25, జూన్ 2016, శనివారం

మైకేల్ జాక్సన్ స్మృతి లో...

మైకేల్ జాక్సన్ స్మృతిలో(Michael Jackson)
సెలబ్రీటీ అనే పదానికి స్వచ్చమైన అచ్చమైన నిలువెత్తు ఉదాహరణ మైకేల్ జాక్సన్.
ఆయనని మించిన సేలబ్రిటీ లేరు.
ఆయనను మించిన లెజెండ్ లేరు. ౅౅
౅౅౅ఒక వ్యక్తికి అత్యంత భాద, భయం లేదా సంతోషం కలిగినప్పుడు faint అవుతాడు. faint అయేంత బాధ,భయం కలగడానికి కారణాలెన్నో కానీ, ఈ సృ౤౤ష్టిలో ఒక మనిషికి faint అయేంత సంతోషం కలిగించగలిగేది ఒక్క జాక్సన్ మాత్రమే.
ఆటకైనా పాటకైనా ఈ భూప్రపంచంలో ఆయనని మించినవారు లేరు. తన performance తో వీక్షకులకు అత్యంత ఉత్కృ౤౤ష్టమైన సంతోషాన్ని ఒక్క Michael Jackson మాత్రమే కలిగించగలరు.ఆయన జీవితంలో ఆయన చుట్టూ కమ్ముకున్న వివాదాల్ని పసిపాపను పిచ్చికుక్క కరవడంతో పోల్చవచ్చు. ఆయన ఇజం హ్యూమనిజం (Humanism). ఆయన పరిపూర్ణ మానవతా వాది. క్యాన్సర్ (cancer) తో బాధ పడుతున్న ఒక పిల్లవాడిని తల్లిదండ్రుల దగ్గరనుండి తీసుకుని, స్వంత తల్లిదండ్రులకంటే ఎక్కవ ప్రేమనివ్వగలిగిన మనసాయనది. ఆపిల్లవాడిని తన ఇంటికి తీసుకెళ్ళి ఆన్ని తానై సపర్యలు చేసి బాలుడి చివరి రోజుల్లోఅత్యంత సంతోషంతో గడిపేంత ప్రేమనిచ్చారు. ఆఫ్రికాలో మురికివాడల్లో నివసించే నిరుపేదల గూర్చి, ఆకలి చావుల గూర్చి ఆయన ఎంతో మదన పడేవారు. అందుకే కోట్ల కోద్ది దనాన్ని ఖర్చుచేసారు. ఆయన వీడియోలు చూసిMichael Jackson లేని ప్రపంచాన్ని ఊహించుకోలేని పోయేవారెందరో. ఆయనకీ మరణం ఉంటుందని నమ్మని వాళ్ళలో నేనుఒకన్ని.ఇలాంటి వారు మిలీనియంకి ఒకరు పుడతారట. ఇంతటి ప్రజాభిమానం సంపాదించిన వ్యక్తి మరొకరు పుడతారా౤? ఆయన చనిపోలేదు, లండన్ పర్యటన రోజు ప్రత్యక్షం అవుతారని కొన్ని పత్రికలు రాసా౤యి. ఆదే నిజం అవాలని ఆశిస్తూ......

మైకల్ జోసెఫ్ జాక్సన్ (ఆగష్టు 29,1958 - జూన్ 25, 2009) అమెరికా కు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం "త్రిల్లర్" (Thriller) జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచం లో ఒక భాగంగా ఉన్నాడు. 1970 ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్ల జాతి సంగీత కళాకారుడు జాక్సన్.

జాక్సన్ మొత్తం 13 గ్రామీ అవార్డు లు గెలుచుకున్నాడు. 8 ఒకే రాత్రి 1984 లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో నంబర్ 1 గా నిలిచాయి. ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా. జాక్సన్ US$ 300మిలియన్ల దానధర్మాలు చేసాడు.

కాని జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది. 1990 నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు. 1988 నుండి 2005 వరకు జాక్సన్ తన నెవెర్‌లాండ్ రాంచ్ లో ఉన్నాడు. అక్కడ ఒక జూ మరియు అమ్యూజ్‌మెంట్ పార్క్ కట్టించాడు. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించేవాడు. 11 ఫిబ్రవరి 2008 నాడు జాక్సన్ త్రిల్లర్ 25 అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు.

బాల్యం

జాక్సన్ వాళ్ళ నాన్న, జోసెఫ్ జాక్సన్, ఒక స్టీల్ మిల్లు లో పనిచేసేవాడు. జాక్సన్ వాళ్ళ అమ్మ పేరు క్యాథరీన్ జాక్సన్. జాక్సన్ చిన్న తనము లో తన తండ్రి వల్ల ఎన్నో బాధలు అనుభవించాడు. తనను తన తండ్రి మానసికముగ మరియు శారీరకముగా హింసించే వాడని జాక్సన్ పేర్కొన్నాడు. జాక్సన్ తన చిన్నప్పటి బాధలను గురించి మొదటి సారిగా ఫిబ్రవరి 10,1993 ఒప్రా విన్ ఫ్రీ లో మాట్లాడాడు. తను చిన్న తనములో ఒంటరి తనము వల్ల ఎంతో ఏడ్చేవాడనని చెప్పాడు.

కుటుంబం

రెబ్బి (సోదరి)జాకి (సోదరుడు)టిటొ (సోదరుడు)జర్మైని (సోదరుడు)ల టొయ (సోదరి)మార్లొన్ (సోదరుడు)రేన్డి (సోదరుడు)జనెట్ (సోదరి)


మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...