7, మే 2017, ఆదివారం

తోపుడు బండి - సాధిక్ అలీ

తెలుగు భాష అభ్యున్నతి పాటుపడుతున్న ఒక మంచి వ్యక్తి సాదిక్ అన్న కి అభినందనలు...

సాహితీ పిపాసి...
బహుదూరపు బాటసారి..
పాత్రికేయుడు..
పర్వతారోహకుడు..
శోధకుడు..
సాధకుడు..
నిత్యాన్వేషి..
సత్యాన్వేషి..
స్నేహశీలి..
సహృధయులు ఐన  సాధిఖ్ గారితో....

తినడానికి లేకపోయినా పుస్తకాలు కొనేవాళ్లు… పుస్తకాలున్నా చదివే ఇంట్రెస్ట్ లేనివాళ్లు చాలామందే ఉన్నారు.
పుస్తకం విలువ దాన్ని చదివేవాడికే తెలుస్తుంది. చదివేవాడికి, చదవనివాడికి తేడా…
వాళ్లతో మాట్లాడేవాళ్లకి తెలుస్తుంది.
ఇలాంటి పుస్తకాల ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించాలనే తాపత్రయం తో నిరుపేద , గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అమూల్యమైన పుస్తకాలను ఉచితంగా అందజేసి
మండే ఎండల్లో  , ఉష్ణోగ్రత లను లెక్క చేయక , ఎండనక వాననక , అహర్నిశలు అనుకున్న ఆశయం కోసం 100 రోజులలో 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వేలాది గ్రామాలను , లక్షలాది విద్యార్థులను పలకరించిన మహా మనిషి .షేక్ సాధిక్ అలీ గారు.
ఆస్తులు కరిగిపోవచ్చు,
ధనం దొంగలపాలు కావచ్చు,అనుబంధాలు చెరిగిపోవచ్చు...
కానీ,విజ్ఞానం అలా కాదు...
ఒక్కసారి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే...
తనువు అంతమయ్యేవరకు అది జీవితాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది.
అంతేకాదు...
చోరులకుదొరకనిది,
అగ్నికి అంటనిది,నీట మునికి కనుమరుగు కానిది విజ్ఞానం ఒక్కటే...
అంతటి మహోన్నత విజ్ఞానాన్ని పళ్లెంలో పెట్టి అందించేదే‘పుస్తకం’...
అందుకే పుస్తకం హస్తభూషణం అంటారు పెద్దలు...
అలాంటి పుస్తకాలను వేలాది మందికి చేర్చిన సాధిక్ భాయ్ కి అభినందనలు...
#AAP
#తోపుడుబండి
#topudubandi
Sheik Sadiq Ali
#జయహోతోపుడుబండి

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...