28, జూన్ 2016, మంగళవారం

పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి


భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు, పాములపర్తి వేంకట నbరసింహారావు 1921, జూన్ 28న జన్మించాడు. పి.వి.నరసింహారావు, పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందిన వాడు. భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.
రాష్ట్ర రాజకీయాల్లో పీవీ
1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.
ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదు లో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు.తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన.
కేంద్ర రాజకీయాల్లో పీవీ
తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.మొదటిసారిగా లోక్సభ కు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి 1991 లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్సభలో అడుగుపెట్టాడు. 1980 - 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు.
ప్రధానమంత్రిగా పీవీ
ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్.టి.రామారావు ఆయనపై తెలుగు దేశం అభ్యర్ధిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా. ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది.
పీవీ విశిష్టత
బహుభాషా పండితుడు, పీవీ. తెలుగుతో సహా, 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో ను అబ్బురపరచాడు.
పీవీ నరసింహారావు చాలా నిరాడంబరుడు. తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయతీపరుడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. అలాంటి వ్యక్తి చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. ఆయనకాగతి పట్ట
డానికి కారణం ఉత్తరాది లాబీ. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుదివరకూ నిండుకుండలానే ఉన్నారాయన.
2004 డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసాడు.

27, జూన్ 2016, సోమవారం

ఫీల్డ్ మార్షల్ మానెక్ షా

సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌షా పూర్తి పేరు శాం హోర్ముస్‌జీ ఫ్రేంజీ జెమ్‌షెడ్జీ మానెక్‌ షా (ఏప్రిల్ 3, 1914 – జూన్ 27, 2008). 1971లో పాకిస్తాన్ తో యుద్ధంలో భారత్‌కు అతిపెద్ద సైనిక విజయాన్ని సాధించి పెట్టిన ఆయన బంగ్లాదేశ్ ఆవిర్భావానికి అద్యుడయ్యారు. మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొన్నారు. గూర్ఖా రైఫిల్స్‌తో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా అందరూ ప్రేమతో ఆయనను 'శ్యామ్‌ బహదూర్‌' అని పిలుచుకుంటారు.

శాం‌ మానెక్‌షా, జననం ...
బాల్యం
1914 ఏప్రిల్‌ 3వ తేదీన అమృతసర్‌లోని పార్శీ దంపతులకు మానెక్‌షా నలుగురు అన్నలు ఇద్దరు అక్కల మధ్య ఐదవ వాడిగా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రం‌లోని వల్సాద్‌ అనే చిన్న పట్టణం నుంచి అమృతసర్,పంజాబ్ రాష్ట్రం‌కు వలస వచ్చారు.

కుటుంబ జీవితం

తన భార్య సిల్లూ బోడె తో కలసి మానెక్‌షా
1937లో లాహోర్లో ఉన్నప్పుడు ఓ కార్యక్రమంలో సిల్లూ బోడె ను ఆయన కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అదే ఏడాది ఏప్రిల్‌ 22న వారు వివాహం చేసుకున్నారు.
ఆయనకు ఇద్దరు కుమార్తెలు,షెల్లీ బాట్లీవాలా, మాయా దారూవాలా.

వృత్తి జీవితం
అమృతసర్‌, నైనిటాల్‌లలో పాఠశాల విద్య పూర్తయ్యాక డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీ లో క్యాడెట్‌గా తొలి బ్యాచ్‌లో మానెక్‌ షా చేరారు.

1934 లో ఆయన సైన్యంలో రెండో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు
జూన్ 7,1969 న జనరల్ కుమారమంగళం నుండి 8వ సైనిక దళాల ప్రదానాదికారిగా బాధ్యతలు స్వీకరించి.15,జనవరి 1973 న పదవి విరమణ చేసారు.
సాధించిన విజయాలు
బ్రిటిష్‌ జమానా మొదలుకొని నాలుగు దశాబ్దాల పాటు సైన్యంలో సేవలు అందజేసిన శాం‌ మానెక్‌షా- రెండవ ప్రపంచ యుద్ధంలోను, భారత స్వాతంత్య్రానంతరం చైనా, పాకిస్థాన్‌లతో జరిగిన మూడు యుద్ధాల సందర్భంగాను ప్రదర్శించిన వ్యూహ చతురత, బుద్ధికుశలత అమోఘమైనవి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జపాన్‌ ఆక్రమిత దళాలను తిప్పికొట్టేందుకు ఉద్దేశించిన సైనిక విభాగం అధిపతిగా బర్మాలో ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. కడుపులోకి ఏడు గుళ్లు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పతకం 'మిలిటరీ క్రాస్‌'ను మృతులకు ప్రకటించరాదన్నది నియమం. మానెక్‌షా బతికి బట్టకట్టకపోవచ్చునని భావించిన నాటి మేజర్‌ జనరల్‌ డి.టి.కోవన్‌, తన 'మిలిటరీ క్రాస్‌ రిబ్బన్‌'ను తక్షణం మానెక్‌షాకు ప్రదానం చేశారు. అదృష్టవశాత్తు మృత్యుముఖంలోంచి బయటపడిన మానెక్‌షా, మరోసారి బర్మాలో జపాన్‌ సైనికులను ఢీకొన్నారు. మళ్ళీ గాయపడినప్పటికీ వెన్నుచూపలేదు. జపాన్‌ సైనికులు లొంగిపోయాక, 10 వేల మందికిపైగా యుద్ధఖైదీలకు పునరావాసం కల్పించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 1947లో దేశవిభజన, 1947-48లో జమ్ముకాశ్మీర్‌లో సైనికచర్యల సందర్భంగా ఆయన తన పోరాటపటిమను మరోమారు లోకానికి చాటిచెప్పారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం ఆయన వ్యూహనైపుణ్యానికి, దీక్షాదక్షతలకు అద్దంపట్టింది. ఆ యుద్ధంలో పాక్‌ చిత్తుగా ఓడిపోవడమేకాదు, 45,000 మంది పాక్‌సైనికులు, మరో 45,000 మంది పౌరులు యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు. తరువాత బంగ్లా ఆవిర్భావానికి దోహదపడిన సిమ్లా అంగీకారం కుదర్చడంలోనూ ఆయనది కీలక భూమికే. ఆయన సమర్థ సారథ్యం దేశసైనిక దళాల్లో సరికొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 1973 జనవరిలో మొట్టమొదటి ఫీల్డ్‌మార్షల్‌గా పదోన్నతి కల్పించి, ఆయనను సముచితరీతిలో గౌరవించింది.

పురస్కారాలు
మరింత సమాచారం: పురస్కారం పేరు, బహుకరించింది ...
విశేషాలు
మానెక్‌ షా పుట్టినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన పాల్గొన్నారు
గూర్ఖా రైఫిల్స్‌తో ఆయనకున్న అనుబంధానికి గుర్తుగా అందరూ ప్రేమతో ఆయనను 'శ్యామ్‌ బహదూర్‌' అని పిలుచుకుంటారు.
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జపాన్‌ ఆక్రమిత దళాలను తిప్పికొట్టేందుకు ఉద్దేశించిన సైనికవిభాగం అధిపతిగా బర్మాలో ఆయన ప్రాణాలొడ్డి పోరాడారు. కడుపులోకి ఏడు గుళ్లు దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే అత్యున్నత పతకం 'మిలిటరీ క్రాస్‌'ను మృతులకు ప్రకటించరాదన్నది నియమం. మానెక్‌షా బతికి బట్టకట్టకపోవచ్చునని భావించిన నాటి మేజర్‌ జనరల్‌ డి.టి.కోవన్ తన 'మిలిటరీ క్రాస్‌ రిబ్బన్‌'ను తక్షణం సమరరంగంలోనే ప్రదానం చేశారు.
భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్‌ మార్షల్‌.
సాంకేతికంగా చూస్తే ఫీల్డ్‌ మార్షల్‌కు పదవీ విరమణ ఉండదు. చనిపోయేవరకూ అ పదవి గౌరవం దక్కుతుంది. కానీ బాధ్యతల పరంగా మాత్రం అధికారాలు ఉండవు.
కార్లన్నా, మోటారు సైకిళ్లన్నా మానెక్‌షాకు ఇష్టం
పదవీ విరమణ చేశాక మానెక్‌షా తమిళనాడు లోని నీలగిరి ప్రాంతంలో ఉన్న కూనూరు లో స్థిరపడ్డారు
'అయామ్‌ ఓకే' మానెక్‌షా తనకు చికిత్స చేస్తున్న వైద్యులతో చివరిగా అన్న మాట
ఉదకమండలంలో (ఊటీ) ఉన్న శ్మశాన వాటికలో 2001వ సంవత్సరంలో చనిపోయిన భార్య సమాధి పక్కనే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు
వ్యక్తిత్వం
ఒక సైనికుడికి,ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు నూటికి నూరు శాతం ఈయనలో గమనించవచ్చు. సైనికులకు మాత్రమే కాకుండా సాదారణ వ్యక్తులకు కూడా ఒక వ్యక్తి ఎంత సాధించగలడో ఉదాహరణగా నిలిచిన విశిష్ట వ్యక్తిత్వం ఈయన సొంతం.

1971 ఆరంభంలో తూర్పు పాకిస్థాన్‌ నుంచి పెద్దయెత్తున శరణార్థులు భారత్‌లోకి వస్తున్న సమస్యపై ఆ ఏడాది ఏప్రిల్‌ 27న జరిగిన క్యాబినెట్‌ సమావేశానికి త్రివిధ దళాధిపతుల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మానెక్‌షానూ ఆహ్వానించారు.ఈ సమస్యని పరిష్కరించడానికి తక్షణం సైనికులని పంపాలన్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నిర్ణయాన్ని వాతావరణం అనుకూలంగా లేదన్న కారణముతో ఒప్పుకోకుండా,వెంటనే యుద్ధానికి దిగక తప్పదంటే మానసిక లేదా శారీరక అనారోగ్య కారణాలపై రాజీనామా చేయడానికీ తాను సిద్ధమే అనడం ద్వారా తన నాయకత్వ లక్షణాలని చాటిన ఈయన, తన సమర్థ వాదనతో క్యాబినెట్‌ను ఒప్పించి 1971 డిసెంబరులో, అన్ని విధాలా సానుకూల పరిస్థితుల్ని చూసుకొని పాక్‌పై పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రారంభించి, అద్భుత విజయం సాధించి చూపి తన నిర్ణయం ఎంత సరియినదో నిరూపించి వ్యూహకర్తగా ఆయన చతురతను చాటిచెప్పిన వైనం అద్వితీయం.

మీ యుద్ధ విమానాలు నాశనం చేశాం,మిమ్మల్నందరిని మా సైనికులు చుట్టూ ముట్టి వున్నారు లోంగిపోకపొతే నిర్ధాక్ష్యంగా చంపేస్తాం అంటూ పాకిస్తాను సైనికులని కఠినంగా హెచ్చరించి శత్రువులని లొంగదీసుకున్న వృత్తి పరమయిన బాధ్యతని ఎంత ఖచ్చితంగా నిర్వర్తించారో భార్యకు ఇష్టం అయిన ప్రదేశమని తమిళనాడు లోని కూనూరు అనే సుందర ప్రాంతం లో ఉద్యోగ విరమణ అనంతరం స్థిరపడిన వైనం అయన సున్నిత మనస్తత్వానికి నిదర్శనం.

ఉద్యోగ విరమణ అనంతరం ఈయన 9 కంపెనీలకి డైరెక్టర్ గా పనిచేసి వ్యాపార రంగంలో కూడా విజయవంతంగా రాణించి తన సమర్ధతని నిరూపించుకున్నారు.

శాం‌ మానెక్‌షా గొప్ప వక్త కూడా. మాటలోనే కాదు రాతలో కూడా స్పష్టత, క్లుప్తత, వ్యంగ్యం ఆయన సొంతం. సామాజికపరమైన, ముఖ్యంగా దౌత్య సంబంధమైన కార్యక్రమాలకు ఆయనను ముఖ్య అతిథిగా పిలిచేవారు.1999లో ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో హాస్యోక్తులలో 40 నిమిషాలపాటు అనర్గళంగా ప్రసంగించిన ఆయన, భారత సమాజాన్ని నాయకత్వ కొరతే పట్టిపీడిస్తోందంటూ చేదు నిజాన్ని చాటిచెప్పారు. అన్ని రంగాల్లో నెలకొన్న నాయకత్వ కొరతే దేశంలోని అస్తవ్యస్త పరిస్థితులకు కారణమని స్పష్టం చేశారు. వృత్తిపరమైన సామర్థ్యం, విజ్ఞానం, నిజాయతీ, నిష్పాక్షికత, ధైర్యం, విశ్వసనీయత, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధత - ఇవీ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలని తెలియజేసి ఎన్నో లక్షలమంది సైనికులకి, సైనికులుగా చేరాలనుకున్న వారికే కాకుండా సామాన్యులకి కూడా స్ఫూర్తిగా నిలిచారు.

అస్తమయం
న్యూమోనియాకు చికిత్స పొందుతూ, కొంత సహజమయిన వృద్దాప్యం వలన జూన్ 26, 2008 గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు భారత్‌కు ఎన్నో విజయాలను అందించిన యుద్ధ సేనాని జీవితంలో అలసిపోయి శాశ్వతంగా చుట్టూ ఉన్న కుటుంభ సభ్యుల మధ్య ప్రశాంతంగా ఈ లోకాన్ని వీడారు. గొప్ప యోధుడిగానే 94 ఏళ్ల పరిపూర్ణ జీవనం సంతోషంగా గడిపారు.

25, జూన్ 2016, శనివారం

మైకేల్ జాక్సన్ స్మృతి లో...

మైకేల్ జాక్సన్ స్మృతిలో(Michael Jackson)
సెలబ్రీటీ అనే పదానికి స్వచ్చమైన అచ్చమైన నిలువెత్తు ఉదాహరణ మైకేల్ జాక్సన్.
ఆయనని మించిన సేలబ్రిటీ లేరు.
ఆయనను మించిన లెజెండ్ లేరు. ౅౅
౅౅౅ఒక వ్యక్తికి అత్యంత భాద, భయం లేదా సంతోషం కలిగినప్పుడు faint అవుతాడు. faint అయేంత బాధ,భయం కలగడానికి కారణాలెన్నో కానీ, ఈ సృ౤౤ష్టిలో ఒక మనిషికి faint అయేంత సంతోషం కలిగించగలిగేది ఒక్క జాక్సన్ మాత్రమే.
ఆటకైనా పాటకైనా ఈ భూప్రపంచంలో ఆయనని మించినవారు లేరు. తన performance తో వీక్షకులకు అత్యంత ఉత్కృ౤౤ష్టమైన సంతోషాన్ని ఒక్క Michael Jackson మాత్రమే కలిగించగలరు.ఆయన జీవితంలో ఆయన చుట్టూ కమ్ముకున్న వివాదాల్ని పసిపాపను పిచ్చికుక్క కరవడంతో పోల్చవచ్చు. ఆయన ఇజం హ్యూమనిజం (Humanism). ఆయన పరిపూర్ణ మానవతా వాది. క్యాన్సర్ (cancer) తో బాధ పడుతున్న ఒక పిల్లవాడిని తల్లిదండ్రుల దగ్గరనుండి తీసుకుని, స్వంత తల్లిదండ్రులకంటే ఎక్కవ ప్రేమనివ్వగలిగిన మనసాయనది. ఆపిల్లవాడిని తన ఇంటికి తీసుకెళ్ళి ఆన్ని తానై సపర్యలు చేసి బాలుడి చివరి రోజుల్లోఅత్యంత సంతోషంతో గడిపేంత ప్రేమనిచ్చారు. ఆఫ్రికాలో మురికివాడల్లో నివసించే నిరుపేదల గూర్చి, ఆకలి చావుల గూర్చి ఆయన ఎంతో మదన పడేవారు. అందుకే కోట్ల కోద్ది దనాన్ని ఖర్చుచేసారు. ఆయన వీడియోలు చూసిMichael Jackson లేని ప్రపంచాన్ని ఊహించుకోలేని పోయేవారెందరో. ఆయనకీ మరణం ఉంటుందని నమ్మని వాళ్ళలో నేనుఒకన్ని.ఇలాంటి వారు మిలీనియంకి ఒకరు పుడతారట. ఇంతటి ప్రజాభిమానం సంపాదించిన వ్యక్తి మరొకరు పుడతారా౤? ఆయన చనిపోలేదు, లండన్ పర్యటన రోజు ప్రత్యక్షం అవుతారని కొన్ని పత్రికలు రాసా౤యి. ఆదే నిజం అవాలని ఆశిస్తూ......

మైకల్ జోసెఫ్ జాక్సన్ (ఆగష్టు 29,1958 - జూన్ 25, 2009) అమెరికా కు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం "త్రిల్లర్" (Thriller) జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచం లో ఒక భాగంగా ఉన్నాడు. 1970 ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్ల జాతి సంగీత కళాకారుడు జాక్సన్.

జాక్సన్ మొత్తం 13 గ్రామీ అవార్డు లు గెలుచుకున్నాడు. 8 ఒకే రాత్రి 1984 లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో నంబర్ 1 గా నిలిచాయి. ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా. జాక్సన్ US$ 300మిలియన్ల దానధర్మాలు చేసాడు.

కాని జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది. 1990 నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు. 1988 నుండి 2005 వరకు జాక్సన్ తన నెవెర్‌లాండ్ రాంచ్ లో ఉన్నాడు. అక్కడ ఒక జూ మరియు అమ్యూజ్‌మెంట్ పార్క్ కట్టించాడు. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించేవాడు. 11 ఫిబ్రవరి 2008 నాడు జాక్సన్ త్రిల్లర్ 25 అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు.

బాల్యం

జాక్సన్ వాళ్ళ నాన్న, జోసెఫ్ జాక్సన్, ఒక స్టీల్ మిల్లు లో పనిచేసేవాడు. జాక్సన్ వాళ్ళ అమ్మ పేరు క్యాథరీన్ జాక్సన్. జాక్సన్ చిన్న తనము లో తన తండ్రి వల్ల ఎన్నో బాధలు అనుభవించాడు. తనను తన తండ్రి మానసికముగ మరియు శారీరకముగా హింసించే వాడని జాక్సన్ పేర్కొన్నాడు. జాక్సన్ తన చిన్నప్పటి బాధలను గురించి మొదటి సారిగా ఫిబ్రవరి 10,1993 ఒప్రా విన్ ఫ్రీ లో మాట్లాడాడు. తను చిన్న తనములో ఒంటరి తనము వల్ల ఎంతో ఏడ్చేవాడనని చెప్పాడు.

కుటుంబం

రెబ్బి (సోదరి)జాకి (సోదరుడు)టిటొ (సోదరుడు)జర్మైని (సోదరుడు)ల టొయ (సోదరి)మార్లొన్ (సోదరుడు)రేన్డి (సోదరుడు)జనెట్ (సోదరి)


21, జూన్ 2016, మంగళవారం

నేడు మాకియవెలి వర్ధంతి

నేడు మాకియవెలి వర్ధంతి
నికోలో డి బెర్నార్డో డెయి మాకియవెలి (ఆంగ్లం :Niccolò di Bernardo dei Machiavelli)
(మే 3 1469 – జూన్ 21 1527) ఒక తత్వవేత్త, రచయిత మరియు ఇటలీకి చెందిన రాజకీయవేత్త.
ఇతను రాజనీతి శాస్త్ర స్థాపకుడుగా గణింపబడతాడు. ఒక సాంస్కృతిక పునరుజ్జీవన మనిషి గా, ఒక డిప్లమాట్, రాజనీతి తత్వవేత్త, సంగీతకారుడు, కవి, మరియు డ్రామా రచయిత, కానీ, ప్రధమంగా, ఫ్లోరెంటైన్ రిపబ్లిక్ కు చెందిన ప్రజా సేవకకుడు పాశ్చాత్య తత్వవేత్తలు సాంస్కృతిక పునరుజ్జీవన తత్వం, పేరు: ...
లియోనార్డో లాగా, సాంస్కృతిక పునరుజ్జీవన యుగకర్తగా అభివర్ణింపబడతాడు. ఇతను తన రాజకీయ గ్రంథమైనద ప్రిన్స్ వల్ల ఎక్కువ ప్రసిద్ధిచెందాడు.
ఇతడు రాజనీతిజ్ఞుడే గాక ఒక సాంస్కృతిక పునరుజ్జీవన మనిషి. మాకియవెలీ అనేక సాంప్రదాయిక రచనలను అనువాదాలు చేశాడు.
ఇతనొక డ్రమటర్జ్ (dramaturge), ఒక కవి మరియు నవలాకారుడు..

ప్రపంచ సంగీత దినోత్సవం

ప్రపంచ సంగీత దినోత్సవం (World Music Day) ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపుకుంటారు. ఇది మొదటిసారిగాఫ్రాన్స్ లో 1982లో ప్రారంభించబడినది. ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా ఫ్రాన్స్ లో 1982లో ప్రారంభించబడినది.

సంగీతం

సంగీతం - ఒక అద్భుతం! సృష్టిలో దాని స్థానం అద్వితీయం. మనుషులేం ఖర్మ? దేవతలు సైతం సంగీతాన్ని వదలలేకపోతుంటారు. ఒక్కోసారి వేణువు, ఒక్కోసారి డమరుకం సాయంతో సంగీత సాధన జరిగిపోతూ ఉండేది. అందువల్లే కాబోలు, చదువుల తల్లి 'సరస్వతీ దేవి'కి కూడా ఓ చేతిలో పుస్తకం వుంటే - మరో చేతిలో వీణ అలంకరించింది. సంగీతంలో కావాల్సిన వారికి శక్తి, రక్తి, భక్తి దొరుకుతుంది. విశ్వజనీనంగా మాడ్లాడే శక్తి కేవలం 'సంగీతానికే వుందన్నది నిర్వివాదాంశం! సంగీతం మానవుల సర్వసామాన్య భాష! ప్రపంచంలో ఎలాంటి ఎల్లలూ లేకుండా స్వైర విహారం చేసేది సంగీతమే!

రాతియుగం నుంచి కంప్యూటర్‌ యుగం దాకా సంగీతం స్వేచ్ఛగా రాజ్యమేలుతున్నది - అనే సత్యాన్ని గుర్తించాలి . రాతి యుగంలో...

అసలు గుడ్డలూ, స్టైల్లూ, ఫ్యాషన్లూ లేని పాషాణయుగం. మనిషి డ్యూటీ 'వేట'. కడుపు నింపడం. రాయితో రాయి ఢకొీన్నప్పటి 'ఠక... ఠక' , రాయి నీటిలో పడ్డప్పటి 'బుడుంగ్‌', జంగల్‌లో మంగల్‌ చేసే సెలయేటి గలగలలు, చెట్ల ఆకుల గరగరలు, నీలాకాశంలో రివ్వున ఎగిరిపోయే పక్షుల కిలకిలా రావాలు, పాపాయి నోటి 'ఉంగ్వాఁఁ ఉంగ్వాఁఁ' ల తొలి రాగాల్లో సంగీతాన్ని గమనించారు. పాషాణ యుగంలోని మన పూర్వజులు.

క్రీ.పూ 5000-6000 వైదిక కాలంగా భావిస్తే - మన నాలుగు వేదాలను సకల కళల 'గంగోత్రి'గా భావించక తప్పదు.

వేదాలు అపౌరుషేయాలు. ముఖోద్గతం చేసి ఇంకొక తరానికి అందించబడ్డాయి.

వేదాల్లో 'రుచ'లు. సంగ్రహం సామవేదం. అన్నీ గేయ స్వరూపాలే!

మధ్యయుగంలో...

మధ్య యుగంలో (క్రీ.శ. 800 - 1800) రాగ సంగీతం మొగ్గలేసింది. ఆ తర్వాత సంగీతంలో 'ఖయాల్‌ గానం'... 'వాద్యగానం' ప్రజాదరణ పొందసాగాయి. ఖైబరు కనుమల నుండి జోరుగా మొగలాయీ దండయాత్రలు సాగాయి. వారి వెంట కత్తులూ, కఠార్లతో పాటు 'యుద్ధ పిపాస' ఏమాత్రం లేని అరబ్బీ, ఫారసీ, ఇరానీ సంగీతం కూడా వచ్చింది మనదేశంలోకి.

తన చుట్టూ ఎల్లల వలయాలు సృష్టించుకోలేని, సంగీతం మెల్లమెల్లగా ఇక్కడి సంగీతంతో మమేకమైంది.

'కవ్వాలి' అలా అక్కణ్ణించే వచ్చి నేడు సినిమా తెరమీదా, మన సమాజంలోనూ విడదీయలేని భాగమైపోయింది. నేటికీ 'ఉర్స్‌' ఉన్నచోట 'కవ్వాలి' ఉండాల్సిందే! సారంగీ, సరోద్‌ - చంగ్‌ షV్‌ానాయీ - బర్‌బత్‌ - రబాబ్‌ లూ అక్కడివే! హాయిగా ఇక్కడివైపోయి సన్నాయి నొక్కలు సాగిస్తూ నవ్వుకున్నాయి.

ముస్లిమ్‌ సంగీతం

ముస్లిమ్‌ సంగీతంలో ఆద్యుడు 'ఇబ్నే - ముసV్‌ా -హజ్‌'. ఇరాకలోేని 'అబ్బాసీ దర్బాల్‌'లోని అరబ్బీ, ఫారసీల సంగీతాన్ని కలుపుకుని 'ఇరానీ సంగీతం' రూపంలో ప్రపంచం నిండా వ్యాపించింది. ఇరానీ 'కవ్వాల్‌' సంగీతంలోని 'జంగులా' - 'జీఫ్‌' - 'షాహనా' - దర్బారీ' - 'జిలా' (ఖవజ్‌) మెల్లమెల్లగా మన సంగీతంలో కలిసిపోయాయి. 'అమీర్‌ ఖుస్రో' రెండు సంగీతాల మేళవాన్ని 'అందమైన సంగీత మిశ్రమం'లా తయారు చేశాడు. 'సితార్‌' నిర్మాణం ఆయనదే అని చెప్పుకుంటారు. ముస్లిమ్‌లది 'సూఫీ సాంప్రదాయ సంగీతం'. అంతా భక్తి సంగీతం అన్నమాట. మొహమ్మద్‌ తుగ్లకనుే మనం చరిత్ర చదివో చదవకో, 'పిచ్చి తుగ్లక' అని స్టాంప్‌ అంటించి దులుపుకున్నాం. కానీ, ఆయన దర్బార్‌ లోనూ సంగీతం పొంగి పొర్లింది. ఆ 'తుగ్లక'గారి దర్బారులో అలనాటి గొప్ప గాయకుడు 'అమీర్‌ షమ్స్‌ ఉద్దీన్‌ తబ్రేజీ ' ఉండేవాడు. అలానాటి 'దేవ్‌గఢ్‌' (నేటి 'ఔరంగాబాద్‌' సమీపానున్న 'దౌలతాబాద్‌' కోట) దగ్గర 'తరబాబాద్‌'అనే 'చౌపట్‌ బజార్‌' ఉండేది. పగలు మూడు గంటల్నుంచి తెల్లారే దాకా అక్కడ 'అరబీ - ఇరానీ - హిందూస్థానీ' సంగీతం ప్రముఖంగా ఉత్తర భారత దేశాలలో జోరందుకుంది. అలనాటి మధుర, అయోధ్య, బనారస్‌, లక్నో ప్రముఖమైన 'సంగీత క్షేత్రాలు'. షాజహాన్‌ కాలంలో సంగీతం మీద 'షమ్స్‌ - ఉల్‌ - అస్వాత్‌' అనే మొదటి గంథ్రం రాశారట. రెండో అక్బర్‌ కాలంలో 'మీర్జాఖాన్‌', సంస్కృత పండితుల సాయంతో 'తుహఫా - తుల్‌ - హింద్‌' అనే గొప్ప గ్రంథం రచించాడు. అందులో జ్యోతిష్యం, సాముద్రికం, కోకశాేస్త్రం, నాయికా భేదం, ఇంద్రజాలం వంటి విషయాలతో పాటు అలనాటి సంగీతం ముచ్చట్లున్నాయి.

భారతీయ సంగీతం

భారతీయ సంగీత శాస్త్రం గురించి ఫారసీలో నవాబ్‌ 'ఆసఫ్‌ - ఉద్దౌలా' శాసనకాలంలో రాసిన 'ఉసూల్‌ - ఉల్‌ - నగమాత్‌ - ఉల్‌ - ఆసిఫియా' గొప్ప గ్రంథం. ఇప్పుడు ఒకటో - రెండో ప్రతులు, అవీ ఏ మ్యూజియంలోనో ఉండొచ్చు. 'వాజిద్‌ అలీషాV్‌ా' జమానా వచ్చే సరికి లఖ్నోలోకదర్‌పియా రచించిన 'ఠుమ్రీ'లు గల్లీ గల్లీలోని 'ఆమ్‌ ఆద్మీ' కోసం పసందుగా నిలిచిపోయాయి. ధృపద్‌ - హోరీల కన్నా ఖమాజ్‌ - ఝింఝోటీ - భైరవీ - సునిద్రా - తిలక - కామోద్‌ - పీలూ లాంటి రాగాల స్వరాలు పాపులర్‌ అయిపోయాయి. సర్వసామాన్యులు కూడా 'ఠుమ్రీ'లు గున్‌గానాయించేవారు.

ఆ కాలంలో హిందూస్థానీ రాగ రాగినీలు, ముఖ్యంగా భైరవీ రాగం అక్షరాలా లఖ్నో 'తెల్ల ఖర్బూజా'లంత జనరంజకాలు. ఎంతో ప్రజాదరణ పొందాయి. పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే చాలు 'జులుష్‌' (ఊరేగింపు)లో 'ఢోల్‌ -తాషా', 'రౌషన్‌ చౌకీ', - 'నౌబత్‌' - 'తురహీ - కర్నా(శంఖం)' - 'ఢంకా-బిగుల్‌' - 'అంగ్రేజ్‌ ఆర్గన్‌' ఉండాల్సినవే. అలా, అలనాడు సంగీతం మామూలు మనిషి ఇంట్లో, ఒంట్లో సుతారంగా ఒదిగిపోయింది. అక్బర్‌ పాదుషా కాలంలో సంగీతం మూడు పువ్వులు- ఆరు కాయల్లా వెలిగిపోయింది. కొన్ని వెలుగులు 'రాగ్‌ - దీప్‌' తాలూకు మహానీయుడైన 'సంగీత్‌ సామ్రాట్‌ తాన్‌సేన్‌'వి. మనం కూడా మరిచిపోలేదు (చాలామంది రసికులకు 'బైజుబావరా' జ్ఞాపకం వుండొచ్చు ఇంకా). ఎటొచ్చీ - ఔరంగజేబు చూపుల్లో, మనసుల్లో సంగీతం లాంటి రమ్యతలు అంతగా పొసగలేదు. ఆయనకు నచ్చిందల్లా ఒక్కటే. గెలిచిన చోటల్లా 'నౌబత్‌'లను జోరుగా వాయించడం. మన హైదరాబాద్‌ 'నౌబత్‌ పహాడ్‌'మీది సంగీతం అలనాటి 'నగరాల మోతే'!

ఆధునిక సంగీతం

చూస్తూ చూస్తూ ఆధునిక కాలం వచ్చేసింది. వాద్యసంగీతం, లలిత సంగీతం కూడా మామూలు మనుషుల గుండెలకు చేరువైపోయాయి.

భరతుడి 'నాట్యశాస్త్రం', జయదేవుడి 'గీతాగోవిందం'ల చోటే ఠుమ్రీ, గజల్‌, అభంగ్‌, భజన గీతాలు పాపులర్‌ అయిపోయాయి.

ఆత్మ పల్లవించే పడవలా, వెచ్చని పాటలతో, వెండి అలలపై నిద్రిస్తున్న రాజహంసలా అలనాటి సినిమా సంగీతం - ఆ తర్వాత నేటి రణగొణ ధ్వనులతో నిండిన, గల్లీ గల్లీలో సునామీలా దద్దరిల్లే లొల్లి సంగీతం వచ్చింది.

షహ్నాయి, సంతూర్‌, వేణువు, వయోలిన్‌, సితార్‌ ల అద్భుత లయలతో పాటు సింఫొనీ, సొనటా, కన్సర్ట్‌, క్యార్టెట్‌, ర్యాంప్‌, బీటల్స్‌ కూడా వచ్చాయి.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...