2, మే 2017, మంగళవారం

జైలు కాదు .... గురుకుల పాఠశాల - తోపుడు బండి సాధిక్ .


                       
చరిత్రలో ప్రాచుర్యం పొందిన పలు గ్రంధాలు జైళ్లలో రాసినవే , జైలు నుండి ఇందిరాగాంధీ కి నెహ్రు రాసిన లేఖలు ఆమె  జీవితాన్నే కాక భారతదేశ గతినే మార్చివేశాయని తోపుడు బండి సాధిక్ అన్నారు. మంగళ వారం జైలులో ఖైదీలకోసం సుమారు1000 పుస్తకాలను అందజేశారు . ఈ సందర్భంగా  సెంట్రల్ జైలులో సూపరిండెంట్ సంపత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సాధిక్ అలీ ముఖ్య అతిధి గా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ స్వాతంత్ర సమర కాలంలో ఎందరో మహానుభావులు జైలు జీవితాన్ని అనుభవించిన వారేనని , గతంలో ఉన్న విధంగా జైళ్లు లేవని , ఇప్పుడు జైళ్లను చూస్తే గురుకుల పాఠశాలలని చూసినట్లుగా ఉందన్నారు. చదువుతో ఖైదీలలో సత్ప్రవర్తన అలవడుతుందని తెలిపారు. చదువుకోవడానికి , నేర్చుకోవడానికి , మంచి పుస్తకాలు రాయడానికి జైలు కంటే అనువైన ప్రదేశం మరొకటి లేదని అన్నారు. ఖైదీలలో ఎవరైనా  మంచి పుస్తకాలు రాసినట్లయితే వాటిని తోపుడు బండి పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో తాను ప్రచురిస్తానని తెలిపారు.
అనంతరం జైలు  సూపరిండెంట్ సంపత్ మాట్లాడుతూ తోపుడు బండి పేరుతో  గ్రామ గ్రామాన గ్రంధాలయాలను నెలకొల్పాలని గ్రంధాలయ ఉద్యమం చేస్తున్న షేక్ సాధిక్ అలీ   ఖైదీలకు చదువుకోవడానికి సుమారు1000  ఆధ్యాత్మిక , వ్యక్తిత్వ వికాసం , సాహిత్య పుస్తకాలు అందజేయడం అభినందనీయమని అన్నారు.
  సమాజంలో చెడు వ్యసనాలకు అలవాటు పడి పలు దోపిడీ, దొంగతనాలకు పాల్పడి చిన్న చిన్న తగాదాలతో నేరాలు మోపబడి జైలుకు వచ్చే ఖైదీలలో విద్య ని నేర్పిస్తున్నామని , నిరక్ష్యరాస్యులైన ఖైదీలందరినీ అక్షరాస్యులుగా తయారు చేసి జైలు నుంచి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జైలుకు వచ్చే ముందు చదువురాని ఖైదీలందరూ శిక్షాకాలం పూర్తి చేసుకుని బయటకు వెళ్లే ముందు మంచి ప్రవర్తనతో అక్షరాస్యులుగా తయారై విడుదల అవుతున్నారని
ఖైదీల మానసిక ప్రవర్తనలో మార్పు తెచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా వారిని తీర్చిదిద్దేందుకు జైళ్లశాఖ కసరత్తు మొదలుపెట్టిందన్నారు. విద్యాదాన యోజన, మహాపరివర్తన వంటి విధానాలను జైళ్లలో ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. ఇప్పుడు ఖైదీలను మానసికంగా తీర్చిదిద్దడంతో పాటు, వారిలో మార్పు వచ్చేలా అధికారులు కృషి చేస్తున్నామని తెలిపారు.
జైళ్లల్లో ఇప్పటి వరకు డిగ్రీ వరకు చదువుకునే సదుపాయం ఉందని. చాలా మంది ఖైదీలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ   ద్వారా డిగ్రీ విద్యని అభ్యసిస్తున్నారని వివరించారు. విద్య వల్ల  ఖైదీల్లో మార్పు తేవడంతో పాటు, జైలు నుంచి విడుదలయ్యాక కూడా వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో జైలర్  శ్రీనివాస రావు , శివకృష్ణ రిటైర్డ్ ఉపాధ్యాయుడు రావి చెట్టు రాజేశ్వర్ రావు, అరవింద్ ఆర్య ,  పాటు సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...