5, మే 2017, శుక్రవారం

కారల్ మార్క్స్ జయంతి


కారల్‌ మార్క్స్‌ 1818 మే అయిదవ తేదీన జర్మనీలోని ట్రయర్‌ నగరంలో జన్మించారు. తల్లి హెన్రెట్టా. తండ్రి హెన్సిచ్‌ మార్క్స్‌ దంపతులకు తొమ్మిదిమంది పిల్లలు. వాళ్ళలో మూడోవాడు మార్క్స్‌. ప్రపంచాన్ని పరిపరి విధాల నిర్వచించాడు. కావలసింది మార్చడం అంటూ పిలుపునిచ్చిన ప్రపంచ ఆరుదైన మేధావి. గొప్ప మార్కిస్టు సిద్దాంతకర్త. కారల్‌మార్క్స్‌ -ప్రపంచాన్నే మార్చివేసే సిద్ధాంతాన్ని రూపొందించి- ప్రపంచ కార్మికు లారా ! ఏకంకండి అని మార్క్స్‌ - ఏంగెల్స్‌లు ఇచ్చిన నినాదం ప్రపంచమంతా- ప్రతిధ్వనించింది. మనిషిని మనిషి దోచుకునే సమాజానికి సమాధి కట్టింది మార్క్సిజం. పీడిత తాడిత జనానికి, శ్రామికవర్గానికి - విముక్తి హోదా కల్పించింది. సామ్రాజ్యవాద దోపిడి, ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ తాకిడికి. ప్రతిఘటన పెరుగు తున్న కొద్దీ కారల్‌ మార్క్స్‌ బోధనల ప్రాధాన్యత పెరిగింది. సామ్రాజ్యవాద దేశాలలో కారల్‌ మార్క్స్‌ రచించిన గ్రంథాలు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. కారల్‌ మార్క్స్‌, జెన్నీ మార్క్స్‌ కుటుంబం.జీవితాంతం అంటే తుదిశ్వాస విడిచేంతవరకు కష్టనష్టాలను ఎదుర్కొం టూనే కార్మికోద్యమాలను మరింత ముందుకు నడిపారు. నిస్వార్థం, త్యాగాలు వారికి సొంతం. విప్లవాలను ప్రపంచదేశాలలో విజయవంతం చేయడానికి కారల్‌ మార్క్స్‌ శ్రమ- పట్టుదల ఎంతో విలువైనవి. ఏంగెల్స్‌ ఆర్థిక సహాయం మార్క్స్‌ కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చింది. మార్క్సిస్టు విప్లవ జీవితం. ప్రపంచ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తుంది- మార్క్స్‌ పట్టుదలగా ఉన్నత చదువులను అభ్యసించాడు. సాహిత్యం, సంస్కృతి, కళలు, చరిత్ర అంటే ఆయనకు ఎంతో ఇష్టం. మార్క్స్‌ తండ్రి న్యాయవాది. దుర్భరజీవితాన్ని అనుభవించాడు. పేదరి కాన్ని జయించాడు. ట్రయర్‌లో మార్క్స్‌ పాఠశాలకు వెళ్ళే దారిలో పేదరైతాంగం. మురికివాడల్లో ఆకలి -ఆకలి చావులను కళ్ళారాచూశాడు. అట్టి దారిద్య్రాన్ని చూసి మార్క్స్‌ చలించిపోయాడు.1836 అక్టోబర్‌ 22న మార్క్స్‌ న్యాయశాస్త్ర విభాగంలో ప్రవేశించాడు. క్రిమినల్‌ చట్టం, రోమన్‌ న్యాయశాస్త్రం , మానవ సమాజశాస్త్రం అనే విద్యలను పగలనక రేయనక కష్టపడి చదివాడు. 18 ఏళ్ళ చిన్న వయస్సులోనే కవితలు, వ్యాసాలు రాయడం మొదలు పెట్టాడు. భార్య జెన్నీని వదిలిపెట్టి దూరంగా వుండవలసి రావడం ఆయననేంతో బాధించింది. జెన్నీ వెస్ట్‌ ఫాలన్‌కు అంటూ మూడు నోట్‌ పుస్తకాలను కవితలు అల్లీ నింపేశాడు. 1842లో పత్రికలకు వ్యాసాలు, కవితలు రాయసాగాడు. అవి ఎడిటర్‌ లను ఎంతో ప్రభావితంచేశాయి. కొద్దికాలానికే పత్రిక అధినేత మార్క్స్‌ను ఎడిటర్‌గా నియమించారు. లేత వయస్సులోనే ఆయన జర్మనీ దేశ బూర్జువా వర్గ, ప్రధాన పత్రికలో ప్రథమ వ్యక్తి అయ్యాడు. మార్క్స్‌ వ్యక్తిగత జీవితంలోను, ఆ పత్రిక అభివృద్థిలోనూ నూతన దశ ప్రారంభమయింది. పెట్టుబడిదారీ దౌర్జన్యాలు, మోసాలపై నిప్పులు చెరిగాడు. దోపిడీ, పీడనలకు చోటులేని నూతన వ్యవస్థ కోసం మార్క్స్‌ కలలు కన్నాడు. ఆదర్శ మానవ సమాజ నిర్మాణం కోసం మార్క్ప్‌ సూచించినటువంటి దారులు కొనసాగుతున్నాయి. రాజకీయ హక్కులు లేని సామాన్య రైతాంగంపై భూస్వాములు సాగిస్తున్నటువంటి దుర్మార్గాలను ఆయన ఖండించారు. నిరుపేదలకు రాజ్యాంగ వ్యవస్థలో తగిన స్థానం లేదని విమర్శలు గుప్పించాడు. 1843 జూన్‌ 18న కారల్‌మార్క్స్‌-జెన్నీలు ప్రేమవివాహం చేసుకున్నారు. 1844 మే 1న తొలికాన్పుగా పాప పుట్టింది. ఆ పసిపాపకు జెన్నీ పేరు నామకరణం చేశారు.అటుతరువాత ఒక పాప, ముద్దుల కొడుకు జన్మించారు. వైద్యం అందక, ఎడ్గార్‌ ముషి మృతి చెందడంతో మార్క్స్‌ కృంగిపోతాడు. మార్క్స్‌ కుటుంబం, పేదరికాన్ని జయించింది. మార్క్స్‌ కుటుంబా నికి కార్మికుల పట్ల ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఉండేది. శ్రామిక ప్రజల పక్షాన నిలిచి ఎన్నో పోరాటాలు చేశారు. ఏంగెల్స్‌, మార్క్స్‌ల మధ్య స్నేహం పెరిగింది. 1845లో ఫ్రెంచి అధికారులు మార్క్స్‌ని బహిష్కరించారు. 24 గంటల్లోగా పారిస్‌ వదిలి వెళ్ళిపోవాలని ఆయనకు తాఖీదులు వచ్చాయి. జర్మనీకి వెళ్లడానికి అవకాశం లేక ఆయన బెల్జియం వలస వెళ్లాడు.మార్క్స్‌ - ఏంగెల్స్‌లు రూపొందించిన గతి తార్కిక భౌతికవాదం. మానవ సమాజం అభివృద్ధి కూడా భౌతిక శక్తుల పెరుగుదలపై ఆధారపడి వుంటుందని చాటి చెప్పింది. మార్క్సిజానికి బద్ధశత్రువులైన కొందరు మార్క్స్‌ గ్రంథాలను వ్యతిరేకించారు. మార్క్స్‌, ఏంగెల్స్‌ నిజమైన సోషలిస్టులు. 1866లో మొదటి అంతర్జాతీయ కార్మికసంఘం సమావేశం కారల్‌మార్క్స్‌ నాయకత్వంలో జెనీవాలో జరిగింది. 8గంటల పనిదినాలు కోసం డిమాం డ్‌ను, ప్రపంచ కార్మికుల డిమాండ్‌గా మార్చివేసింది. మార్క్స్‌, ఏంగెల్స్‌లు శాస్త్రీయ సోషలిజాన్ని రూపొందిం చారు. మార్క్స్‌ సిద్ధాంత మార్గదర్శకత్వంలో 1917లో రష్యాలో లెనిన్‌ నాయకత్వంలో సోషలిస్టు విప్లవం విజయవంతమైంది. చైనా-తూర్పు యూరప్‌లోను, ఉత్తర కొరియా, క్యూబా - వెనిజులా వంటి ప్రపంచ దేశాల్లో సోషలిస్టు విప్లవాలు విజయవంతమయినాయి. మహనీ యులు, కారల్‌మార్క్స్‌ - ఏంగెల్స్‌లు చూపినట్టి బాటలో కార్మికవర్గ పోరాటాలు నిరంతరం జరుగుతున్నాయి. మార్క్స్‌ సూచించిన సిద్ధాంతం ప్రకారం ఆయా ప్రపంచ దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడినాయి. కార్మికవర్గ సిద్ధాంతమైన శాస్త్రీయ సోషలిజాన్ని కారల్‌మార్క్స్‌ -ఏంగె ల్స్‌లు రూపొందించడానికి దారితీశాయి. పెట్టుబడిదారీ విధానానికి అంతం పలికి సోషలిజాన్ని సాధించే సామాజిక శక్తి కార్మికవర్గం మాత్రమేనని, మార్క్స్‌, ఏంగెల్స్‌లు చెప్పారు. కార్మికవర్గం రాజ్యాధికారం సాధించిన పారిస్‌ కమ్యూన్‌ పోరాటానికి మార్గం వేశాయి. శ్రామికవర్గం విముక్తికోసం మార్క్స్‌ నిరంతరం పరితపించాడు. 1883, మార్చి 17న మార్క్స్‌ భౌతికకాయం ఖననం చేయబడింది. అట్టహాసంగా అంత్యక్రియలు జరగడం ఇష్టంలేని మార్క్స్‌ అంత్యక్రియలకు డజనుమంది హాజరైనారు. మార్క్స్‌ సిద్ధాంతాలకు కాలం చెల్లిందని సంబరపడినవారు కొద్దికాలానికే నాలుక కరుచుకున్నారు. మార్క్స్‌ విప్లవ యోధుడు, మహోన్నతుడు. పెట్టుబడిదారీదోపిడీకి, సామ్రాజ్యవాదానికి మార్క్సిజమే సమాధానం.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...