1, మే 2017, సోమవారం

దామరవాయి సమాధులు

చందమామ మీద కాలు మోపగలిగి , 4 G , 5G నెట్వర్కు లు వాడుతూ సాంకేతిక యుగంలో ఉన్న మనకు పాతరాతి యుగం నాటి ప్రస్తావన విచిత్రంగానే ఉన్నప్పటికీ  గోదావరి నది పరివాహక ప్రాంతం లోని ఏటూరునాగారం , మంగపేట , తాడ్వాయి పరిసర  ప్రాంతాలలో ఉన్న వేలాది రాకాసి గుహలు , నాటి అదిమానవుని  ఉనికిని తెలపడమే కాకుండా ఈ ప్రాంతం లోని మానవ జాతుల పరిణామ క్రమాన్ని తెలియజేసే చారిత్రిక సాక్షాలుగా కనిపిస్తున్నాయి.

వరంగల్ నుండి 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి అడవుల్లో దామర వాయి గ్రామ సరిహద్దు లో పాత రాతి యుగం నాటి

మధ్య కాలం లో సుమారు  సంవత్సరాల క్రితం నిర్మించబడిన దాదాపు 150 సమాధులు  ఇటీవల మరోసారి వెలుగులోకి వచ్చాయి.

గత ప్రభుత్వాల నిర్లక్షానికి , చరిత్ర కారుల నిరాదరణకు గురైన ఈ మానవ నిర్మిత సమాధులు గోదావరి నది పరివాహక ప్రాంతాలలో  నాటి పాత రాతి యుగం నాటి మానవుల ఆచార , వ్యవహారాలను , వృత్తి ప్రవృత్తులను , సాంఘిక కట్టుబాట్లను ,జీవన విధానాన్ని  పరిశోధించి తెలుసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

ఈ రాకాసి గుహలను పరిశోధించడానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మా బృందం దామర వాయి అడవుల్లో పర్యటించి అనేక విషయాలను సేకరించింది.

భూపాల పల్లి జిల్లాలోని తాడ్వాయి మండలం దామర వాయి గ్రామానికి అనుకుని ఉన్న సూర గొండయ్యా గుట్టపై  అక్కడి గిరిజన కోయజాతి ఆదివాసీలు ఆరాధ్య దైవం గా భావించే  గుట్ట పై ఈ రాక్షస గుహలు సుమారు 150 పై గా ఉన్నాయి. వీటిని స్థానికులు రాక్షస గుహలు , రాకాసి గుహలు గా పిలుస్తారు .

పురాతన కాలంలో రాక్షస జాతులకు సంబందించిన సమాధులుగా ఇక్కడి ప్రజలు భావించడం మూలాన వీటి గురించి అంతగా మాట్లాడడానికి ఎవరు కూడా ఇష్ట పడటం లేదు.

వారు చెప్పిన వివరాల ప్రకారం “ మా తాత , ముత్తాత ల కాలం నుండి వీటిని చూస్తున్నాం .రాక్షసుల శవాలను వాటిలో పాతి పెట్టారని  మా పూర్వీకులు చెప్పారు.

ఎప్పటికైనా చనిపోయిన రాక్షసులు మళ్ళీ ఎప్పటికైనా బతికి వస్తారనే నమ్మకంతో సమాధిలో చిన్న నీటి తొట్టిని , బయటకు రావడానికి ఒక చిన్న దారిని వదిలివేశారు. అని ఆ గ్రామాల ప్రజలు నమ్ముతున్నారు.

అయితే ఈ రాకాసి గుహలు కాలక్రమంలో కొన్ని శిథిలం కాగా , మరికొన్ని గుహాలకు చెందిన బండరాళ్లను  స్థానికులు తమ గృహ నిర్మాణ అవసరాలకు తరలించారు. గుహ లోని నీటి తోట్లను కొందరు తీసుకుని వెళ్లారు.

గతంలో పురావస్తు శాఖ నిర్లక్షం కారణంగా నాటి అదిమానవుల సమాధులు నేడు క్రూర మృగాలకు నివాసం గా మారాయి.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...