1, మే 2017, సోమవారం

కార్మిక దినోత్సవం.


*"నేడే మేడే"*

మితృలందరికి మేడే శుభాకాంక్షలు

ఈ సందర్భంగా .. శ్రీ శ్రీ కవిత

నరాల బిగువూ
కరాల సత్తువ
వరాల వర్షం కురిపించాలని
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని
గనిలో, పనిలో కార్ఖానాలో
పరిక్లమిస్తూ
పరిప్లవిస్తూ
ధనిక స్వామికి దాస్యం చేసే
యంత్ర భూతముల కోరలు తోమే
కార్మిక వీరుల కన్నుల నిండా
కణ కణ మండే
గల గల తొణకే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదు కట్టే షరాబు లేడోయ్!

నాలో కదలే నవ్య కవిత్వం
కార్మిక లోకపు కళ్యాణానికి
శ్రామిక లోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా సమర్చనంగా-
త్రిలోకాలలో త్రికాలాలలో

శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనే లేదని
కష్ట జీవులకు కర్మ వీరులకు
నిత్య మంగళం నిర్దేశిస్తూ
స్వస్తి వాక్యములు సంధానిస్తూ
స్వర్ణ వాద్యములు సంరావిస్తూ
వ్యధార్త జీవిత యధార్థ దృశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావి వేదములు జీవ నాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్!

కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం
శరీర కష్టం స్ఫురింప జేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్,
నా వినుతించే నవీన గీతికి
నా విరచించే నవీన రీతికి
భావ్యం!
భాగ్యం !
ప్రాణం!
ప్రణవం!

.....మహా ప్రస్థానం నుండి....

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...