18, ఏప్రిల్ 2016, సోమవారం

ప్రపంచ వారసత్వ దినోత్సవం

ప్ర‌పంచ వార‌స‌త్వ దినోత్స‌వం సంద‌ర్భంగా...........
చ‌రిత్ర చాలా గొప్ప‌ది.
చ‌రిత్ర పుట‌ల్లో ఎన్నో అద్భుతాలు దాగిఉన్నాయి. 
వాటిని చూస్తూ మ‌నం నేర్చుకోవాల్సిన విష‌యాలు ఎన్నో ఉన్నాయి.
ప్ర‌తీ ఏడాది ఏప్రిల్ 18న ప్ర‌పంచ వార‌స‌త్వ‌దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు. 
ప్రజల్లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల పట్ల అవగాహన మరియు వాటి సంరక్షణ ఆవశ్యకతను తెలియ‌జేయ‌డం కోసం యునెస్కో ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.
ఈ రోజున అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వారసత్వ సంపద ప్రాధాన్యతను తెలియజేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
1972లో ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పాటిస్తారు. 
పురాతన కట్టడాలు, స్థలాలు గురించి అధ్యయనం చేయడం వాటి పరిరక్షణ విషయంలో సభ్యదేశాలు పరస్పరం సహకరించుకోవడం మొదలైన అంశాలు ఈ తీర్మానంలో ముఖ్యాంశాలు.
యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భారత్ నుండి 30 క‌ట్ట‌డాలు స్థానం సంపాదించుకున్నాయి.
భార‌త్ లో వార‌స‌త్వ సంప‌ద ద‌క్కించుకున్న క‌ట్ట‌డాల్లో 24 క‌ట్ట‌డాలు నిర్మాణాత్మ‌కంగా ఉంటే... 
6 సహజసిద్ధమైన ప్రదేశాలు ఉన్నాయి.
12వ శతాబ్దపు ఓరుగల్లును అరుదైన వారసత్వ నగరంగా గుర్తింపు పొందడం విశేషం.
చరిత్రకు అరుదైన గుర్తింపు లభించింది.
ప్రపంచ పర్యాటక వారసత్వ నగరంగా వరంగల్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
ఘనమైన వారసత్వ సంపద, వేల ఏళ్ల నాటి చరిత్ర నగరాన్ని కీర్తి శిఖరాన నిలబెట్టాయి.
కాకతీయుల నాటి సామ్రాజ్య పాలనలో నెలకొల్పిన వైభవ తోరణాలు నేడు కళారూపాలుగా కనువిందు చేస్తున్నాయి.
రమణీయ శిల్పాల నృత్య వి లాసం, చారిత్రక కట్టడాల అపూర్వ వైభవం 
ఈ గుర్తింపున కు ప్రధాన కారణాలు
మన సంస్కృతిని, మన వారసత్వ సంపదను మనం పోగొట్టుకుంటే జాతి జీవచ్ఛవంగా మిగిలిపోతుంది.
అంతరించిపోతున్న మన మహోన్నత సంస్కృతిని పరిరక్షించుకోవడం ఎలా?

మన అపురూప సంస్కృతీ సంపదల సంరక్షణకు ప్రజల సహకారమూ చాలా అవసరం. మన సంస్కృతీ చిహ్నం ఏదైనా సరే రూపు చెడగొట్టకూడదు. తరతరాలుగా వస్తున్న కళా సంపదను పరిరక్షించుకోవడం మన కర్తవ్యం.
మానవనిర్మిత కట్టడాలు, రాజ ప్రాసాదాలు, ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన అపురూపమైన సుందర ప్రదేశాలు, శిల్పాలు, చిత్రలేఖనాలు, తాళపత్ర గ్రంథాలు, శిలా శాసనాలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారికి వారసత్వంగా సంక్రమించాయి.
వీటిని నిర్లక్ష్యం చేయడమంటే, జాతి తన చరిత్రను చెరుపుకోవడమే! అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక నిర్మాణాలు, పురావస్తు సంపద గుర్తింపునకు నోచక మరుగున పడివున్నాయి
చరిత్ర జ్ఞానం లేని ఆకతాయిల చేతుల్లో ఎన్నో దేవాలయాల మీది శిలాశాసనాలు, సున్నం రంగులు పూయబడి కప్పబడి పోతున్నాయి. దీని ఫలితంగా చరిత్రలో దాగిన నగ్న సత్యాలను వెలికి తీయుటకు అవకాశం లేకపోతున్నది. 
ఎన్నో ప్రాచీనమైన చారిత్రక దేవాలయాలు ప్రభుత్వ దేవాదాయ-ధర్మాదాయ శాఖ వారి అధీనంలో ఉన్నాయి. 
ప్రతి సంవత్సరం ఉత్సవాల పేరిట సున్నం, రంగులు అపురూపమైన శిల్పాలు, శాసనాలపై పూయబడుచున్నాయి. 
ఈ సంస్కృతీ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకుండడం విజ్ఞత అనిపించుకోదు.
ఎన్నో అమూల్య తాళపత్ర గ్రంథాలు పూజా మందిరాల్లో పురావస్తు ప్రదర్శన శాలల్లో వెలుగు చూడకుండా పాలిపోతున్నాయి.

ప్రభుత్వపరంగా మన పురావస్తు కేంద్ర రాష్ట్ర శాఖలు వీటి సంరక్షణకు కృషి చేస్తున్నాయి.
కానీ అది చాలదు. ప్రజల సహకారం కూడా ఉండాలి. ప్రాచీన తాళపత్ర గ్రంథాలను ప్రభుత్వ పరం చేయాలి; 
దేవాలయాల మీద శాసనాలను సున్నం, రంగులతో కప్పకూడదు; 
రాగి, శిలా శాసనాల అక్షర రూపాలను పాడుచేయకూడదు; 
త్రవ్వకాలలో దొరికిన నాణేలు ఇత్యాది వస్తుసముదాయాలను సొంత లబ్ధికి కరిగించకూడదు.
మన సం స్కృతీ చిహ్నం ఏదైనా సరే రూపు చెడగొట్టకూడదు.
తరతరాలుగా వస్తున్న మన కళా సంపదను పరిరక్షించుకోవడం మన కర్తవ్యం. మన సంస్కృతిని, మన వారసత్వ సంపదను మనం పోగొట్టుకుంటే యావత్‌ జాతి జీవచ్ఛంగా మిగిలిపోతుంది.
విదేశాలలో మనకున్న కీర్తి మన సంస్కృతిని పురస్కరించుకొని పుట్టిందే! 
ఎన్నో శతాబ్దాల సంస్కృతీ సంపదకు వారసులుగా భారతీయులమైన మనం గర్వంగా నిలబడదాం.
దీనికి ప్రభుత్వ సహకారం, ప్రజల సహకారం ఎంతైనా అవసరం అని గుర్తించాలి. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో మన సంస్కృతీ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించి మెలగుదాం.
వాటిని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ప్ర‌తీ ఒక్క‌రిపై ఉంది.
‪#‎Heritageday‬
‪#‎History‬
‪#‎AAP‬మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...