21, జూన్ 2016, మంగళవారం

ప్రపంచ సంగీత దినోత్సవం

ప్రపంచ సంగీత దినోత్సవం (World Music Day) ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపుకుంటారు. ఇది మొదటిసారిగాఫ్రాన్స్ లో 1982లో ప్రారంభించబడినది. ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా ఫ్రాన్స్ లో 1982లో ప్రారంభించబడినది.

సంగీతం

సంగీతం - ఒక అద్భుతం! సృష్టిలో దాని స్థానం అద్వితీయం. మనుషులేం ఖర్మ? దేవతలు సైతం సంగీతాన్ని వదలలేకపోతుంటారు. ఒక్కోసారి వేణువు, ఒక్కోసారి డమరుకం సాయంతో సంగీత సాధన జరిగిపోతూ ఉండేది. అందువల్లే కాబోలు, చదువుల తల్లి 'సరస్వతీ దేవి'కి కూడా ఓ చేతిలో పుస్తకం వుంటే - మరో చేతిలో వీణ అలంకరించింది. సంగీతంలో కావాల్సిన వారికి శక్తి, రక్తి, భక్తి దొరుకుతుంది. విశ్వజనీనంగా మాడ్లాడే శక్తి కేవలం 'సంగీతానికే వుందన్నది నిర్వివాదాంశం! సంగీతం మానవుల సర్వసామాన్య భాష! ప్రపంచంలో ఎలాంటి ఎల్లలూ లేకుండా స్వైర విహారం చేసేది సంగీతమే!

రాతియుగం నుంచి కంప్యూటర్‌ యుగం దాకా సంగీతం స్వేచ్ఛగా రాజ్యమేలుతున్నది - అనే సత్యాన్ని గుర్తించాలి . రాతి యుగంలో...

అసలు గుడ్డలూ, స్టైల్లూ, ఫ్యాషన్లూ లేని పాషాణయుగం. మనిషి డ్యూటీ 'వేట'. కడుపు నింపడం. రాయితో రాయి ఢకొీన్నప్పటి 'ఠక... ఠక' , రాయి నీటిలో పడ్డప్పటి 'బుడుంగ్‌', జంగల్‌లో మంగల్‌ చేసే సెలయేటి గలగలలు, చెట్ల ఆకుల గరగరలు, నీలాకాశంలో రివ్వున ఎగిరిపోయే పక్షుల కిలకిలా రావాలు, పాపాయి నోటి 'ఉంగ్వాఁఁ ఉంగ్వాఁఁ' ల తొలి రాగాల్లో సంగీతాన్ని గమనించారు. పాషాణ యుగంలోని మన పూర్వజులు.

క్రీ.పూ 5000-6000 వైదిక కాలంగా భావిస్తే - మన నాలుగు వేదాలను సకల కళల 'గంగోత్రి'గా భావించక తప్పదు.

వేదాలు అపౌరుషేయాలు. ముఖోద్గతం చేసి ఇంకొక తరానికి అందించబడ్డాయి.

వేదాల్లో 'రుచ'లు. సంగ్రహం సామవేదం. అన్నీ గేయ స్వరూపాలే!

మధ్యయుగంలో...

మధ్య యుగంలో (క్రీ.శ. 800 - 1800) రాగ సంగీతం మొగ్గలేసింది. ఆ తర్వాత సంగీతంలో 'ఖయాల్‌ గానం'... 'వాద్యగానం' ప్రజాదరణ పొందసాగాయి. ఖైబరు కనుమల నుండి జోరుగా మొగలాయీ దండయాత్రలు సాగాయి. వారి వెంట కత్తులూ, కఠార్లతో పాటు 'యుద్ధ పిపాస' ఏమాత్రం లేని అరబ్బీ, ఫారసీ, ఇరానీ సంగీతం కూడా వచ్చింది మనదేశంలోకి.

తన చుట్టూ ఎల్లల వలయాలు సృష్టించుకోలేని, సంగీతం మెల్లమెల్లగా ఇక్కడి సంగీతంతో మమేకమైంది.

'కవ్వాలి' అలా అక్కణ్ణించే వచ్చి నేడు సినిమా తెరమీదా, మన సమాజంలోనూ విడదీయలేని భాగమైపోయింది. నేటికీ 'ఉర్స్‌' ఉన్నచోట 'కవ్వాలి' ఉండాల్సిందే! సారంగీ, సరోద్‌ - చంగ్‌ షV్‌ానాయీ - బర్‌బత్‌ - రబాబ్‌ లూ అక్కడివే! హాయిగా ఇక్కడివైపోయి సన్నాయి నొక్కలు సాగిస్తూ నవ్వుకున్నాయి.

ముస్లిమ్‌ సంగీతం

ముస్లిమ్‌ సంగీతంలో ఆద్యుడు 'ఇబ్నే - ముసV్‌ా -హజ్‌'. ఇరాకలోేని 'అబ్బాసీ దర్బాల్‌'లోని అరబ్బీ, ఫారసీల సంగీతాన్ని కలుపుకుని 'ఇరానీ సంగీతం' రూపంలో ప్రపంచం నిండా వ్యాపించింది. ఇరానీ 'కవ్వాల్‌' సంగీతంలోని 'జంగులా' - 'జీఫ్‌' - 'షాహనా' - దర్బారీ' - 'జిలా' (ఖవజ్‌) మెల్లమెల్లగా మన సంగీతంలో కలిసిపోయాయి. 'అమీర్‌ ఖుస్రో' రెండు సంగీతాల మేళవాన్ని 'అందమైన సంగీత మిశ్రమం'లా తయారు చేశాడు. 'సితార్‌' నిర్మాణం ఆయనదే అని చెప్పుకుంటారు. ముస్లిమ్‌లది 'సూఫీ సాంప్రదాయ సంగీతం'. అంతా భక్తి సంగీతం అన్నమాట. మొహమ్మద్‌ తుగ్లకనుే మనం చరిత్ర చదివో చదవకో, 'పిచ్చి తుగ్లక' అని స్టాంప్‌ అంటించి దులుపుకున్నాం. కానీ, ఆయన దర్బార్‌ లోనూ సంగీతం పొంగి పొర్లింది. ఆ 'తుగ్లక'గారి దర్బారులో అలనాటి గొప్ప గాయకుడు 'అమీర్‌ షమ్స్‌ ఉద్దీన్‌ తబ్రేజీ ' ఉండేవాడు. అలానాటి 'దేవ్‌గఢ్‌' (నేటి 'ఔరంగాబాద్‌' సమీపానున్న 'దౌలతాబాద్‌' కోట) దగ్గర 'తరబాబాద్‌'అనే 'చౌపట్‌ బజార్‌' ఉండేది. పగలు మూడు గంటల్నుంచి తెల్లారే దాకా అక్కడ 'అరబీ - ఇరానీ - హిందూస్థానీ' సంగీతం ప్రముఖంగా ఉత్తర భారత దేశాలలో జోరందుకుంది. అలనాటి మధుర, అయోధ్య, బనారస్‌, లక్నో ప్రముఖమైన 'సంగీత క్షేత్రాలు'. షాజహాన్‌ కాలంలో సంగీతం మీద 'షమ్స్‌ - ఉల్‌ - అస్వాత్‌' అనే మొదటి గంథ్రం రాశారట. రెండో అక్బర్‌ కాలంలో 'మీర్జాఖాన్‌', సంస్కృత పండితుల సాయంతో 'తుహఫా - తుల్‌ - హింద్‌' అనే గొప్ప గ్రంథం రచించాడు. అందులో జ్యోతిష్యం, సాముద్రికం, కోకశాేస్త్రం, నాయికా భేదం, ఇంద్రజాలం వంటి విషయాలతో పాటు అలనాటి సంగీతం ముచ్చట్లున్నాయి.

భారతీయ సంగీతం

భారతీయ సంగీత శాస్త్రం గురించి ఫారసీలో నవాబ్‌ 'ఆసఫ్‌ - ఉద్దౌలా' శాసనకాలంలో రాసిన 'ఉసూల్‌ - ఉల్‌ - నగమాత్‌ - ఉల్‌ - ఆసిఫియా' గొప్ప గ్రంథం. ఇప్పుడు ఒకటో - రెండో ప్రతులు, అవీ ఏ మ్యూజియంలోనో ఉండొచ్చు. 'వాజిద్‌ అలీషాV్‌ా' జమానా వచ్చే సరికి లఖ్నోలోకదర్‌పియా రచించిన 'ఠుమ్రీ'లు గల్లీ గల్లీలోని 'ఆమ్‌ ఆద్మీ' కోసం పసందుగా నిలిచిపోయాయి. ధృపద్‌ - హోరీల కన్నా ఖమాజ్‌ - ఝింఝోటీ - భైరవీ - సునిద్రా - తిలక - కామోద్‌ - పీలూ లాంటి రాగాల స్వరాలు పాపులర్‌ అయిపోయాయి. సర్వసామాన్యులు కూడా 'ఠుమ్రీ'లు గున్‌గానాయించేవారు.

ఆ కాలంలో హిందూస్థానీ రాగ రాగినీలు, ముఖ్యంగా భైరవీ రాగం అక్షరాలా లఖ్నో 'తెల్ల ఖర్బూజా'లంత జనరంజకాలు. ఎంతో ప్రజాదరణ పొందాయి. పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే చాలు 'జులుష్‌' (ఊరేగింపు)లో 'ఢోల్‌ -తాషా', 'రౌషన్‌ చౌకీ', - 'నౌబత్‌' - 'తురహీ - కర్నా(శంఖం)' - 'ఢంకా-బిగుల్‌' - 'అంగ్రేజ్‌ ఆర్గన్‌' ఉండాల్సినవే. అలా, అలనాడు సంగీతం మామూలు మనిషి ఇంట్లో, ఒంట్లో సుతారంగా ఒదిగిపోయింది. అక్బర్‌ పాదుషా కాలంలో సంగీతం మూడు పువ్వులు- ఆరు కాయల్లా వెలిగిపోయింది. కొన్ని వెలుగులు 'రాగ్‌ - దీప్‌' తాలూకు మహానీయుడైన 'సంగీత్‌ సామ్రాట్‌ తాన్‌సేన్‌'వి. మనం కూడా మరిచిపోలేదు (చాలామంది రసికులకు 'బైజుబావరా' జ్ఞాపకం వుండొచ్చు ఇంకా). ఎటొచ్చీ - ఔరంగజేబు చూపుల్లో, మనసుల్లో సంగీతం లాంటి రమ్యతలు అంతగా పొసగలేదు. ఆయనకు నచ్చిందల్లా ఒక్కటే. గెలిచిన చోటల్లా 'నౌబత్‌'లను జోరుగా వాయించడం. మన హైదరాబాద్‌ 'నౌబత్‌ పహాడ్‌'మీది సంగీతం అలనాటి 'నగరాల మోతే'!

ఆధునిక సంగీతం

చూస్తూ చూస్తూ ఆధునిక కాలం వచ్చేసింది. వాద్యసంగీతం, లలిత సంగీతం కూడా మామూలు మనుషుల గుండెలకు చేరువైపోయాయి.

భరతుడి 'నాట్యశాస్త్రం', జయదేవుడి 'గీతాగోవిందం'ల చోటే ఠుమ్రీ, గజల్‌, అభంగ్‌, భజన గీతాలు పాపులర్‌ అయిపోయాయి.

ఆత్మ పల్లవించే పడవలా, వెచ్చని పాటలతో, వెండి అలలపై నిద్రిస్తున్న రాజహంసలా అలనాటి సినిమా సంగీతం - ఆ తర్వాత నేటి రణగొణ ధ్వనులతో నిండిన, గల్లీ గల్లీలో సునామీలా దద్దరిల్లే లొల్లి సంగీతం వచ్చింది.

షహ్నాయి, సంతూర్‌, వేణువు, వయోలిన్‌, సితార్‌ ల అద్భుత లయలతో పాటు సింఫొనీ, సొనటా, కన్సర్ట్‌, క్యార్టెట్‌, ర్యాంప్‌, బీటల్స్‌ కూడా వచ్చాయి.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...