2, మే 2017, మంగళవారం

ఖుష్ మహల్


కాకతీయ కట్టడాల పర్యటన గాని, ప్రత్యేకించి వరంగల్ కోట పర్యటన గాని ఆ కోట మధ్యలోనే ఉన్న ఖుష్ మహల్‌ను దర్శిస్తేగాని పూర్తికాదు.
ఇది వరంగల్ కాకతీయుల కోట మధ్యలో ఉన్న కాకతీయ తోరణాలకు దగ్గరనే ఉంది. ఆ తోరణాల మధ్య దొరికిన స్వయంభు దేవాలయ శిథిల శిల్పాలను సైతం ప్రస్తుతం ఈ ఖుష్ మహల్‌లోనే భద్రపరిచారు. పర్యాటకులు వాటిని చూసి ఆశ్చర్య చకితులవుతుం టారు. లోతైన ఆలోచనల్లోకి వెళుతూ ఉంటారు.
ఖుష్‌మహల్ మరో పేరు ‘షితాబ్ ఖాన్ సౌధం’. షితాబ్ ఖాన్ అనే వరంగల్ రాష్ట్రపు రాజు క్రీ.శ.1500 ప్రాంతంలో ఆ సౌధాన్ని కట్టించాడు. ఆయన అసలు పేరు సీతాపతి. ఆయన క్రీ.శ. 1504 జనవరి 21 నాడు వేయించిన శిలా శాసనం వరంగల్ కోటలోని దక్షిణ తోరణం దగ్గర దొరికింది. ఆయన మంత్రి ఎనుములూరి పె ద్దన పోషణలో చరిగొండ ధర్మన్న అనే కవి ‘చిత్రభారతం’ అన్న అ ద్భుతమైన కావ్యం రాశాడు. సమకాలిక ముస్లిం చరిత్రకారుల రచనల్లో కూడా షితాబ్ ఖాన్ ప్రస్తావించబడ్డాడు.
సీతాపతి బోయ కులానికి చెందినవాడు. బోయ కులం అంటే ‘భోగం కులం’ అని కొందరు, ‘భోజ కులం’ అని మరికొందరు వ్యా ఖ్యానిస్తున్నారు. ‘భోజ’ అనేది గ్రామాధికారుల కులం. ఏదేమైనా సీతాపతే షితాబ్ ఖాన్ అయ్యాడు.
సీతాపతి తండ్రీ, అతడి తాతలు విలువిద్యలో, మల్లయుద్ధంలో నిష్ణాతులు. షితాబ్ ఖాన్ ఆ విద్యలను నేర్చుకొని క్రీ.శ.14వ శతాబ్ది చివరి దశాబ్దాల్లో ఓరుగల్లు (తెలంగాణ) రాజ్యాన్ని పాలిస్తున్న బహమనీ సుల్తానుల సైన్యంలో సైనికుడిగా చేరాడు. ఆయన తన యుద్ధవిద్యలతో వారిని మెప్పించి, ముస్లిం మతంలోకి మారి తన పేరును సీతాపతి నుండి షితాబ్ ఖాన్‌గా మార్చుకొన్నాడు. ఇలా వారి అభిమానాన్ని చూరగొని, ఓరుగల్లు దుర్గాధిపతిగా, తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా ఎ దిగాడు. అడ్డువచ్చిన రాజాద్రి (రాచకొండ, నల్గొండ జిల్లా) రాజులనూ జయించాడు.
తన సార్వభౌములైన ముస్లిం రాజులను సంతృప్తి పరచడం కోసం షితాబ్ ఖాన్ వరంగల్ కోటలోనే రాజ దర్బార్ కట్టించాడు. వరంగల్ కోట కొన్ని శతాబ్దాల కాలం తెలుగు వారి రాజధాని కాబట్టి ప్రజల మనోభావాలను సంతృప్తి పరచడం కోసం కూడా ఆ కోటలోనే ఈ రాజదర్బార్ కట్టడానికి ఒక ప్రధాన కారణమయ్యుంటుంది. అది తెలంగాణలోను, యావత్ తెలుగుదేశంలోనూ కట్టిన మొట్ట మొదటి ప్రజా భవనం. అందులో ప్రజలు, ప్రముఖులు షితాబ్ ఖాన్‌ను కలిసే వారు.
ప్రజలకు అందుబాటులో ఉన్న భవనంలోనే తన నివాసం కూడా ఉండాలని షితాబ్‌ఖాన్ ఆ మహల్‌లోనే రాజ గృహాలను, రాణీ వాసాలను ఏర్పాటు చేశాడు. మనం ఆ సౌధంలోకి ప్రవేశించగా నే ఎడమ పక్క, కుడి పక్క, పైన కనిపించే గదులు అవే! మొత్తంగా ఈ సౌధం నిర్మాణం ఇంగ్లీష్ అక్షరం ‘టీ’ (క్యాపిటల్/పెద్ద అక్షరం) ఆకారంలో ఉంటుంది. నిలువు గీత అనేది పొడవైన దర్బారును సూ చిస్తుంది. అడ్డ గీత రాజు, రాణి, మంత్రుల/అధికారుల నివాస గదు లను సూచిస్తుంది. వీటిని దాటాకే దర్బారులోకి ప్రవేశిస్తాం. ఇంత అందమైన దర్బారు, ఇప్పటికీ నిలిచి ఉన్నది తెలుగుదేశంలో ఇదొక్కటే.
ఈ దర్బారు పొడవు సుమారు 90 అడుగులుండగా, వెడల్పు ఎత్తులు వరుసగా 45, 30 అడుగులుంటాయి. దర్బారు పైకప్పును కొనదేలిన ఆర్చిలు మోస్తున్నట్లుగా ఉన్నాయి. ఆర్చిల మధ్యన కర్ర దూలాలున్నాయి. నిజానికి పైకప్పును మోస్తున్నది ఈ దూలాలే. పెద్ద పెద్ద పరిమాణాల్లో కనిపిస్తున్న ఈ ఆర్చీలు కేవలం అందాన్ని అతిశయింపజేయడానికే. ఆర్చీల ముందు దర్వాజా లాంటి ఆర్చి, దాని పైన అందమైన అల్లికలతో కూడిన కిటికీలు దర్బార్ శోభను మరింత పెంచాయి.
దర్బారులోకి ప్రవేశించే ప్రాంగణం (ఎలి వేషన్) మరింత అందమైంది. నిజానికిది రెం డంతస్తుల్లో ఉంది. ఇందులోని రెండు వరుసల్లో ఉన్న స్తంభాలు మూడు పొడవాటి హాల్‌లను ఏర్పరుస్తున్నాయి. ఈ కింద, పైనున్న గదులు రాచ కుటుంబీకులకు చల్లని, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించబడ్డాయి. దర్బారు హాలు మధ్యలో అందమైన నీటి కుం డం ఉంది. దీన్ని అప్పుడు ‘ఫౌంటేన్’గా వాడే వారు. ఇది ఆనాడు రాచవర్గ ప్రజలకు ఎంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేదో! కాబట్టే, ఈ మహల్‌కు ‘ఖుష్ మహల్’ అని పేరొచ్చింది. ఖుష్ అంటే సంతోషం కదా!
ఈ మహల్ గోడలు చాలా వెడల్పుండి బలిష్టమైనవి. అవి సుమారు 77 డిగ్రీల వాలుతో ఉండి వేలాడు తున్నట్లుగా కన్పిస్తాయి. కాబట్టి, ఈ ఖుష్ మహల్ మాతృకైన మహల్‌ను ‘హిందోళ మహల్’ అంటారు. అంటే, ‘ఊగే సౌధం’ అని అర్థం. దీనిని మధ్యప్రదేశ్, గుజరాత్‌లలోని మాళ్వా ప్రాంతపు రాజధాని మాండులో హుషాంగ్ అనే రాజు క్రీ.శ.1425లో కట్టించాడు. దాని కంటే కొంచెం చిన్నది ఈ ‘ఖుష్ మహల్’. కానీ, ‘హిందోళ మహల్’లో లేని నీటికుండం ఖుష్ మహల్ మధ్యలో ఉంది. ఇది ఖుష్ మహల్ అదనపు ఆకర్షణ.
చారిత్రాత్మకంగా ఈ సౌధానికి మరో విశేషమూ, అందమూ ఉంది. తురక సైన్యాలు కూల్చిన, ధ్వంసం చేసిన వందలాది హిందూ దేవాలయాలను, విగ్రహాలను సీతాపతి ముస్లిం మతంలోకి మారి మరీ పునరుద్ధరిం చడం లోనే ఆసక్తికరమైన అందం కనిపిస్తుం ది. కాకతీయులు కాలగర్భంలో కలిసిన రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ప్రజల్లో వారికున్న గౌరవాన్ని చూసి, వారు కట్టించిన దేవాలయ శిల్పాల సౌందర్యాలను చూసి ము గ్ధుడైన సీతాపతి ఖాన్ అంతే అందమైన, ఆసక్తి కరమైన ఖుష్ మహల్‌ను కట్టించడంలో ఆశ్చ ర్యం లేదు.
షితాబ్ ఖాన్ 1515 ప్రాంతంలో ఒరి స్సా లోని కళింగ గజపతి రాజులకు విధేయు డిగా ఉన్నందుకు తెలంగాణలో తనపై దండె త్తిన మరో తెలుగువాడు శ్రీ కృష్ణ దేవరాయల సైన్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. తన విలు విద్యతో మొదట రాయల సైన్యాన్ని చిత్తు చేశా డు కూడా. చివరలో గుంటూరు జిల్లా పొ న్నూరు ప్రాంతంలో రాయలతో జరిగిన యు ద్ధంలో ఓడిపోయాడు. కానీ, ఆయన ప్రజలకు ప్రత్యేకించి కళా పిపా సకులకు ఇచ్చిన కానుక మాత్రం కాల గమనాన్ని తట్టుకొని నేటికీ ఆలరిస్తూనే ఉంది. అదే మన ఖుష్ మహల్.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...