3, మే 2017, బుధవారం

తెలంగాణా వస్తె ఏమొస్తది? - Ravi chettu Rajeshwar.

“ఓ తెలంగాణాయన ముఖ్యమంత్రి ఐతడు! గంతే! ఇప్పుడు ఆంధ్రోల్లు జర భయంగ ఉంటాండ్రు, అదే మన తెలంగాణోడు వస్తే మనల గఫ్లత్ చేస్తడు, గల్లంతు చేస్తడు” అంటూ డౌటింగ్ ధామస్‌లు ఎప్పుడూ అనెటోళ్ళు. 

గతపాతికేళ్ళలో (1992-2017) వరంగల్ కెంద్ర కారాగారానికి మూడు సార్లు వెళ్ళాను.  నాలుగోసారి నిన్న తొపుడుబండి తరఫున Sheik Sadiq Ali వ్యక్తిత్వ వికాసం, అధ్యాత్మిక విషయాలపై వేయికిపైగా పుస్తకాలను జైలు గ్రంధాలయానికి బహూకరించిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి Aravind Arya Pakide కలిసివెళ్ళాము.  గతం‌లో చూసినవాళ్ళు మళ్ళీ ఓసారి వెళ్ళండి.

లోనకు వెళ్తూంటే ఓ కార్పొరేట్ కార్యాలయంలా అనిపించింది – పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం. అది కారాగారంగాకంటే, ఓ కర్మాగారంగా కనిపించింది. డరీలు, తివాచీలు, నేత బట్టలు, సబ్బులు, కలపతో బెంచీలు, స్టీలుతో రెండంచెల పడకలు తయారుచేస్తున్నారు. నాణ్యతవిషయం‌లొ రాజీలేకపోవడం, అమ్మకాలపై పన్నుల మినహాయింపు, నేరుగా వినియోగదారులకే విక్రయించడంవల్ల మార్కెట్‌కంటే తక్కువ ధరకే అందించగల్గుతున్నామని సూపరింటెండెంట్ సంపత్ చెప్పారు.   వాళ్ళు ఖైదీల్లాకాకుండా, స్వచ్చంద కార్మికుల్లా పనిచేసుకుంటున్నారు. వాళ్ళముఖాల్లో కళ, కళ్ళలో ఆనందం  చూడగానే తెలిసిపోతూంది వాళ్ళు రోజూ వ్యాయామం, మెడిటేషన్ చేస్తున్నన్నరని.

“ఖైదీల్లో అత్యధికులు నిరక్షరాస్యులు. ఇందులోకి వచ్చినవారు మూడునెలల్లో అక్షరాస్యత సాధించిన తర్వాతనే వారిని ఫాక్టరీలోకి తీసుకుంటాము, అప్పటినుండే వేతన చెల్లింపు జరుగుతుందనీ” సూపరింటెండెంట్ చెప్పారు.
 
ఇదంతా మీకో అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ అక్షరాలా నిజం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డతర్వాత జైళ్ళ డైరెక్టర్ తమది “అవినీతిరహిత’ శాఖగా ప్రకటించి ‘అందుకు భిన్నంగా ఆధారాలు చూపిస్తే (ఆరోపణలు కాకుండా) రూ ఐదువేలు బహుమానంగా ఇస్తామ’ని ప్రకటించారు.

సినిమాల్లో హీరో ఏకధాటిగా వందమందిని చితగ్గొట్టేస్తే సరదాగా తీసుకునే మనం అదే సినిమాల్లోనూ, టీవీ సీరియళ్ళలోనూ జైళ్ళలో ఇలా దుర్మార్గం జరుగుతున్నదని ఛూపిస్తే ఖచ్చితంగా అంతేననీ, ఇంకాస్తా ఎక్కువేఉందనీ నమ్మేస్తాం.

“జైళ్ళు అవినీతి రహితమని మీరు విశ్వసిస్తున్నారా” అని సూపరింటెండెంట్ సంపత్‌గారినడిగితే “99% అవినీతి రహితం. అరవైఏళ్ళ పాలనాకాలం‌లో అవినీతినిండి ఉండటంవల్ల ఒక్క శాతం వెసులుబాటుగా (margin)గా ఉంచా”నన్నారు.

“ఖైదీలవద్ద తరచుగా మొబైళ్ళు, సిం‌కార్డులూ దొరుకుతున్నాయికదా’ అంటే ‘నేరపూరిత స్వభావంకలవాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రయత్నంచేస్తూనే ఉంటారు, మేము నిరోధిస్తూంటాము, ఇది నిరంతర ప్రక్రియ, మేము నిజాయితీగా  ఈప్రయత్నాలను అదుపు చేయగల్గుతున్నాం అనిమాత్రం ఘంటాపధంగా చెప్పగలను’ అని సంపత్ అన్నారు.

తెలంగాణలో వికాసం దిశగా మార్పు మొదలైంది. మీరుకూడా ఓ సారి సందర్శించండి. భిన్నంగా ఉంటే నా అభిప్రాయాల్ని మార్చుకోవడానికి సిధ్ధం

జైలర్లు శ్రీనివాసరావు, శివకృష్ణలతో పాటు సందర్శనలో తోడున్న ఇతర జైలు సిబ్బందికి కృతజ్ఞతలు.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...