13, సెప్టెంబర్ 2016, మంగళవారం

త్యాగానికి ప్రతీక బక్రీద్..

త్యాగానికి ప్రతీక బక్రీద్.....

ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రంజాన్ మొదటిది కాగా, రెండోది బక్రీద్.
ఈ పండుగకు ఈదుల్..అజహా, ఈదుజ్జహా అని కూడా పిలుస్తారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు నిర్వహించుకుంటారు.
ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సివుంటుంది.
ఈ నెల ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు.
హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మస్జిద్..ఉల్..హరామ్‌లోవున్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు.
ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కానుండి మదీనా (ముహమ్మద్ (సొ.అ.స) ప్రవక్త గోరీ ఉన్ననగరం)ను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం (సొ.అ.స) తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమవుతారు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గా‌లో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆతర్వాత వారు నెమరు వేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.
#AAP
#BAKRID

9, సెప్టెంబర్ 2016, శుక్రవారం

*కాళోజీ నారాయణరావు*

*కాళోజీ నారాయణరావు*


*కాళోజీ అసలు పేరు*
*రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి-
*తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని కాళోజి నారాయణరావు*
రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాళోజి.
కవిత్వం వ్రాసిన ప్రజాకవి.
హక్కులడిగిన ప్రజల మనిషి.
ఉద్యమం నడిపిన ప్రజావాది
. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి.
పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు,
వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు.
ప్రజాకవి కాళోజి.
ప్రజాకవి,
రచయిత,
వక్త ,
స్వాతంత్ర్య సమరయోధుడు,
పౌరహక్కులకోసం అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు,
పద్మ విభూషణ్ డా.కాళోజీ నారాయణ రావు.
ఆయన గొడవ ప్రజల గొడవ.
ఆయన రచించిన అక్షరాలు అన్యాయంపై తిరుగుబాటుకు బీజాక్షరాలు.
అణచివేతకు వ్యతిరేకంగా పోరాటమే ఆయన మార్గం.
సమాజంలోని చీకటిపై తిరుగుబాటే ఆయన జీవితాదర్శం.
పుట్టుకనీది, చావునీది బతుకంతా దేశానిది.
.కాళోజీ రాసిన ఈ వాక్యం అక్షరాలా ఆయన జీవితానికే సరిపోతుంది.జీవితమంతా ప్రజాసేవలో గడిపిన ప్రజాకవి కాళోజి..
.కాళోజి నారాయణరావు కాళన్నగా, కాళోజిగా ప్రఖ్యాతుడు.
*తెలంగాణ తొలిపొద్దు కాళోజీ.
* ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి *కాళోజీ నారాయణరావు
కాళోజీ తెలుగు , ఉర్దూ , హిందీ , మరాఠీ, కన్నడ , ఇంగ్లీషు భాషల్లో రచయిత రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. *‘నా గొడవ’* పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి.
కాళోజీ నిఖిలాంధ్ర కవి.
అందులో ఎట్టి సందేహం లేదు. ఆయనకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డునిలువజాలవు.
ఆయన తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టాడు. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది.
ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ - శ్రీశ్రీ
*ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక - కాళోజి*
*'పుటక నీది-చావు నీది-బతుకంతా దేశానిదీ' --- జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజి*
అన్యాయం అంతరిస్తే, నా గొడవకు ముక్తి ప్రాప్త - అన్యాయాన్నెదిరించినోడు నాకు ఆరాధ్యుడు.
అంటూ ప్రజల గొడవను తనగొడవగా, ప్రజా సమస్యలను తన తిరుగుబాటు కవితలుగా అక్షరీకరించినవాడు అన్యాయాన్నెదిరించినవాడు తనకు ఆరాధ్యుడంటాడు.
*జననం*
సెప్టెంబరు 9, 1914
*మరణం*
నవంబరు 13, 2002
*భార్య* రుక్మిణిబాయి
*పిల్లలు* రవికుమార్
*తండ్రి* రంగారావు
*తల్లి* రమాబాయమ్మ
ప్రజాకవి:
1937లో 23ఏళ్ల వయస్సులో నిజామాబాద్ ఆంధ్రమహాసభలో పాల్గొన్నది మొదలు..2002లో చనిపోయే వరకూ మొత్తం ఆరున్నర దశాబ్దాలపాటు నిరంతరం ప్రజాక్షేత్రంలో న్యాయంవైపు, పీడితుల వైపు నిలబడ్డ గొంతుక, ధిక్కార పతాక కాళోజీ నారాయణ రావు. తెలుగు ప్రజలందరి గుండెల్లో కాళన్నగా నిలిచిపోయాడు. ఆర్యసమాజీయుడిగా, ఉద్యమకారుడిగా, హక్కుల కార్యకర్తగా, నిజాం ఫ్యూడల్ పాలనపై నిరసన తెలిపి జైలుకెళ్లిన ప్రజాస్వామ్యవాదిగా, కవిగా, కథకుడిగా, పేదల అడ్వకేట్ గా తోటివారి బాధను తన బాధగా పలవరించిన ప్రజాకవి కాళోజీ.
కాళోజీ నేపథ్యం..
మహారాష్ట్ర కు చెందిన కాళోజీ రంగారావు, కర్ణాటకకు చెందిన రమాబాయి దంపతులకు 1914 సెప్టెంబర్ 9న కాళోజీ నారాయణరావు జన్మించారు. పాతికేళ్ల ప్రాయంలో సంఘ సంస్కర్త, వేలూరి మాణిక్యరావు కుమార్తె రుక్మిణీబాయిని పెళ్లాడారు. కుటుంబ బాధ్యతలన్నీ అన్న రామేశ్వరరావుకి వదిలి నాటి నిజాం ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఖండిస్తూ ప్రజల కష్టసుఖాలను గమ
తిరుగుబాటే 'కాళోజీ' జీవన సూత్రం..
బతికినన్నాళ్లు ఏది దాచుకోలేదు... ఏదీ కూడబెట్టుకోలేదు... ఆర్జనమే దౌర్జన్యమని ఆ విధంగానే బతికి, భాషను, సాహిత్యాన్ని, రాజకీయాలను, సంఘసంస్కరణను ఉమ్మడిగా మేళవించి సమసమాజ ని ర్మాణం కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడూ ప్రజాకవి కాళోజీ నారాయణ....! నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం..
పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది.. జీవితమంతా లోకం కోసం ధారపోసిన మహా పురుషుని మాటలివి. అన్యాయాన్ని ఎదిరించడం కోసం ఊపిరి ఉన్నంతకాలం గొడవ చేసినవాడు. ప్రజల్ని చైతన్యపరిచేందుకు ప్రజాస్వామ్య పూవులను లోకమంతటా విరజిమ్మినవాడు. రాజ్యహింసను ధిక్కరించిన స్వరంతోనే ప్రతిహింసనూ ప్రతిఘటించిన ఘనుడు ఆయన.
ఆయన నుంచి వచ్చే ఒక్కో అక్షరం నిప్పు రవ్వ.. ఒక్కో పదం పోరాట ప్రతీక. కాళిక కటాక్షంతో కాళిదాసులాంటి మహాకవి ఉద్భవిస్తే దుఖంలోంచి, అన్యాయంలోంచి, పోరాడే మనస్తత్వంలోంచి ఓ ప్రజాకవి...ప్రజలకవి కాళోజీ అవతరించాడు.
చాటుమాటు లేదు. ఏదైనా కుండబద్దలుకొట్టే సున్నిత మనస్తత్వం ఆయనది. బాధ కలిగితే క్షణం కన్నీళ్లు ఆ తరువాత కవితలు. ఇవే కాళోజీకి తెలుసు. నాయకులు విఫలమైన చోట రచయిత విజయం సాధిస్తాడు అని బలంగా విశ్వసించిన నిష్కల్మషమైన వ్యక్తిత్వం కాళోజీది. అందుకే ఆయనకు దేశమంతా స్నేహితులున్నా ఆయన పరిధులు పరిమితులతోనే అందరికీ ఆప్తుడయ్యాడు. తన కవితలతో అగ్గి పుట్టించాడు. ధిక్కార స్వరానికి నిలువుటద్దం.. మానవత్వపు మనుగడకు నిలువెత్తు నిదర్శనం.. కాళోజీ..
#AAP
#KALOJIమెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...