1, మే 2017, సోమవారం

వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం - పేర్వారం రాములు సందర్శన.

కళ్యాణ మండపాన్ని  త్వరగా పునరుద్ధరించాలి.  పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు.

కాకతీయుల కళా ప్రాభవానికి ఆ కళాఖండ సజీవ సాక్ష్యం. చరిత్రకారులు, పర్యాటకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న అపురూప కట్టడం.
ప్రాచీన శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం.
అటువంటి కట్టడం ఇప్పుడు నిర్లక్ష్యపు చీకట్లలో మగ్గిపోతోంది. ఆ కళాఖండానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పదేళ్ల క్రితం ప్రారంభించిన పనులు సజావుగా ముందుకు పడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయ అభివృద్ధి పనులను వచ్చే ఏడాది కాలంలో పూర్తి చేయడానికి  కేంద్ర పురావస్తు శాఖ తగిన చర్యలు చేపట్టాలని
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు కోరారు.
ఓరుగల్లు జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన వేయిస్తంభాల ఆలయ కళ్యాణ మండపం పునర్నిర్మాణం  పనులు పదేళ్ల క్రితం ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ పూర్తి కాలేదు.
వేయి స్తంభాల ఆలయాన్ని సందర్శిస్తున్న పర్యాటకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు కళ్యాణ మండపాన్ని
ఇంటాక్‌ కన్వీనర్ పాండురంగరావు,  పురావస్తుశాఖ అధికారులతో కలిసి శనివారం ఉదయం ఆయన సందర్శించారు.
మండపం మొత్తం కలియ తిరుగుతూ ఆగిపోయిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు ఆగిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం  పేర్వారం రాములు మాట్లాడుతూ..
గతంలో కళ్యాణ మండపం అత్యత్భుతం గా ఉండేదని , తాము చిన్నప్పుడు మండపం ప్రాంగణం లో చదువుకునే వారమని , తన చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు.  
వేయిస్తంభాల ఆలయ కళ్యాణ మండపం కూలిపోయో పరిస్థితి లో ఉండడం తో 2006 లో కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో విప్పారని , త్వరగా పూర్తి చేయాలని అనుకున్నప్పటికి పనులలో ఉండే క్లిష్టత కారణముగా పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. నాటి కాకతీయుల కాలంలో ఉపయోగించిన పరిజ్ఞానం ఆధారంగా కట్టడం మరో 1000 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండే విధంగా నిర్మాణం చేస్తున్నారని అన్నారు.
పునర్నిర్మాణం లో అనేక సమస్యలున్నాయని  భద్రకాళి చెరువు నుండి  కళ్యాణ మండపం కింద నుండి వేయి స్తంభాల దేవాలయ కొనేరుకి నీటి పారుదల వ్యవస్థ ఉందని , అది దెబ్బ తినడంతో కళ్యాణ మండపం కుంగిపోయిందన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో క్రమపద్ధతిలో నిర్మాణం చేయడానికి సమయం పడుతుందని తెలిపారు.
శిల్పి శివకుమార్ కి  రావలిసిన కొన్ని బిల్లులు పెండింగ్ లో ఉండడం మూలాన పనులు ఆగిపోయాయని వాటిని సత్వరమే చెల్లించి పనులు ప్రారంభం అయే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
అవసరం అయితే  త్వరలో దిల్లీ వెళ్లి సమస్యను సదరుశాఖ కేంద్రశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో విడుదల చేయించి వచ్చే ఉగాది వరకు వేయిస్తంభాల ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పురావస్తు , పర్యాటక శాఖ ల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో కేంద్ర పురవస్తుశాఖ జిల్లా అధికారి మల్లేశ్‌,  చరిత్ర పరిశోధకులు అరవింద్ ఆర్య , టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ సూర్య కిరణ్
పురావస్తు శాఖఅధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్నీ వివరాలు :

2005 జులై13న కల్యాణ మండపం పునర్నిర్మాణం ప్రారంభం......

పునరుద్ధరణ పనులు ప్రారంభించి దశాబ్ధ కాలం గడిచిపోయింది. కానీ ఇంతవరకు ఒక కొలిక్కిరాలేదు. కల్యాణ మండపం పునరుద్ధరణ పనుల పరిస్థితీ అంతే. పురావస్తు శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.  పైకప్పు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కల్యాణ మండలం పునర్నిర్మాణ పనులు 2005 జులై 13న ప్రారంభమయ్యాయి. పాత కల్యాణ మండపం శిలలను ఒక్కొక్కటిగా తొలగించిన తర్వాత ఏళ్లతరబడి పనులు ముందుకు సాగలేదు. 2010 ఫిబ్రవరి 25న మళ్లీ మొదలు పెట్టారు. తమిళనాడుకు చెందిన 50 మంది శిల్పులు 132 కొత్త స్తంభాలు, 160 బీమ్‌లు చెక్కారు. శాండ్‌బాక్స్‌ టెక్నాలజీ ఆధారంగా పనులు చేపట్టారు. డంగుసున్న, గ్రాన్యువల్‌ ఫైల్స్‌తో కూడిన లేయర్‌ను నిర్మించారు. ఏడు వరుసల రాతి నిర్మాణంతో ప్రదక్షిణ పథకం నిర్మించారు. ఆపై రాతి గోడ నిర్మాణం పూర్తి చేశారు. భూకంపాలను సైతం తట్టుకుని నిలిచే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. శిలలను రాతి పట్టీలతో అమర్చారు. కిందా మీద పడుతూ 2015 ఆగస్టు నాటికి పైకప్పు మినహా, మిగిలిన పనులు పూర్తయ్యాయి. నిధుల కొరతతో మూడు నెలలుగా పైకప్పుపనులు నిలిచిపోయాయి. వేయి స్తంభాల దేవాలయానికి వచ్చిన సందర్శకుల్లో ఎవరూ కూడా సంతృప్తితో తిగిరి వెళ్లడంలేదు.పునరుద్ధరణ పనుల కారణంగా...పునరుద్ధరణ పనుల కారణంగా దేవాలయం చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో సందర్శకులు దూరం నుంచే చూడాల్సి వస్తోంది. ఇక్కడున్న అద్భుత శిల్పకళా సంపదనను దగ్గరుండి చూస్తే కలిగే అనుభూతి వేరు. వేయి స్తంభాల గుడిని దూరం నుంచి కాకుండా దగ్గర నుంచి చూసి తరించే మహద్భాగ్యం కలిగించాలని కోరుతున్నారు.ఆగిపోయిన పునర్నిర్మాణ పునఃప్రారంభించాలని...వరంగల్‌ వేయి స్తంభాల గుడికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆగిపోయిన పునర్నిర్మాణ పునఃప్రారంభించాలని సందర్శకులు, ప్రజలు కోరుతున్నారు. చారిత్రక, వారసత్వ సంపద కాలగర్భంలో కలిసిపోకుండా చూడాలని విన్నవిస్తున్నారు. ఇక్కడున్న అపురూ శిల్పకళా సంపంద శిథిలసమాధికాక ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...