9, మే 2017, మంగళవారం

మెట్ల బావి అభివృద్ధి .

రూ.9.80 లక్షలతో కాకతీయుల మెట్లబావి అభివృద్ధి

కాకతీయుల కాలం నాటి మెట్ల బావి అభివృద్ధికి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ రూ.9.80 లక్షలు మంజూరు చేశారు. రెండు దశల్లో అభివృద్ధి చేసేలా నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీచేశారు. కాకతీయుల కాలం నాటి మెట్ల బావి దుస్థితిని వివరిస్తూ  వెలువడిన పత్రికా  కథనాలను చూసి స్థానిక  ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు స్పందించి రంజాన్‌ పర్వదినాన బావిని సందర్శించారు. అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అప్పట్లో ఇచ్చిన హమీ మేరకు ఎమ్మెల్యే నిధులు మంజూరు చేశారు. ఈ నిధులలో బావి చుట్టూ ప్రహరీ నిర్మాణంతోపాటు రెయిలింగ్‌ పనులు చేయనున్నారు. మహా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టాలని అర్బన్‌ జిల్లా కలెక్టర్‌  ఈ రోజు ఆదేశాలు జారీచేశారు.
బావి పునరుద్ధరణతో పాటు నీటి శుద్ధి, బావి వరకు ప్రధాన రోడ్డు నుంచి సీసీరోడ్డు నిర్మాణం, సందర్శకులకు స్థానికంగా వసతులు కల్పిస్తే పర్యటకుల సంఖ్య పెరుగుతుందని కలెక్టరు, కమిషనర్‌ అభిప్రాయపడ్డారు.
THANKS TO #AMRAPALI IAS  గారు.

#AAP #metlabhavi #kakatiya #heritage #GWMC #WARANGAL

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...