8, జూన్ 2016, బుధవారం

ఫణి గల రామప్ప ఆలయం...

స్థల పురాణం :
త్రేతాయుగంలో రామరావణ యుద్దంలో రావణవధ అనంతరం  రాముడు తనకు సంక్రమించిన బ్రహ్మహత్యాపాతకాన్ని పోగోట్టుకోవడానికి తన కులగురువు అయిన వశిష్టుని ఆజ్ఙానుసారం సేతుబంధన ప్రదేశం ( రామేశ్వరం) లో శివలింగాన్ని ప్రతిష్టించాలనుకున్నాడు.వాయునంధనుడు ,రామబంటు ,శివాంశసంభూతుడైన హనుమంతున్ని ముహూర్తకాలంలో కైలాసం నుండి శివలింగాన్ని  తీసుకునిరావాల్సిందిగా రాముడు ఆదేశిస్తాడు.
రాముని ఆదేశం అనుసారం  హనుమ వాయువేగాన కైలాసానికి వెళ్లి శివలింగాన్ని తీసుకునివస్తూ మార్గమధ్యంలో లఘుశంక నిమిత్తం ఈ కొండపై ఆగాడు.మూహూర్త సమయం కావడం వల్ల లింగం ప్రతిష్టించబడింది.అలా ప్రతిష్టించబడిన శివలింగాన్ని హనుమ  తిరిగి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించగా రాలేదు.దాంతో హనుమ చేతులతో పెకలించి ,పిడికిలితో కొట్టి ,తోకతో చుట్టి ,ఇలా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వీలుకాకపోవడంతో  ఈ శివలింగానికి ఎండావానల నుండి రక్షణకు గానీ ఒక పెద్ద కప్పుబండని పైన కప్పి
మరలా కైలాసానికి వెళ్ళి మరో శివలింగాన్ని తోసుకుని రామేశ్వరానికి వెళ్తాడు.
అప్పటికే మూహూర్తం మించి పోతుందనే భయంతో రాముడు తన భార్య సీతతో  ఇసుకతో శివలింగాన్ని తయారుచేయించి ప్రతిష్టింపజేసాడు.హనుమంతుడు అలగటంతో ఆ శివలింగాన్ని కూడా ప్రతిష్టించి  ప్రధమ పూజ జరిగే విధంగా అనుగ్రహించాడు.
శ్రీరామలింగేశ్వరస్వామి అని నామకరణం చేసి
ఈ శివలింగం ఎత్తు సుమారు 9 అడుగుల చుట్టుకొలత,5 అడుగుల ఎత్తు పైకి కనపడుతూ  ధగధగ మెరుస్తుంది.ఇప్పటికీ హనుమంతుడు కొట్టిన దెబ్బలు,మోకాలి ముద్రలు శివలింగానికి స్పష్టంగా కనపడతాయి...
లింగం అనేది ఒక చిహ్నం .సర్వాంతర్యామి అయిన శివునికి ఏ ఆకారం లేదని ,ఎటువంటి అవయవాలు ఉండవనీ ,సర్వ వేదమయుడనీ,చరాచర ప్రపంచ స్వరూపుడని, చెప్పడానికి గుర్తుగా ఉన్న తత్వం ఈ శివలింగం...

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...