1, మే 2017, సోమవారం

అంతర్జాతీయ నృత్య దినోత్సవం

*💃🏻🦋💃🏻నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా....*💃🏻🦋💃🏻

అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982 లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ చే ప్రారంభించబడింది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు.

ఈ రోజున జరుపుకొనాలనే సూచనను ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యిచ్చినది. 1760 లో ప్రచురించబడిన ప్రముఖ రచన Lettres sur la dabance యొక్క రచయిత మరియు ఆధునిక నృత్యనాటికల సృష్టి కర్త అయిన జీన్-నోవెర్రీ (1727-1810) యొక్క జన్మ దినాన్ని పురస్కరించుకొని ఆదినాన్ని అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించారు.

భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నాట్య, నృత్య రీతులను భారతీయ నాట్యం లేదా భారతీయ నృత్యం అంటారు. భారత్ లో అనేక నాట్యరీతులు కనపడతాయి.

శాస్త్రీయంగా చూస్తే, ప్రతి రాష్ట్రంలోనూ సాంస్కృతిక నాట్యములు ఉన్నాయి.. అలాగే భారతీయ నాట్యరీతులు అనేక రకాలు. వీటిని ప్రధానంగా రెండు విధాలుగా వర్గీకరించవచ్చు
1. సంప్రదాయ నృత్యాలు లేదా శాస్త్రీయ నృత్యాలు
2. జానపద, గిరిజన నృత్యాలు.

ఇవే కాకుండా ప్రస్తుతం అన్ని రీతులనూ, ప్రధానంగా పాశ్చాత్య, దేశీయ విదానాలను మేళవించి రూపొందించిన నృత్య విధానాలు ప్రస్తుతం జనాదరణ కలిగి ఉన్నాయి. సినిమా రంగంలో ఇవి ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.
వీటిని "ఆధునిక నృత్యాలు" అనవచ్చు.

శాస్త్రీయ నాట్యరీతులు
*.* కూచిపూడి (నృత్యము)
*.* భరతనాట్యం
*.* కథక్
*.* కథకళి
*.* మణిపురి (నృత్యం)
*.* ఒడిస్సీ
*.* మోహినీ ఆట్టం
*.* సత్త్రియ నృత్యం

జానపద నాట్యరీతులు
*.వీధి నాటకం,
*.బుర్రకథ,
*.గంటమర్ధాల,
*.కోలాటం,
*.పేరిణి,*.
తోలుబొమ్మలాట,
*ధింసా నృత్యం,
*చిందు నృత్యం .

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...