15, ఆగస్టు 2016, సోమవారం

మొహంజో-దారో

మొహంజో-దారో
(సింధీ:موئن جو دڙو
ఉర్దూ: [موئن جو دڑو], అనగా చనిపోయినవారి గుట్ట ప్రస్తుత పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతానికి చెందిన చారిత్రకంగా, నాగరికతపరంగా అత్యంత ప్రాముఖ్యత గల ప్రాంతం. క్రీ.పూ 2500 లో నిర్మించబడిన ఈ నగరంసింధు లోయ నాగరికత లో అత్యధిక స్థిరత్వం పొందిన, పురాతన ఈజిప్టు, మెసొపొటేమియా నాగరికత, మినోవా మరియు నార్టే చీకో నాగరికతలకు సమకాలీనమైనది. క్రీ.పూ 19వ శతాబ్దంలో సింధు నాగరికత అంతరించిపోయినపుడు, ఈ నగరం పరిత్యజించబడినది. 1920వ సంవత్సరం వరకూ ఇది గుర్తించబడలేదు. అప్పటి నుండి ఈ ప్రాంతంలో చాలా పరిశోధనాత్మక త్రవ్వకాలు జరుపబడ్డాయి. 1980 లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించారు.
ప్రదేశం
సింధు నదికి పడమర దిశగా సింధ్ కు చెందిన లర్కానా జిల్లా లో మొహంజో-దారో కలదు. ఇది సింధు నదికి, ఘగ్గర్-హక్రా నదికి మధ్యలో ఉన్నది. లర్కానా నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఇది కలదు. నగరం చుట్టూ సింధు నది నుండి వచ్చే వరదనుండి రక్షించటానికి కోటగోడ కట్టబడినది. మొహంజో-దారో నాగరికతను బలహీనపరచిన చివరి వరద ఉధృతి కారణంగా ఈ కోటగోడ దెబ్బ తిన్నది. ఇప్పటికీ సింధు నది దీనికి తూర్పు దిశగా ప్రవహిస్తున్ననూ, పశ్చిమదిశలో ఉన్న ఘగ్గర్-హక్రా నది మాత్రం ఎండిపోయినది.
చారిత్రక నేపథ్యం
మొహంజో-దారో క్రీ.పూ. 26వ శతాబ్దంలో నిర్మించబడినది. క్రీ.పూ. 3000 నుండి అభివృద్ధి చెందుతూ వచ్చిన ప్రాచీన సింధు లోయ నాగరికత (హరప్పా నాగరికత)లో నిర్మించబడిన అతిపెద్ద నగరాలలో ఇది కూడా ఒకటి. ఉచ్ఛదశలో ఉన్నపుడు ప్రస్తుత పశ్చిమాన పాకిస్థాన్ నుండి ఇరాన్ సరిహద్దుల వరకు , ఉత్తరాన అఫ్ఘానిస్థాన్ నుండి ఉత్తర భారతదేశము నుండి దక్షిణాన గుజరాత్ వరకు, విస్తరించి హరప్పా, మొహంజో-దారో, లోథల్, కాలిబంగన్, ఢోలవీర మరియు రాఖీఘరీ లు ప్రధాన పట్టణాలుగా విలసిల్లినది. అయితే వీటన్నింటిలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకొన్నది మాత్రం మొహంజోదారోనే. ఇక్కడి నిర్మాణంలో శాస్త్రీయత, ఆవాస ప్రణాళికలు అత్యంత అభివృద్ధి చెందినవి కావటమే ఇందుకు మూలం. సింధు లోయ నాగరికత అంతరించగనే మొహంజో-దారో కళావిహీనం అయినది.
భారతదేశ చరిత్ర క్రీ .పూ. 34 వేల ఏళ్ల కిందట హోమోసెఫియన్ల కాలం నుంచి ప్రారంభమైనట్లు చరిత్రకారుల అభిప్రాయం.
భారతదేశ చరిత్ర అంటే భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌తో కూడిన సమస్త భారత ఉపఖండ చరిత్ర లో హరప్పా...
మొహంజో దారోలకి విశిష్టమైన స్థానం ఉంది.
వేల ఏళ్ల కిందట అప్పటికి క్రీస్తూ పుట్టలేదు...
బుద్దుడు కన్నైనా తెరవలేదు...
ఆనాటికే మొహంజోదారో ఒక గొప్ప నాగరికత విలసిల్లిన ప్రదేశం. హరప్పా, మొహంజోదారో ప్రదేశాలు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాయి. హరప్పా నగరంలో ధాన్యాగార భవనం ఒక విశిష్ట నిర్మాణం....
వేల సంవత్సరాలు గడిచిపోయాయి...
వందల చరిత్రలూ కాలం లో కలిసి పోయాయి...
మొహంజో దారో ఒక చరిత్ర పాఠమైపోయింది...
క్రీ.పూ 1800 వచ్చేసరికి నెమ్మదిగా ఈ నాగరికత బలహీనపడటం ఆరంభించింది.
క్రీ.పూ 1700 శతాబ్దానికల్లా దాదాపు అన్ని నగరాలూ పాడుబడిపోయాయి. కానీ సింధూ లోయ నాగరికత ఉన్నట్టుండి మాయమైపోలేదు.
దీని ప్రభావాలు తరువాత వచ్చిన నాగరికతల్లో కనిపిస్తూనే ఉన్నాయి.....
మొహంజోదారో అంటే సింధీ భాషలో ''చనిపోయినవారి దిబ్బ'' అని అర్థం. పాకిస్తాన్‌ దేశంలో సింధ్‌ రాష్ట్రంలో లార్ఖానా జిల్లాలో సింధునదికి కుడివైపున ఉంది. సింధు నది హరప్పా, మొహంజొదారో నగరాలను కలిపేది. ఈ పట్టణం చుట్టూ ఉన్న ప్రదేశం సారవంతమైనది కావడంతో దీనికి ''నిఖ్లిస్థాన్‌'' ( ది గార్డెన్‌ సిటీ ఆఫ్‌ సింధు) అనే మరొక పేరుంది.
మొహంజొదారో - 200 హెక్టార్లు- పాకిస్తాన్‌
నాగరికత బహువిస్తారంగా విస్తరించినా సాంస్కృతిక ఐక్యత నెలకొనడం విశిష్టమైన అంశం.
1. కట్టడాలలో, వాటికుపయోగించిన సామాగ్రిలో ఏకరూపత ఉంది. పట్టణ నిర్మాణ పథకం, ప్రమాణ కొలతలు గల కాల్చిన ఇటుకల వాడకం, మట్టి పాత్రల తయారీ వంటి సాంకేతిక నైపుణ్యంలో కూడా ఐక్యత కనిపిస్తుంది.
2. సమకాలీన నాగరికతలలో లేని లక్షణం వీరికున్న విశిష్ట లక్షణం మురుగు నీటిపారుదల వ్యవస్థ
3. పూసల తయారీ, రాత విధానం, కొలతలు, తూనికల పద్ధతుల్లో కూడా ఏకరూపత కనిపిస్తుంది.
4. నగరానికి నగరానికి సామాగ్రిలో తేడా ఉన్నా సాంకేతికాభివృద్ధిలో ఏకత్వాన్ని సాధించి తత్ఫలితంగా నాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక వ్యవస్థల్లో సుస్థిరత్వాన్ని నెలకొల్పింది.
మెసపటోమియాలోని ఊర్‌, నినేవా నగరాలతో పోలిస్తే హరప్పా నగరాలు వాస్తు విద్యలో ఖచ్చితమైన సూత్రాలను అనుసరించినట్లు స్పష్టమవుతుంది.
కోట(దుర్గం): నగరంలో పశ్చిమాన ఎత్తైన ప్రాంతంలో దుర్గాన్ని, తూర్పున పల్లపు ప్రాంతంలో జనావాసాలను నిర్మించారు. మొహంజొదారో, హరప్పా, కాళీబంగన్‌, సర్కొటొడాలలో కోట ప్రాంతం జనావాసాలుండే ప్రాంతం కన్నా చిన్నగా ఉంది. లోథాల్‌లో కూడా కోట ఉంది. ''చన్హుదారో'' లో మాత్రం దుర్గం నిర్మాణం కనిపించదు.
హరప్పా, కాళీభంగన్‌లలో కోట నిర్మాణం దిగువన నివాస గృహాలున్నాయి. ప్రభుత్వ భవనాలను ఇతర ముఖ్య కట్టడాలను దుర్గంలోనే ఎత్తైన వేదికపై కట్టడం జరిగింది. కోట్‌దిజి (సింధునదికి ఎడమ ఒడ్డున మొహం జొదారోకి దగ్గరగా ఉంది. హరప్పా పూర్వ. పరిణతి చెందిన దశలు బయల్పడినవి) లో కోట చుట్టూ ''అగడ్త''ని నిర్మించారు. ఈ దుర్గాలను పరిపాలనా కేంద్రాలుగా భావించవచ్చు.
రహదారులు: పౌరులు నివసించే నగర భాగంలో వీధులకురెండువైపులా నిర్మాణాలుండేవి. ప్రధాన వీధులను ఉత్తర, దక్షిణాలుగా నిర్మించగా, ఉపవీధులను తూర్పు పడమరలుగా ఏర్పాటై నగరాన్ని దీర్ఘచతురస్ర లేదా చతురస్రాకారంలో బ్లాక్‌లుగా విభజించాయి. ఈ రకమైన వీధుల తీరు ప్రస్తుతం మన దేశంలో 'ఛండీఘర్‌'' నగరంలో ఉంది.
పాకిస్తాన్‌లో ఉన్నాయి
హరప్పా, మొహంజోదారో ప్రదేశాలు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాయి. హరప్పా నగరంలో ధాన్యాగార భవనం ఒక విశిష్ట నిర్మాణం. మొహంజోదారోలో బయల్పడిన స్నానవాటిక ప్రసిద్ధి చెందింది. చాన్హుదారో కోటలకు ఖ్యాతి చెందింది. గుజరాత్‌లోని లోథాల్ ప్రసిద్ధ రేవు పట్టణం.

మొహంజోదారో
దేశ, విదేశీ (మెసపటోమియా ప్రజలతో) వాణిజ్యం చేశారు. రాజస్థాన్‌లోని కాళీభంగన్, హరియాణాలోని బన్వాలి కూడా ఈ నాగరికతకు చెందిన ముఖ్యమైన ప్రదేశాలు. సింధూ స్థావరాల్లో రాఖీగర్హిని అతి పెద్ద నగరంగా 2014లో పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతకుముందు వరకు మొహంజోదారోను పెద్ద నగరంగా పరిగణించేవారు.
హోమోసెఫియన్ల కాలం నుంచి
భారతదేశ చరిత్ర క్రీ .పూ. 34 వేల ఏళ్ల కిందట హోమోసెఫియన్ల కాలం నుంచి ప్రారంభమైనట్లు చరిత్రకారుల అభిప్రాయం. భారతదేశ చరిత్ర అంటే భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌తో కూడిన సమస్త భారత ఉపఖండ చరిత్ర లో హరప్పా...మొహంజో దారోలకి విశిష్టమైన స్థానం ఉంది.

క్రీస్తు కంటే ముందు:
బ్రిటిష్ పాలనకటే ముందు,
మొగలాయిల కంటే ముందు,
క్రీస్తు కంటే ముందు,
అలెగ్జాండర్ రాక కంటే ముందు,
బుద్దుడి కంటే ముందు....
ఇండియాలో మొహంజోదారో నాగరికత విలసిల్లింది...
సింధూ నాగరికత (క్రీ.పూ. 2500-1750)
రాగి లోహం వాడుకతో ఈ యుగం ప్రారంభమైనందువల్ల దీన్ని ‘తామ్ర శిలాయుగం’గా పేర్కొంటారు.
దీన్ని ‘హరప్పా సంస్కృతి’ అని కూడా అంటారు. 1921లో సింధూ మైదాన ప్రాంతంలో చేపట్టిన పురావస్తు తవ్వకాల్లో హరప్పా ప్రదేశం బయల్పడింది. అందువల్ల దీన్ని ‘సింధూ నాగరికత’ లేదా ‘హరప్పా నాగరికత’గా వ్యవహరించారు.
హరప్పా, మొహంజోదారో ప్రదేశాలు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాయి. హరప్పా నగరంలో ధాన్యాగార భవనం ఒక విశిష్ట నిర్మాణం. మొహంజోదారోలో బయల్పడిన స్నానవాటిక ప్రసిద్ధి చెందింది. చాన్హుదారో కోటలకు ఖ్యాతి చెందింది. గుజరాత్‌లోని లోథాల్ ప్రసిద్ధ రేవు పట్టణం. దేశ, విదేశీ (మెసపటోమియా ప్రజలతో) వాణిజ్యం చేశారు. రాజస్థాన్‌లోని కాళీభంగన్, హరియాణాలోని బన్వాలి కూడా ఈ నాగరికతకు చెందిన ముఖ్యమైన ప్రదేశాలు. సింధూ స్థావరాల్లో రాఖీగర్హిని అతి పెద్ద నగరంగా 2014లో పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతకుముందు వరకు మొహంజోదారోను పెద్ద నగరంగా పరిగణించేవారు.
లోథాల్ నగరంలో పత్తి, వరి పండించినట్లుగా ఆధారాలు లభించాయి. వీరు పాలు, కూరగాయలు, గోధుమ, బార్లీతో పాటు మంసాహారాన్ని కూడా తీసుకునేవారు. ఎద్దు, మహిషం, గొర్రె, పంది, ఒంటె, కుక్క, ఆవు లాంటి పెంపుడు జంతువులు, ఖడ్గమృగం, పెద్దపులి, ఎలుగుబంటి, వానరం తదితర వన్యమృగాలు వీరికి తెలుసు. వీరు యుద్ధాల్లో రాగితో చేసిన గొడ్డలి, కత్తి, బల్లెం, విల్లంబులు, బాడిశ తదితర పరికరాలను ఉపయోగించారు. కానీ రక్షణ కవచాలు తెలియదు. గృహ సామగ్రి కోసం రాగి, వెండి, పింగాణీతో పాటు శిలలు, దంతాలతో చేసిన వస్తువులను వినియోగించారు. వీరు దశాంశ పద్ధతిలో తూనికలు ఉపయోగించారు. సింధూ ప్రజల మట్టి ముద్రికలు, శిలా విగ్రహాలు, లోహ ప్రతిమల ఆధారంగా వీరు ప్రధానంగా మాతృదేవత లేదా అమ్మతల్లిని ఆరాధించినట్లుగా తెలుస్తోంది. మూడు ముఖాలతో పద్మాసీనుడై ఉన్న శివుని చుట్టూ వన్యమృగాలున్న ఒక ముద్రిక లభించింది. దీని ఆధారంగా వీరు పశుపతిగా, మహాయోగిగా శివుణ్ని ఆరాధించేవారని, వృక్షాలు, సర్పాలను కూడా పూజించేవారని తెలుస్తోంది. ‘స్వస్తిక్’ అనేది సూర్య దేవతారాదనకు చిహ్నం. మృతదేహాన్ని పూడ్చి పెట్టేవారు. సింధూ ప్రజల లిపి బొమ్మల లిపి. దీన్ని కుడి నుంచి ఎడమ దిశకు రాసినట్లుగా తెలుస్తోంది.
మొహంజోదారో నగరం ఏడుసార్లు ధ్వంసమైనా మళ్లీ నిర్మించారు. ఇక్కడ 4.5 అడుగుల నాట్యం చేస్తున్న స్త్రీ విగ్రహాన్ని కనుగొన్నారు. వీరికి గుర్రం తెలియదు. అందువల్ల గుర్రాన్ని ఉపయోగించిన ఆర్యులు వీరిని సులభంగా ఓడించారని చరిత్రకారుల అభిప్రాయం. కొంత వరకు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఈ నాగరికత నాశనం చెందడానికి కారణమై ఉంటాయని భావిస్తున్నారు.
సింధూ నాగరికత ప్రజలకు సమకాలీకులైన సుమేరియన్లు ఇనుమును ఉపయోగించినా వీరు దీన్ని వాడలేదు. ఎన్నిసార్లు వరదలు వచ్చినా అదే ప్రాంతంలో నివసించారు. ఈ కారణాల వల్ల వీరికి ఆధునిక పద్ధతులను త్వరగా స్వీకరించే మనస్తత్వం లేదని భావిస్తున్నారు.
సింధూ నాగరికత ప్రజల ప్రత్యేకతలు
వరి, పత్తి పండించడంలో సిద్ధహస్తులు.
తూనికలు, కొలతలను ప్రామాణికబద్ధం చేశారు.
స్త్రీ శక్తిని పూజించడం వీరి నుంచే ప్రారంభమైంది. లింగ పూజ, అగ్ని పూజ, కోనేటి స్నానం వీరే ప్రారంభించారు.
దువ్వెనలు వాడటం, గాజులు ధరించడం వీరి నుంచి వచ్చినవే.
సింధూ నాగరికతకు చెందిన నగరాలు

వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు:
వేల సంవత్సరాలు గడిచిపోయాయి...వందల చరిత్రలూ కాలం లో కలిసి పోయాయి... 
మొహంజో దారో ఒక చరిత్ర పాఠమైపోయింది... అయితే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ మొహంజోదారో మనముందుకు వచ్చింది. చారిత్రక అంశాలతో పాటు అందమైన ప్రేమకథను కూడా కలుపుకోని నిర్మించబడ్డ 'మొహంజోదారో' ఇటివల విడుదల అయింది

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...