2, మే 2017, మంగళవారం

చేర్యాల చిత్రాలు

ఆ కుంచె కథలను చెప్తుంది..
చరిత్రను చిత్రిస్తుంది.........
సాంస్కృతిక సంపదను వారసత్వంగా అందిస్తోంది
సంప్రదాయం, పురాణం, విశ్వాసాలు, ఊహల సమ్మేళనం ఆ చిత్రం.
ఆ చిత్ర కళ పేరు చేర్యాల పెయింటింగ్స్.

కాకతీయుల కాలంలో తెలంగాణలో పుట్టిన ఈ చేర్యాల్ పెయింటింగ్‌కు ఎంతో చరిత్ర ఉంది.

రంగుల నుంచి బ్రష్‌ల వరకు ఓ ప్రత్యేక శైలి. మొదట్లో ఇళ్లు, దేవాలయాల్లో గోడలకే పరిమితమైన ఈ కళ తర్వాత కేన్వాస్‌పైకి చేరింది. సహజసిద్ధమైన రంగులతో వేసే ఈ పెయింటింగ్స్ జానపద గాథలను తలపిస్తాయి.
1978లో ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డు చొరవ.. ఈ పెయింటింగ్స్‌కు దేశవిదేశాల్లో మంచి కీర్తి తెచ్చిపెట్టింది.
గతంలో మహాభారతం, భాగవతం, పురాణాలు, ఇతిహాసాల్లోని వాటినే కథలుగా చేర్యాల్ చిత్రాల్లో కనిపించేది.
గ్రామీణ ప్రాంతాల్లో కుల పురాణాలను చిత్రాల్లో పొందుపరిచి...
ఆయా కులస్తులకు కథలుగా చెప్పేవాళ్లు.
ప్రకృతిసిద్ధమైన రంగులుఈ పెయింటింగ్స్‌లో వాడే రంగులన్నీ కొన్ని రకాల రాళ్ల పొడి, దీపానికి పట్టే మసి, శంకు పొడి,కూరగాయల నుంచి తయారు చేసిన సహజ సిద్ధమైనవే.
ఇందుకు ఉపయోగించే పెద్ద బ్రష్షులను మేక వెంట్రుకలతో తయారు చేస్తారు.
అతి క్లిష్టమైన లైనింగ్ కోసం ఉపయోగించే చిన్న కుంచెలను ఉడుత తోక వెంట్రుకలతో తయారు చేస్తారు.
గంజి, సుద్దమట్టి, బంక లిక్విడ్‌లా తయారు చేసి ఒక తెల్లటిఖాదీ బట్టపై కోటింగ్ వేసి గట్టిపడేలా చేస్తారు.
అటు తర్వాత ఆ క్లాత్‌పై డ్రాయింగ్ వేసి రంగులను అద్దుతారు.
ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న ఈ పెయింటింగ్స్‌కు దేశవిదేశాల్లో ఎంతో ఆదరణ ఉంది.
ఒకప్పుడు వరంగల్ జిల్లాలోని చేర్యాల్‌లోని ఎన్నో కుటుంబాలు పోషించిన ఈ పెయింటింగ్ వారి పొట్టనింపలేదు. ఇప్పుడు నాలుగు కుటుంబాలకే పరిమితమైంది.

.సహజమైన రంగులు :
మొదట ఖాదీ కాన్వాస్‌ను పెయింటింగ్‌కోసం సిద్ధం చేసుకుంటారు.
సహజంగా తయారు చేసిన రంగులను ఉపయోగించి పెయింటింగ్స్‌ వేస్తారు.
ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగించే రంగురాళ్లను కొనుగోలు చేసి...
వాటిని నూరుకొని రంగులు తయారు చేసుకుంటారు.
కాలంతోపాటు మారుతూ...
ఇప్పుడు కృష్ణలీల, రామాయణ, మహాభారతాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.
కృష్ణుడి పటాలనుఇళ్లలో ఇంటీరియర్‌ డెకరేషన్‌కోసం వాడుతున్నారు.
నగరాల్లో పెరుగుతున్న ఇప్పటి తరానికి గ్రామీణ వాతావరణం గురించి తెలియడం లేదు.
అందుకే కులవృత్తులు, వ్యవసాయం, గ్రామీణ వాతావరణం, గంగిరెద్దులు, హరిదాసులు, బతుకమ్మ, బోనాలు, ముగ్గులు వంటి చిత్రపటాలకు డిమాండ్‌ ఎక్కువ ఉంటోంది. .

#AAP
#CHERYALPAINTINGS
#WARANGAL
#MAKEHERITAGEFUN
#CULTURE
#HERITAGE

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...