017, శనివారం

పురాతన వస్తువులకు చిరునామా ఇక్బాల్ ఇల్లు.

అభిరుచులు అందరికీ ఉంటాయి. అందరిలో కొందరు మాత్రమే ఆసక్తితో తమ అభి రుచులను నెరవేర్చుకుంటారు. కొంతమంది చిన్న నాటి నుంచే వారికంటూ కొన్ని అభిరుచులను ఏర్పరచుకుంటారు. ఆట వస్తువులు, బొమ్మలను సేకరిస్తూ తమ మనసును ఆనందంతో నింపేసుకుంటారు. చిరు ప్రాయంలో చేసే ఈ చిన్ని ప్రయత్నాలే అర్ధవంతమైన హాబీలుగా మారి వారి ప్రత్యేకతను చాటుకుంటాయి. ఇలాంటి కోవకు చెందిన వారే షేక్ ఇక్బాల్.  ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లా  , తిరువూరు కి చెందిన ఇక్బాల్ ఉద్యోగరీత్య ల్యాబ్ టెక్నీషియన్  వరంగల్ కి  వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. చదువుకునే వయసులోనే టీవీ లో ఒక కార్యక్రమంలో కోల్ కతా కి చెందిన ఒక వ్యక్తి రకరకాలనాణేల సేకరణ గురించిన కార్యక్రమం ప్రసారం అయింది. ఆ కార్యక్రమాన్ని చూసిన ఇక్బాల్ తాను కూడా అలా నాణేలు  సేకరించి భద్రపర్చాలనే అభిరుచికి నాంది పలికారు.ఎన్నో మరుపురాని జ్ఞాపకాలను పదిలం చేసి నేటి తరానికి అందిస్తున్నారు. చిన్నతనం నుంచి మొదలైన అభిరుచిని 50 సంవత్సరాల వయస్సులోను నిత్యనూతనంగా కొనసాగించడం అద్భుతమే.
పాఠశాల స్ధాయి నుంచి మొదలైన దేశ,విదేశాల నాణేల సేకరణ, కరెన్సీ నోట్లు,  ప్రాచీన తూనికలు , పెయింటింగ్స్, టెలిస్కోప్ , రికార్డర్లు, ఇసుక టైమర్స్ , అతి చిన్న ఖురాన్ , గ్రాహంబెల్ ఫోన్ , అతి చిన్న వెండి త్రాసు , బ్రిటిష్ కాలం నాటి లాంతర్లు, ప్రాచీన కాలం నాటి కంచు గ్లాసులు ,రాగి మర చెంబులు , కలశెలు, తదితర వస్తువులను మినీ మ్యూజియం రూపంలో పొందుపరచి నేటి తరానికి ప్రాచీన కాలం నాటి విజ్ఞానాన్ని పంచుతున్నారు. ఈ మ్యూజియం లో ఉన్న వస్తువులను చూస్తే బ్రిటిష్ కాలం నాటి ,  నిజాం కాలం కాటి సమకాలిన అంశాలు సైతం మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.
కాణి, పైసా, అణా, బేడ.. ఈ పదాలు ఎంతమందికి గుర్తున్నాయి. ఒకప్పుడు మనం వీటిని డబ్బులుగా వినియోగించేవాళ్ళం. అలా గత చరిత్రను గుర్తుచేసుకునేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం నాణేల సేకరణ.

అబ్బురపర్చే సేకరణ…
*  దాదాపు 170 పైగా దేశాలకు దేశాలకు చెందిన కరెన్సీ , నాణేలు, భారతదేశం కి చెందినపురాతన కాలం నాటి రాగి నాణేలు, అణా పైస నుంచి మొదలు రూ. 500ల నాణేం వరకు సేకరించారు.
*  ఇరాక్, ఇరాన్, ఉగండా, టాంజానియా, మారిషస్, శ్రీలంకా, బెహరాన్, దక్షిణా ఆఫ్రికా, అమెరికా తదితర దేశాల పోస్టల్ స్టాంపులను సేకరించారు.

* 1818 వ సంవత్సరం లో ముద్రించిన శ్రీ రామ పట్టాభిషేకం ముద్ర ఉన్న నాణెం
*  గాంధీజీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంఘటనల ఛాయాచిత్రాలు , గాంధీజీ ఫోటో తో కూడిన పోస్ట్ కార్డులు , ఇతర సమాచారం తో కూడిన 50 కిలోల బరువైన ఆల్బమ్ ని రూపొందించారు.
* బ్రిటిష్ పరిపాలన కాలం లో  నాటి ఉన్నతోద్యోగులు తమ కింది స్థాయి  ఉదోగులకు
* చెక్కు చెదరని బంగారు చిత్రం ప్రత్యేక ఆకర్షణ
మొఘల్ సామ్రాజ్యాధినేత అక్బర్ కాలం లో బంగారు వర్ణంతో వేసిన పెయింటింగ్ ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది. నాటి కాగితం నేటి వరకు చిరగకపోగా చిత్రం మాత్రం కాంతులినితు ఉంది. ఆ చిత్రం చుట్టూ అరబిక్ భాషలో ఎదో రాసి ఉంది.
*  చోళ , గుప్త , శాతవాహన , విజయనగర, ఢిల్లీ సుల్తానుల , హైదరాబాద్ నిజాం ల కాలం నాటి నాణాలు 1000 కి పైగా ( బంగారు , వెండి , రాగి , మట్టి ) .
*  1854 నుండి నేటి వరకు ఉపయోగం లో ఉన్న అనేక రకాల స్తాంపులు.
100 పైగా రకాల ఓపెనర్లు( సిసలు మూత తీయడానికి ఉపయోగించే పరికరం)
* డిజైన్స్ గల కోట్ బటన్స్
* 10 కిలోమీటర్ల దూరం సైతం చూడగల టెలిస్కోప్
*   ఈస్ట్ ఇండియా కాలం నాటి కిరోసిన్ స్టవ్ ( దీనిని 5 లక్షలకు  వేలం లో కొనుగోలు చేశారు )
* నిజాం నవాబుల ఇస్రి పెట్టె
*  అలారం
*  మొగలుల కాలం నాటి అతి చిన్న ఖురాన్
*   తాళపత్ర గ్రంధాలు
*     మొఘలుల , టిప్పు సుల్తానుల కాలం నాటి కాన్వాస్ పెయింటింగ్స్.
*     గ్రామ్ ఫోన్ రికార్డ్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ లో ని పబ్లిక్ గార్డెన్స్ లో ఉన్న టౌన్ హాల్ ప్రాంగణంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు.
ఈ ప్రదర్శనని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి Amrapali kata Amrapali IAS
, వరంగల్ పశ్శిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ , వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్  తదితరులు ప్రారంభించారు

పురాతన కాలం నాటి చారిత్రాక , సాంస్కృతిక విషయాలను ఎన్నింటినో వీటి ద్వారా తెలుసుకోవచ్చు.
గత కాలంనాటి చిహ్నలను  ,భవిష్యత్ తరాలకు అందజేయడం కోసమే తాను ఈ వస్తువుల సేకరణ చేపట్టినట్లు ఇక్బాల్ తెలిపారు.

Youtube : https://youtu.be/4AR5-4zeLTk
Interview : Aravind Arya Pakide  Public Garden Hanamkonda
Town hall

#AAP #HNK #ANTIQ #WARANGAL #HERITAGE

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...