2, మే 2017, మంగళవారం

త్రికుటాలయం వరంగల్ కోట.

అఖండ భారత దేశానికే తలమానికం
గా నిలిచిన..
అన్నపూర్ణ గ పేరు గాంచిన..
ఆంధ్ర దేశాన్ని ఎందఱో రాజులు పరిపాలించగా తెలుగు బాషా మాట్లాడే  ప్రాంతాల ను. ఏక చత్రాధిపత్యం కింద చేర్చింది కాకతీయులు. అనన్యసామాన్యమైన పోరాట పటిమ,అపూర్వ పరిపాలనా దక్షత, అద్వితీయ కళా పిపాస కలిగిన కాకతీయుల చరిత్రకు సాక్షాలు
ఈ కళారూపాలు..
ఒకప్పటి ఓరుగల్లును..
ఇప్పటి వరంగల్లు నీ రాజధానిగా చేసుకొని పరిపాలించిన కాకతీయయుల పాలనలో జీవంపోసుకొని శిల్పంగా అవతరించిన ప్రతి శిలా మనకు వరం.
భారతీయ సంస్కృతికే ఒక కృతిని...
ఆకృతిని కల్పించిన కళల్లో 'శిల్పకళ' ప్రముఖమైనది.
తమలో దాగిన ఆగమజ్ఞాననిధిని, తత్వార్థఖని ని రాళ్ళల్లో ఇముడ్చిన కాకతీయుల ప్రతిభ...
అనన్యం.....
అపూర్వం ...
ఆశ్చర్యం .
స్పందిచే మనసుంటే ఇక్కడి ప్రతి రాయి సుమదురమే..
వీక్షించే కనులుంటే ప్రతి శిల్పం మనోహరమే. అద్భుతమైనకాకతీయుల కళామణిహారం లోంచి జాలు వారిన ఆణి ముత్యాలుగా అనేక ఆలయాలు నేటికి నిలిచి ఉన్నాయి.
ప్రతి వ్యక్తి అంతరంగం లో సుమధుర తరంగాలను మీట గలిగిన ఈ శిల్పసంపద కొన్ని వందల సంవత్సరాల చరిత్రనుతనలో ఇముడ్చుకొందంటే అతిశయోక్తి కాదు.

ఖిలా వరంగల్  లోని  మట్టి కోట ఉత్తర భాగంలో భూగర్భంలో  కాకతీయుల కాలం నాటి ఆలయం ..
హృదయ్ పధకం లో భాగంగా
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన  హృదయ్ కార్యక్రమంలో భాగంగా
వరంగల్ కోట లో చేస్తున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఉత్తర కోట మట్టి కోట భాగంలో తవ్వుతుండగా ఒక త్రికుతాలయం బయటపడింది.
L.P గండి ప్రాంతంలో  ఉందీ త్రికుటాలయం..

చారిత్రక అన్వేషణలో వరంగల్ మట్టికోటలో లంజపాతర గండి వద్ద భూ గర్భంలోనుండి సగం బయటపడినదొకటి, నేలలోనే వున్న మరొకటి, రెండు త్రికూటాలయాలు ఇవి..
కాని వాటిని పూర్తిస్థాయిలో త్రవ్వి బయటపెట్టలేదు.

ధూప, దీప, నైవేద్యాలు కరువు-
శిథిలమైపోతున్న ఆలయం
కనుమరుగవుతున్న శిల్ప సంపద
నాడు వైభోగం..
నేడు వెలవెల-
కాకతీయుల కాలంలో నిర్మించిన  ఇలాంటి చారిత్రాత్మక ఆలయాలు కాలగర్భంలోకలిసిపోయే ప్రమాదం నెలకొన్నది. అయితే కొందరు ముఠాగా ఏర్పడి గుప్త నిధుల కోసం ఆలయంలో, పరిసరాల్లో భారీగా తవ్వకాలు జరిపారు. దీంతో ఆ ప్రాంతమంతా శిథిలావస్థకు చేరింది. ఆలయ ఆనవాళ్లు లేకుండాపోయే దుస్థితి నెలకొంది.: ప్రస్తుతం ఆలయంలో  శివలింగం లేకపోవటంతో ఇది ఆ ఆలయంలో నీదే అని భావిస్తున్నారు...
ఆలయం , శివలింగం , బయటపడటంతో ఇంకా ఆ ప్రాంతంలో భూగర్భలోఆపురూపమయినా శిల్పసంపద ఉండే అవకాశం ఉందని కాబట్టి కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..
చరిత్ర కారుల అభిప్రాయం మేరకు నాటి ఓరుగళ్ళు కోట మొత్తం 7 కోటలతో శ్రీ రామారణ్య పాదుల ఆదేశానుసారంశ్రీ చక్రం ఆకారంలో నిర్మించబడిందని ఈ 7 కోట ల పరిధిలో దాదాపు 100 పైన ఆలయాలు ఉండేవని  ఏకామ్రనాధుని ప్రతాపరుద్రీయం ఆధారంగా చెప్తున్నారు.
వారి అభిప్రాయం ప్రకారం కాకతీయులు తమ ముందు చూపు తో నే ఈ విధంగా మట్టి కోటలో శ్రీచక్రం మూలలు  వచ్చే విధముగా నిర్మించారు. ఇలా నిర్మించడం వలన భవిష్యత్ లో దండయాత్ర లనుండి ఆలయాలను రక్షించే అవకాశం కూడా ఉందని వారు భావించి ఉంటారు.
దానికి ఆధారంగా ఆలయం పై భాగంలో ఒక గోడ లాగా నిర్మించిన తేలిక పాటి ఇటుకల నిర్మాణం మనకు నేటికి కనిపిస్తుంది.
#AAP
#WARANGALFORT
#KAKATIYA
#TRIKUTALAYAM

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...