30, జులై 2016, శనివారం

పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్ర

నిరంతర అన్వేషి , నిత్య శ్రామికుడు, విజ్ఞానఖని డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్ర్తి ఇక లేరు.
తెలంగాణా చరిత్రను శ్వాసింఛి, కాకతీయుల శాసనాలతో భాషించిన చరిత్ర, పురాతత్త్వ పరిశోధకులు
'' తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్ర హైద్రాబాద్‌లోని స్వగృహం‌లో మరణించారు.
పీవీపి శాస్త్రిగారి సంక్షిప్త సమాచారం:
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం‌లోని పెదకొండూరుగ్రామానికి చెందిన పుచ్చా వెంకటేశ్వ్వర్లు, రుక్మిణమ్మ దంపతులకు వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి 10 జనవరి 1910లో జన్మించార్రు.
తొలుత ఉపాధ్యాయుడుగానూ, తదుపరి పురాతత్త్వ, చరిత్ర శాఖలో అసిస్టెంటు డైరెక్టర్, సం‌యుక్త సంచాలకులుగానూ సేవలందించిన పీవీపీ కాకతీయుల చరిత్రకు సమగ్రరూపం ఇచ్చారు. శాసనాలు పరిష్కరించడం‌లో పరబ్రహ్మ శాస్త్రిదే చివరిమాట. పీవీపి గారి కాకతీయుల చరిత్రా పరిష్కారం‌లో కొన్ని ముఖ్యాంశాలు.
1. ఖమ్మం జిల్లా బయ్యారం శాసనం ఆధారంగా కాకతీయుల మూలాలను, కాకతీయుల వంశవృక్షాన్ని రూపొందించడం.
2. కాయస్థ అంబదేవునితో త్రిపురాంతకంవద్ద జరిగిన యుధ్ధం‌లో 1290 సం.లో (నవంబర్ 12/13తేదీలో) రుద్రమదేవి మరణించినట్లు నల్గొండ జిల్లా చందుపట్ల శాసనం ద్వారా నిర్ధారింఛడం.
3. దేవగిరి యాదవరాజులదిగా భావించిన రాజగజకేసరి ముద్రను కాకతీయులదిగా నిర్ధారించడం.
4. రుద్రదేవుని (మొదటి ప్రతాప రుద్రుడు) హన్మకొండ వేయిస్థంబాలగుడి శాసనాన్ని పునర్వ్యాఖ్యానించడం.
తెలంగాణా ఉద్యమకాలం‌లో సీమాంధ్రకు చెందిన ఒక సామాజిక వర్గంవారు కాకతీయులు తమ కులానికిచెందినవారుగా వాదించారు. పీవీపీ శాస్త్రిగారి “కాకతీయులు” గ్రంధం వల్ల వారి వాదనను తిప్పికొట్టడం సాధ్యమైంది.
=పరిశోధన==
కాకతీయుల గురించి, శాతవాహనుల గురించి లోతైన, నికార్సయిన అధ్యయనం చేసిన ఏకైక పరిశోధకుడు పరబ్రహ్మశాస్త్రి. వెలుగుచూడని కాకతీయ వైభవానికి సంబంధించి కొన్ని అంశాలను గుర్తించి అజ్ఞాతంగా ఉన్న శాసనాలను వెలికితీసి ప్రామాణిక గ్రంథాలను రచించారు. [[తెలంగాణ]] కు గర్వకారణంగా ఉన్న చరిత్రను విశ్వవిఖ్యాతం చేసిన పండితులలో ఈయన అగ్రగణ్యుడు. గ్రామాలకు వెళ్లి అసలు చరిత్ర ప్రజల జీవనవిధానంలోనే ఉందని గుర్తించి అదే తపనతో ఆ సమాచారాన్ని ఒడిసిపట్టుకుని ఏ హంగులూ లేని కాలంలో అద్భుతమైన యజ్ఞం చేశారు. శాసనాలు అన్నీ చదవగలిగిన ఏకైక వ్యక్తి ఈయన ఒక్కరేనని అనేకమందితో గుర్తింపబడ్డారు.
చరిత్రనే గాక, లిపి పరిణామాన్ని కూడా వివరించి పండితులను మెప్పించిన మేధావి పరబ్రహ్మ శాస్త్రి.
డాక్టర్ '''పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి ' కాకతీయుల చరిత్రపై అనేక అధ్యయనాలు చేసి పలు గ్రంధాలను రచించారు. [[ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం]] ఈయన వ్రాసిన గ్రంధమే.
పరబ్రహ్మశాస్త్రి విజ్ఞానానికి ప్రతీక అన్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రధాన స్రవంతిలో ఉంటూ శాస్ర్తియ పరిశోధన చేయడం చా లా ప్రామాణికంగా నలుగురూ ఒప్పుకునే స్థితిలో పరిశోధనలు చేయడం, ఇంకా నిత్యాభ్యాసాన్ని కొనసాగించడం గొప్ప లక్షణం.చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా వెల్లడించి రాబోయే తరాలకు జ్ఞానాన్ని క్రోడీకరించి అందించడం తెలుగుజాతి గర్వించదగ్గ విషయం చరిత్రపై పరిశోధనలు అంత తేలికైన విషయం కాదని, ఎంతో నిబద్ధత, జ్ఞానం ఉండాలి. ఎంతో ఉన్నతమైన విలువలున్న వారు చాలా మంది సమాజంలో ఉన్నారని, అలాంటి వారిలో ప్రముఖుడైన పరబ్రహ్మశాస్త్రి
పివి పరబ్రహ్మశాస్త్రి చారిత్రకపరిశోధనలు తెలుగువారిచరిత్ర వున్నంతకాలం మరువరానివే.వారి రచనలు ప్రశంసనీయం.వారి మరణం తెలుగుచరిత్రరచనకు పెద్దలోటు.
పీవీపీ శాస్త్త్రిగారి మరణం తీర్చలేని, పూడ్చలేని లోటు. వారి కుటుంబం మనోధైర్యంతో ఉండాలని కోరుకుంటూ

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...