19, మే 2017, శుక్రవారం

స్పూర్తి నిచ్చిన రోహిత - షేక్ సాధిక్ అలీ

ఈ బంగారుతల్లి పేరు ఎం.రోహిత. వీళ్ళ సొంతూరు వరంగల్ దగ్గర ఉన్న భీమారం. వీళ్ళ నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ కి దగ్గరలో ఉన్న కాళీమందిర్ సమీపంలోని కాలనీలో ఉంటున్నారు.అక్కడికి దగ్గరిలోని ఒక స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతోంది. వేసవి కాలపు సెలవుల్లో అమ్మమ్మ గారు ఉంటున్న వరంగల్ కు వచ్చింది. నిన్న జ్యోతిబసు నగర్ లో తోపుడుబండి దగ్గరికి వచ్చింది. ' అంకుల్ మీరు నాలాగే చేస్తున్నారు ,గుడ్' అంది. కొంచెం ఆశ్చర్యం వేసి 'ఎలా' అని అడిగాను. అప్పుడు చెప్పింది......

   తను చదువుకుంటున్న స్కూల్లో తనకు సుచిత్ర అనే ఒక ఫ్రెండ్ ఉందట. తను కూడా రోహిత లాగే ఆలోచిస్తుందట.ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అట. వాళ్ళు ఉండే కాలనీకి దగ్గరలో కూడా స్లమ్స్ ఉన్నాయట. అక్కడ చాలామంది పిల్లలు చదువుకోవటానికి పుస్తకాలు లేవట. అది చూసి వీళ్ళకు బాధ కలిగి ఎలాగైనా వాళ్లకు పుస్తకాలు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారట. ముందు వీళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ బుక్స్, ఫ్రెండ్స్ దగ్గరున్న బుక్స్ తెచ్చి ఇచ్చారట. అలాగే రోహిత,సుచిత్ర వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీ,వేరే ఫ్రెండ్స్ మనీ,టీచర్స్ దగ్గర కలెక్ట్ చేసిన డొనేషన్స్ అన్నీ కలిపి బుక్స్ కొని స్లమ్స్ లో ఉన్న పిల్లలకు ఇచ్చారట. ఈ సారి స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాక మళ్ళీ ఇస్తారట.

      ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు ఆ పాప గొంతులో ఒక రకమైన ఉద్వేగం,ఉత్సాహం కన్పించాయి. ఒక మంచిపని చేసేటప్పుడు కళ్లల్లో వచ్చే మెరుపు ఆమెలో కన్పించింది. అప్పుడు చెప్పాను ' నన్ను గుడ్ అన్నావు. కానీ నీ నుంచి నేనే నేర్చుకోవాలి. నువ్వు గ్రేట్ బేటా' అన్నాను. నేను 53 ఏళ్ళ వయసులో చేస్తున్న పనిని ఆ బిడ్డ 13 ఏళ్ళకే చేసేస్తుంది. ఇలా స్పూర్తినిచ్చే బంగారు తల్లులు ఎదురవుతుంటే ....మరో పదేళ్ళ వరకు బండి తోస్తూనే ఉంటాను.

అరవింద్ ఆర్యతో కలిసి ......

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...