15, ఏప్రిల్ 2016, శుక్రవారం

Angadi veeranna temple , Bairanpally

అంగడి వీరన్న గుడి .బైరాన్ పల్లి గ్రామంలో, మద్దూరు మండలం, వరంగల్ జిల్లాలో ఉంది.
11 వ శతాబ్దానికి చెందిన ఈ జైన ఆలయాన్ని స్థానికులు అంగడి వీరన్న గుడిగా పిలుస్తారు.
తెలంగాణ రాష్ట్రం అనేక ఆలయాలకు పుట్టినిల్లు.
అందులో అనేక జైన ఆలయాలు కూడా ఉన్నాయి.
ఆ కోవలోకి చెందినదే ఈ అంగడి వీరన్న గుడి.ఒకప్పుడు ఈ ప్రాంతంలో జైన మతం వర్ధిల్లింది.
ఆలయం ముందున్న శాసనంలో రాయబడినదాని ప్రకారం కల్యాణి చాళుక్య రాజు అయిన త్రిభువన మల్ల దేవుడు (విక్రమాదిత్య VI ) వద్ద భువనగిరి ,
బెక్కల్ పరగణా లకు దండనాయకుడిగా పనిచేసే
బైరామరెడ్డి అనే వ్యక్తీ చాళుక్య విక్రముడి పేరు మీదుగా
సర్వాధి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి.
నాడు అనగా 1108 వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని కట్టించాడు.
దాంతో పాటు ఆలయ ధూప దీప నైవేద్య ల కోసం మామిడి తోటను , భూముల్ని దానం చేసాడు.
తూర్పు వైపు ముఖం ఉన్న ఈ ఆలయం
గర్భాలయం , అంతరాలయం, ముఖ మండపం , అర్ధ మండ పాలను కలిగి ఉంది.ఆలయ గర్భ గుడి ప్రవేశ ద్వారానికి రెండు వైపులా పూర్ణ కుంభాలు చెక్కబడి ఉన్నాయి.
ప్రస్తుతం ఈ ఆలయం రాష్ట్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.

అంగడి వీరన్న పేరును కొంచ విశదీకరిస్తే...ఇప్పటి వైశ్యులు జైనుల వారసులు...అంగడి అంటే కొట్టు/Shop... అంగడి వీరన్న జైనుడు అనటానికి,జైనులలో వర్తకం చేశారంటానికి ఇది ఒక చారిత్రిక ఆధారం.

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...