20, మే 2017, శనివారం

Red FM WATER BOTTEL CHALLENGE

వేసవికాలం వచ్చేసింది. 
భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలు వరకు చేరుతున్నాయి.
వివిధ పనుల నిమిత్తం ప్రయాణాలు చేసే వారు , రోజువారీ కూలీలు , చిరుద్యోగులు  దప్పికతో అల్లాడుతున్నారు. వారి దాహార్తి ని తీర్చడానికి  93.5 FM వారు  అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వరంగల్ ప్రజలకు చల్లని మంచినీటిని అందించడం కోసం వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక స్టాల్స్ ని ఏర్పాటు చేసిరేడియో జాకీలు RJ విక్కి ( RJ Vicky )  , సుభోద చేతులమీదుగా   రోజుకి దాదాపు 2000 పైగా వాటర్ బాటిల్స్ ని అందజేస్తున్నారు.
విదేశాల్లో సరదా కోసం ఐస్ బకెట్ ఛాలెంజ్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఐస్ బకెట్ ఛాలెంజ్ ఎలా ఉన్నా , వరంగల్  రెడ్ ఎఫ్.ఎం వాళ్ళు మాత్రం వాటర్ బాటిల్ ఛాలెంజ్ ను ప్రవేశ పెట్టారు. ఈ హాట్ సమ్మర్ లో తోటి వారికి తాగడానికి కొంచెం నీరు ఇచ్చి సహాయం చేయాలనే తలంపు తో ఈ ఛాలెంజ్ ను ప్రవేశపెట్టారు. మన చుట్టూ పక్కల ఉన్న తోటికి వారికి మన దగ్గర ఉన్న బాటిల్ నీటిలో కొంచెం వారికి ఇచ్చి తోటివారి దాహార్తిని తీర్చడమే ఈ ఛాలెంజ్ లక్ష్యం. ఇప్పటికే ఈ ఛాలెంజ్ కు  పలువురు ప్రముఖులు మద్దతు తెలపగా, ప్రజలు కూడా తమ వంతుగా మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ ఛాలెంజ్ ను ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా స్వీకరించి తమతో పంచుకోవాలని రెడ్ ఎఫ్ఎం  తెలిపింది. అందులో భాగంగా మొట్టమొదట తోపుడు బండి సాధిక్ అలీ  ( Sheik Sadiq Ali ) 100 వాటర్ బాటిల్స్ ని స్పాన్సర్ చేశారు.
వారికి రెడ్ fm యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేశారు.
మండుటెండల్లో దాహార్తి తీర్చడానికి రెడ్ ఎఫ్ఎం చేపట్టిన వాటర్ బాటిల్ ఛాలెంజ్ ను మనం కూడా స్వీకరిద్దాం. తోటివారి దాహార్తి తీరుద్దాం.

#REDFM #WATER #BOTTEL #CHALLENGE #WARANGAL

షోయబ్ ఉల్లాఖాన్

షోయబ్ ఉల్లాఖాన్ 1920, అక్టోబరు 17 న ఖమ్మం జిల్లా సుబ్రవేడు లో జన్మించిన తెలంగాణా యోధుడు .  బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగ...