22, జులై 2016, శుక్రవారం

రామప్పను పట్టించుకోండయ్యా


ఓరుగల్లు కాకతీయ పరిపాలన వైభవానికి ప్రతిరూపం రామప్ప దేవాలవాయం. మహా సామ్రాజ్య పాలన… సంస్కృతి సాహిత్యాల కళా పోషణకు నిదర్శనం. శిల్పాలే సప్తస్వరాలు మోగించే అపురూప కట్టడం. ఇసుకపై కట్టిన ఆనాటి నిర్మాణం నిర్లక్ష్యానికి గురవుతుంది. పట్టించుకునే వారు లేకపోవడంతో శిల్ప సంపద శిధిలం అయిపోతుంది.

రామప్ప దేవాలయం ఓరుగల్లును పాలించిన కాకతీయుల కళా వైభవానికి ప్రతిరూపం. అద్భుతమైన శిలాసంపదతో, బలమైన పునాదులతో ఈ ఆలయ నిర్మాణం చేశారు. ఈ కట్టడం నేటితరం టెక్నాలజీకి ఒక సవాల్. వరంగల్ జిల్లా కేంద్రానికి 63 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాలంపేట గ్రామంలో ఉంది రామప్ప దేవాలయం. 800 ఏళ్ల కాలం నాటి రామప్ప గుడి నిరాదరణకు గురవుతోంది. వారసత్వ కట్టడంగా యునోస్కో గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్న రామప్ప ఆలయంలో ఎన్నో సమస్యలు.

చరిత్రకు అనవాలుగా నిలిచిన రామప్ప దేవాలయాన్ని క్రీ.శ. 1213లో గణపతిదేవుని సేనాని రేచర్ల రుద్రడు నిర్మించాడు. దాదాపు 46 సంవత్సరాల పాటు రామప్ప నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతారు. రామప్ప దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించారు. ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ముందు నుంచి ఏ దిశ నుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. మండపం పైకప్పు మీద శిల్ప కళలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ గుడి దండయాత్రలతో, 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపంతో శిథిలమైంది.

ఎన్నో యుద్ధాలను, దాడులను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడిన ఈ ఆలయంలో… చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదలి వేయడంతో… అవి కూడా శిథిలావస్థలో ఉన్నాయి. చీమలు, పందికొక్కులు, ఎలుకలు ఆలయంలో ఇసుకను తోడేస్తున్నాయి. దీంతో ఆలయ మనుగడే ప్రమాదకరంగా మారింది. చిన్న వర్షం పడినా గర్భ గుడి నుంచి మండలం వరకు నీళ్లు వస్తున్నాయి. సాహిత్యానికి, జీవన మనుగడ, గిరిజన సంస్కృతికి ఆనవాలుగా ఉన్న రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు పర్యాటకులు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాకతీయుల శిల్పకళాసంపద నిర్లక్ష్యానికి గురికావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...