19, జూన్ 2016, ఆదివారం

Fathers day

తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఏర్పడిన ఫాదర్స్‌డే వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.
పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లితో పాటు తండ్రికి కూడా ప్రధాన పాత్ర ఉందని అయినప్పటికీ తల్లికి లభించిన గుర్తింపు తండ్రికి లభించడంలేదనే ఉద్దేశంతో తండ్రి పాత్రకు గుర్తింపునివ్వడం కోసం ఓ కూతురు పడిన తపన నుంచి పుట్టిందే ఈ ఫాదర్స్‌ డే.
తల్లులకోసం ఒకరోజు కేటాయించినప్పుడు తండ్రుల కోసం కూడా ఒకరోజు ఎందుకు కేటాయించకూదని పోరాటం చేసిందామె. ఈ ఫలితంగా 1910 జూన 19న ప్రపంచంలో తొలిసారి అమెరికాలో ఫాదర్స్‌ డే నిర్వహించారు. నిజానికి జూన 5న ఈ వేడుకలు నిర్వహించాలనుకున్నారుగానీ, జూన మూడో ఆదివారాన్ని ఫాదర్స్‌ డేగా నిశ్చయించారు.
1916 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన ఫాదర్స్‌ డేకి అధికారిక ముద్ర వేశారు. అప్పటి నుంచి యేటా జూన మూడో ఆదివారం నాడు ఫాదర్స్‌డే సెలబ్రేట్‌ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన (1972) ఫాదర్స్‌డేను జాతీయ పండుగగా ప్రకటించాడు.
తర్వాత అది ప్రపంచ వ్యాప్తమైంది.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...