15, ఏప్రిల్ 2016, శుక్రవారం

కాకతీయుల నీటి పారుదల విధానం

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా...
కాకతీయుల నీటి పారుదల విధానం గురించి
కాకతీయులు వర్షపు నీటిని వృధా కాకుండా నిల్వ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కాకతీయులు కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఒక చెరువు నిండి అదనంగా వచ్చిన నీటిని మరో చెరువులోకి మళ్లించాలనే ఉద్దేశ్యంతో కాలువల నిర్మాణాన్ని చేపట్టారు. 
ఈ కాలువలు ఒక చెరువు నుంచి వేరొక చెరువును, ఆ చెరువు నుంచి మరో సరస్సును అనుసంధానం చేస్తూ నిర్మించారు.
అందుకే వీరి కాలం నాటి చెరువులను గొలుసు కట్ల చెరువులు అని పిలుస్తారుి. గొలుసు కట్టు చెరువులతో వీరు నీటిని నిల్వ చేసిన విధానమూ సిరులు పండించిన తీరు ఇప్పటి తరుణంలో ఆదర్శనీయం.
ప్రజలకు, ప్రభుత్వానికి వ్యవసాయం ముఖ్య ఆదాయ మార్గం.
కాబట్టి కాకతీయ రాజులు సేద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.
వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల సౌకర్యాలను కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తెలంగాణ ప్రాంతంలో కాకతీయ రాజులే కాక వారి సేనానులు, సామంతులు, ఉద్యోగులు, మతాచార్యులు, సంపన్నులు తటాకాలు నిర్మించడంపై అమిత శ్రద్ధ చూపారు.
ప్రకతి సిద్ధంగా వర్షపు రూపంలో వచ్చేనీటిని నిల్వ చేసుకునే లక్ష్యంలో కాకతీయుల కాలంలో అనేక నిర్మాణాలు జరిగాయి.
అయితే, జలాశయాల నిర్మాణాన్ని వర్తక వాణిజ్యం కోణంలోనే కాకతీయులు చూడలేదు. సప్త పుణ్యకార్యాల్లో ముఖ్య కార్యంగా, అశ్వమేధ యాగంతో సమానమైందిగా భావించారు.
కాకతీయ చక్రవర్తులు కల్పించిన నీటిపారుదల సౌకర్యాలను సరస్సులు, చెరువులు, కాలువలు, బావులు అని నాలుగు రకాలుగా విభజించవచ్చు. మొదటి ప్రోలరాజు నుంచి జలాశయాల నిర్మాణం ప్రారంభమైందని చెప్పవచ్చు.
ఇతడు కేసీయ సముద్రం నిర్మించినట్లుగణపతిదేవుడు వేయించిన మోటుపల్లి స్తంభశాసనం ద్వారా తెలుస్తోంది. రెండవ బేతరాజు అనుమకొండ పట్టణంలో శివపురం పేరుతో తోటను, చెరువును నిర్మించినట్లు మోటుపల్లి శాసనం తెలియజేస్తోంది. గణపతి దేవుడు నెల్లూరు, గంగాపురం, ఎల్లూరు, గణపపురం, ఏకశిలాపురిలలో అనేక చెరువులు నిర్మించినట్లు ప్రతాపరుద్ర చరిత్ర ద్వారా తెలుస్తోంది. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు తవ్వించిన అనేక చెరువుల వివరాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
కాకతీయులు పాలించిన తెలంగాణ ప్రాంతమంతా సముద్ర మట్టానికి వేలాది మీటర్ల ఎత్తులోఉంది. పైగా వర్షపాతం కూడా తక్కువ. ఎత్తయిన ప్రాంతం కావడం వల్ల వర్షాల ద్వారా వచ్చిన నీరు వథాగా పోయి నీటి సమస్య ఏర్పడేది. దీంతో వర్షపు నీటిని నిల్వ చేయాలన్న ఉద్దేశ్యంతో కాకతీయ చక్రవర్తులు చెరువుల నిర్మాణానికి పూనుకున్నారు. వర్షపాతం అధికంగా ఉండే అటవీ ప్రాంతంలో కొండలనే ఆనకట్టలుగా చేసుకొని భారీ జలాశయాలను నిర్మించారు. వాటి కింద మరో చెరువును, దాని కింద మరికొన్ని చెరువులు, కుంటలను నిర్మిస్తూ పోయారు.కాలువల ద్వారా వీటిని అనుసంధానించారు.
వర్షకాలంలో జలాశయాల్లోకి చేరిన నీరు వాటిని నింపిన తరువాత ఎక్కువైన నీటిని మత్తడి ద్వారా కింద ఉండే చెరువులు, కుంటల్లోకి పరుగులు తీసేలా చర్యలు తీసుకున్నారు.
సుమారు 20 వేల చెరువులను కాకతీయులు నిర్మించినట్లు పలువురు పరిశోధకులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 5 వేల చెరువులను మాత్రమే గుర్తించారు. కష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తరించిన కాకతీయ సామ్రాజ్యంలో నీటి ప్రవాహ దిశ, నిల్వ చేయడానికి అనువుగా ఉన్న పరిస్థితులను గుర్తించి జలాశయాలను నిర్మించారు. పాకాల, రామప్ప, లక్నవరం సరస్సులు కాకతీయులు నిర్మించిన గొప్ప జలాశయాలు.
‪#‎IRRIGATION‬
‪#‎KAKATIYAS‬
‪#‎AAP‬

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...