22, ఏప్రిల్ 2016, శుక్రవారం

ప్రపంచ ‘ధరిత్రి’ దినోత్సవం.

ఏప్రిల్ '22’ వ తేదీన ప్రపంచ ‘ధరిత్రి’ దినోత్సవం. 

1969వ సంవత్సరంలో అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలోని శాంటా బార్బరలో చమురు విస్పోటనం వల్ల జరిగిన విపరీతమైన నష్టాన్ని చూసిన తరువాత అమెరికా పార్లమెంట్ సభ్యుడు గేలార్డ్ నెల్సన్ (Gaylord Nelson) ఏప్రిల్22 వ తేదీని ధరిత్రి దినోత్సవంగా ప్రకటించారు.
తొలి ధరిత్రి దినోత్సవం United States Environmental Protection సంస్థ ఆవిర్భవానికీ, పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన గాలి, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ చట్టాల రూపకల్పనకూ దారి తీసింది.ప్రతి సంవత్సరం దాదాపు ఒక నూరుకోట్ల మంది జరుపుకునే అతి పెద్ద వేడుకలలో ఈ ధరిత్రి దినోత్సవం ఒకటి.
ఈ సంవత్సరం మనం జరుపుకునేది ’45’వ ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ఈ వారం మొత్తం, అలాగే ఏప్రిల్ 22వ తేదిన పర్యావరణ పరిరక్షణ పట్లసామాజిక స్పృహను, స్పందనను పెంపొందించేందుకు ప్రపంచంలోని భిన్న జాతుల వారు, భిన్న విశ్వాసాలకు చెందిన వారు, భిన్న నేపధ్యం కలిగిన వారు, అందరూ కలిసి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉత్సవాలు, ఊరేగింపులు, కార్యక్రమాలు నిర్వహిస్తారు.
#EARTHDAY
#AAP

21, ఏప్రిల్ 2016, గురువారం

BURIALS


అతిపెద్ద వలయాకారపు బండరాళ్లను చనిపోయిన వారి సమాధులపై ఉంచేవారు. 
చనిపోయిన మనిషిని రాతిపెట్టె బండల మధ్య ఉంచేవారు. 
ఈ రాతి పెట్టెలో మనిషి ఉపయోగించిన ఎరుపు-నలుపు చిత్రాలు, చాకులు, బల్లేలు, ఆభరణాలు ఉంచి పైన మరో రాతి పలకతో మూసేవారు.
పక్కన పేర్చిన రాతి పలకల్లో ఒక దానికి రంధ్రం చేశారు. ఇలా ఉంచడానికి కారణం.. 
బహుశా అతని ఆత్మ స్వేచ్ఛగా బయట తిరిగి, మళ్లీ లోపలికి వచ్చి శరీరంలో ప్రవేశిస్తుందనే నమ్మకం కావచ్చు.
ఈ పెట్టె వంటి నాలుగు పలకల రాతి బండను సిస్ట్ (జీట్ట) అంటారు. ఈ రాతి పేటికపై ఒక పెద్ద వలయాకారపు బండరాయిని పెడతారు. వీటినే రాక్షసగుళ్లు లేదా పాండవ గుళ్లు అని అంటారు. కొన్ని రాతి సమాధులపై మూడు టన్నుల బరువైన రాళ్లను కూడా పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి పనులు చేసేందుకు అవసరమైన దేహ దారుఢ్యం అప్పటి మనుషుల సొంతం!
బృహత్ శిలాయుగపు ఆనవాళ్లుదక్షిణ భారతదేశం మొత్తంమీద బృహత్ శిలాయుగపు వలయాకారపు బండరాళ్లు ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. 
ఇవి ముఖ్యంగా కొండలు, గుట్టల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి..
‪#‎burials‬
‪#‎AAP‬
‪#‎Warangalhistory‬
‪#‎makeheritagefun‬

ఉస్మానియా లో మొదటి బ్యాచ్ ఎల్ .ఎల్.బి చదువుతున్న విద్యార్థుల

నిజాం పరిపాలన కాలంలో హైదరాబాదులో స్థాపించిన కొన్ని కళాశాలలు రాజ కుటుంబీకులకు, సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో వుండేవి.
ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1913 లో తమ పాలనలో వున్న ప్రాంతాలలొనే గాక సంస్థానాలలో కూడ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని తీర్మానించింది.
ఆవిధంగా పాట్నా, బనారస్, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపించ బడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ 7వనిజాంఫత్ జంగ్ మీర్ఉస్మాన్ అలీ ఖాన్ఆసఫ్ జా VII చే1917లో స్థాపించబడింది.
ఇక్కడ ఉర్దూ ప్రథమ భాషగా మాద్యమంగా ప్రవేశ పెట్టి బ్యూరో ఆఫ్ ట్రాన్స్లేషన్ ను ఏర్పాటు చెసారు. మొదట గన్ ఫౌండ్రీ ప్రాంతంలో 25 మంది సిబ్బంది, 225 విద్యార్థులతో ఇంటర్మీడియట్ సాయంకాలం కోర్సులతో ప్రారంభించి క్రమంగా
1921 లో బి.ఏ,
1923 లో ఎం.ఎ.ఎల్.ఎల్.బి
1927 లో మెడిసిన్,
1929 లో ఇంజనీరింగు కోర్సులనూ ప్రవేశ పెట్టారు.
  Usmania‬    లో మొదటి బ్యాచ్ ఎల్ .ఎల్.బి చదువుతున్న విద్యార్థుల చిత్రం. 

CHERYAL PAINTINGS

ఆ కుంచె కథలను చెప్తుంది..
చరిత్రను చిత్రిస్తుంది.........
సాంస్కృతిక సంపదను వారసత్వంగా అందిస్తోంది
సంప్రదాయం, పురాణం, విశ్వాసాలు, ఊహల సమ్మేళనం ఆ చిత్రం.
ఆ చిత్ర కళ పేరు చేర్యాల పెయింటింగ్స్.
కాకతీయుల కాలంలో తెలంగాణలో పుట్టిన ఈ చేర్యాల్ పెయింటింగ్‌కు ఎంతో చరిత్ర ఉంది.
రంగుల నుంచి బ్రష్‌ల వరకు ఓ ప్రత్యేక శైలి. మొదట్లో ఇళ్లు, దేవాలయాల్లో గోడలకే పరిమితమైన ఈ కళ తర్వాత కేన్వాస్‌పైకి చేరింది. సహజసిద్ధమైన రంగులతో వేసే ఈ పెయింటింగ్స్ జానపద గాథలను తలపిస్తాయి.
1978లో ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డు చొరవ.. ఈ పెయింటింగ్స్‌కు దేశవిదేశాల్లో మంచి కీర్తి తెచ్చిపెట్టింది.
గతంలో మహాభారతం, భాగవతం, పురాణాలు, ఇతిహాసాల్లోని వాటినే కథలుగా చేర్యాల్ చిత్రాల్లో కనిపించేది.
గ్రామీణ ప్రాంతాల్లో కుల పురాణాలను చిత్రాల్లో పొందుపరిచి...
ఆయా కులస్తులకు కథలుగా చెప్పేవాళ్లు.
ప్రకృతిసిద్ధమైన రంగులుఈ పెయింటింగ్స్‌లో వాడే రంగులన్నీ కొన్ని రకాల రాళ్ల పొడి, దీపానికి పట్టే మసి, శంకు పొడి,కూరగాయల నుంచి తయారు చేసిన సహజ సిద్ధమైనవే.
ఇందుకు ఉపయోగించే పెద్ద బ్రష్షులను మేక వెంట్రుకలతో తయారు చేస్తారు.
అతి క్లిష్టమైన లైనింగ్ కోసం ఉపయోగించే చిన్న కుంచెలను ఉడుత తోక వెంట్రుకలతో తయారు చేస్తారు.
గంజి, సుద్దమట్టి, బంక లిక్విడ్‌లా తయారు చేసి ఒక తెల్లటిఖాదీ బట్టపై కోటింగ్ వేసి గట్టిపడేలా చేస్తారు.
అటు తర్వాత ఆ క్లాత్‌పై డ్రాయింగ్ వేసి రంగులను అద్దుతారు.
ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న ఈ పెయింటింగ్స్‌కు దేశవిదేశాల్లో ఎంతో ఆదరణ ఉంది.
ఒకప్పుడు వరంగల్ జిల్లాలోని చేర్యాల్‌లోని ఎన్నో కుటుంబాలు పోషించిన ఈ పెయింటింగ్ వారి పొట్టనింపలేదు. ఇప్పుడు నాలుగు కుటుంబాలకే పరిమితమైంది.
.సహజమైన రంగులు :
మొదట ఖాదీ కాన్వాస్‌ను పెయింటింగ్‌కోసం సిద్ధం చేసుకుంటారు.
సహజంగా తయారు చేసిన రంగులను ఉపయోగించి పెయింటింగ్స్‌ వేస్తారు.
ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగించే రంగురాళ్లను కొనుగోలు చేసి...
వాటిని నూరుకొని రంగులు తయారు చేసుకుంటారు.
కాలంతోపాటు మారుతూ...
ఇప్పుడు కృష్ణలీల, రామాయణ, మహాభారతాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.
కృష్ణుడి పటాలనుఇళ్లలో ఇంటీరియర్‌ డెకరేషన్‌కోసం వాడుతున్నారు.
నగరాల్లో పెరుగుతున్న ఇప్పటి తరానికి గ్రామీణ వాతావరణం గురించి తెలియడం లేదు.
అందుకే కులవృత్తులు, వ్యవసాయం, గ్రామీణ వాతావరణం, గంగిరెద్దులు, హరిదాసులు, బతుకమ్మ, బోనాలు, ముగ్గులు వంటి చిత్రపటాలకు డిమాండ్‌ ఎక్కువ ఉంటోంది. .

CHINTA NEKKONDA TEMPLE

చింత నెక్కొండ గ్రామంలోని కాకతీయుల కాలంనాటి శివాలయం ఇది.
గ్రామంలోని ఒకే విశాల ప్రాంగణంలో శివాలయం , రామాలయం ఉండటం ఇక్కడ ప్రత్యేకత..
ఆలయాల పక్కనే ఒక కోనేరు ఉంది...
వేసవి కాలంలో గ్రామంలో ని బోరు బావుల్లో నీరు లేనప్పటికీ ఇక్కడి కోనేరులో ఉండటం విశేషం
ఇందులో నీరు ఎప్పుడు కూడా ఎండిపొదు అని చెప్తారు.
ఆ కోనేరు పక్కనే ఆరు అడుగుల పొడవు ఉన్న లంబోదరుడి విగ్రహం ఇక్కడ గల మరో ఆకర్షణ.
శివాలయం ఎదురుగా వినాయకుడి విగ్రహం పక్కనే 4 స్తంభాల తో నిర్మించబడిన నంది మండపం ఉంది.
శివాలయం మొత్తం 20 స్తంభాలతో నిర్మించబడింది.కాగా ప్రస్తుతం 14 స్తంభాలు మాత్రమే ఉన్నాయి..
ఆలయానికి రెండు వైపులా ప్రవేశద్వారాలున్నాయి..
ఆలయంలోని స్తంభాలకు చామరదారి శిల్పాలు చెక్కబడ్డాయి.
గర్భాలయం లో శివలింగం యొక్క పానవట్టం మూడు అంచెలలో చెక్కబడింది.
గర్భాలయానికి ముందుగల స్తంభాలపై ద్వారపాలక శిల్పాలున్నాయి.
ఆలయ ప్రాంగణంలో మరో శివలింగం యొక్క పానవట్టం ఉంది....
ఆలయం పక్కనే పూర్వం గండ దీపం పెట్టడానికి
ఉపయోగించిన దీప స్తంభం ఉంది.
రామాలయము సమీపంలో ధ్వజ స్తంభం పడి ఉంది.
ఇక్కడ ప్రస్తుతం పూజలు జరగడం లేదు.
ధూప దీప నైవేద్యాలు జరిగినప్పుడు గ్రామం నుండే కాకుండా పక్క గ్రామాలనుండి కూడా భక్తులు వచ్చేవారంట.
గతంలో దేవాదాయ శాఖ నిధులు మంజూరు చేయగా ఆ నిధులతో ఆలయ మాన్యం భూముల రక్షణార్థం చుట్టూ ఇనుప కంచె వేశారు. ప్రస్తుతం ఆ కంచె ఆనవాళ్లు కూడా లేవు...
పర్యవేక్షణ లేకపోవడం వలన
ఆలయం విమాన శిఖరం పైన చెట్లు పెరుగుతున్నాయి...
దీంతో ఆలయం బలహీనం అవుతుంది..
అంతేగాక ఆలయానికి సంబంధించిన భూములు కబ్జాకి గురవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు...
కాబట్టి సంబంధిత శాఖ ల అధికారులు తక్షణమే స్పందించి ఆలయాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‪#‎AAP‬
‪#‎CHINTANEKKONDA‬
‪#‎HISTORY‬
‪#‎HERITAGE‬
‪#‎MAKEHERITAGEFUN‬
‪#‎KAKATIYATEMPLE‬
Chintha Nekkonda, Telangana 506369

TEEGARAJUPALLY TEMPLES

తీగరాజు పల్లి గ్రామం పక్కనే ఉన్న చెరువు వద్ద , SRSP కాలువ పక్కనే ఉన్న ఆలయాలు ఇవి....
ఇందులో ఒకటి శివాలయం కాగా , మరొకటి విష్ణువు ఆలయం .
ఈ రెండు చాళుక్యుల కాలం నాటివే ..
శివాలయం మొదటగా ఒక జైన ఆలయం అనడానికి సాక్షంగా గర్భాలయం పక్కన పూర్ణ కళశాలు చెక్కబడి ఉన్నాయి .
జైన ఆలయం శివాలయం గా మార్చబడిన తర్వాత గర్భాలయం కి అనుసంధానం గా అంతరాలయం నిర్మించబడింది.
గర్భాలయం ద్వారం పక్కన శైవ ద్వారపాలకుల శిల్పాలు
చెక్కబడ్డాయి.వారి చేతులలో త్రిశూలం , డమరుకం ఉన్నాయి.
ఆలయ పైన విమాన గోపురం ఇటుకల చేత నిర్మించబడింది.ఆలయం ఉన్న ఎత్తు కంటే 3 రెట్లు ఆలయ గోపురం ఉంది ..
శివాలయం పక్కనే ఉన్న మరొక ఆలయం విష్షు ఆలయం ..
ఆలయం లోపల ఎటువంటి విగ్రహం లేదు.
ఆలయ ద్వారం వద్ద చెక్కిన ద్వార పాలకుల ఆధారంగా అది విష్ణు ఆలయం అని చెప్పవచ్చు.
ఈ రెండు ఆలయాల పక్కనే ఒక
గరుత్మంతుడి శిల్పం, హనుమంతుడి విగ్రహం ఉన్నాయి..హరి-హర అన్న concept బాదామి చాళుక్యులతోనే మొదలైంది... శైవం నుంచి వైష్ణం తిరిగ్ శవం ఇలా 3,4సార్లు శాఖలు మారారు..చివరికి హరిహరలు ఇద్దరు ఒక్కరే అనే కోణంలొ హరిహరంలను ఏక విగ్రహంగా కొంత కాల కొలిచారు.శివ,విష్ణు గుడులు పక్క పక్కా వుండటం ఆప్రాంతంలో చాళుక్య పాలన జరిగిందనటానికి ఆధారం.
ఇంతకు మునుపే ఆలయాలలో గుప్త నిధుల కోసం తవ్వినట్టు ఆనవాళ్లు కనపడుతున్నాయి...
ఇక్కడో పెద్ద నంది విగ్రహం ఉండేదట.దానిని గ్రామస్తులు తీసుకుని వెళ్లి గ్రామం లోని ఆలయం లో పెట్టారని చెప్పారు..

19, ఏప్రిల్ 2016, మంగళవారం

మహావీర్ జయంతి

ఏప్రిల్ 20 మహావీర్ జయంతి
జైన సంప్రదాయానికి మూలమైన సిద్ధాంతాన్ని ఆత్మవాదమని అనేకాంత వాదమని అంటారు. బాహ్యాభ్యంతరాలైన (అంటే బయటవీ, లోపలివీ) వికారాలను... అంటే క్రోధం, కామం, ఈర్ష్య, అసూయ మొదలైన వాటిని జయించినవానికి జిన, జినుడు అని పేరు. ‘జినుడు’ అన్నమాట నుంచి వచ్చిన పదం జైనం. జినుడు అంటే జయించినవాడు అని అర్థం. జినుడు అయిన వ్యక్తి స్థాపించిన మతం కనుక దీనిని జైన సంప్రదాయం అంటారు. ఈ సంప్రదాయంలో 24 తీర్థంకరులు ఉన్నారు.

తీర్థంకరులంటే పూర్ణ పురుషులు. జీవన ప్రవాహాన్ని దాటడానికి వారధి నిర్మించినవారు.  ఇరవై నాలుగవ మరియు ఆఖరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. మహావీరుడు బీహార్‌లోని వైశాలీ నగరం సమీపంలోని కుందల్పూర్‌లో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు కాశ్యప గోత్రానికి చెందిన క్షత్రియుడు. తల్లి... వజ్జీ రాజ్యాధిపతి, ఇక్ష్వాకు వంశ క్షత్రియుడైన చేతకుని కుమార్తె ప్రియకరణి లేక త్రిశల. బాల్యం నుంచీ రాజకుమారునిగా సకల సౌఖ్యాలూ అందుబాటులో ఉన్నప్పటికీ నిర్లిప్తుడుగా ఉండేవాడు మహావీరుడు.

శ్వేతాంబర సంప్రదాయానికి చెందిన అచరంగ సూత్ర అనే గ్రంథం ద్వితీయ అధ్యాయంలో వర్ధమానుని తల్లిదండ్రులు పార్శ్వనాథుని భక్తులని ఉంటుంది. వర్ధమానుని వివాహ విషయంలో శ్వేతాంబర, దిగంబర సంప్రదాయాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని అనుసరించి వర్ధమానుడు వివాహం చేసుకోకుండానే ఉండిపోయాడని దిగంబర సంప్రదాయం చెబుతుంటే శ్వేతాంబర సంప్రదాయానుసారం వర్ధమానునికి వివాహం అయ్యింది. భార్య పేరు యశోద. వీరికి ‘ప్రియదర్శి’ అనే పుత్రిక ఉండేది.

వర్ధమానుని మేనల్లుడు జామాలిని వివాహమాడింది. పాఠశాల, అధ్యాపకుల అవసరం తనకు లేదన్న వివేకాన్ని వర్ధమానుడు మనసులోనే నెల కొల్పుకున్నాడు. మహావీరుని అసలు పేరు వర్ధ మానుడు. జ్ఞానోదయమైన తరువాత ‘మహా వీరుడు’ అని పేరు పొందాడు. ఈ సార్థకనామం అతనికి ఎలా వచ్చిందనేందుకు ఒక కథ ఉంది. ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఆటలాడు తున్నప్పుడు, ఒక నల్లని పాము పడగ పైన తన పాదం మోపి దాన్ని అణచివేశాడు. ఈ విధంగా మోహం అనే సర్పాన్ని అణచటం జరిగింది.

బుద్ధునిలాగే మహావీరుడు కూడా ప్రపంచ పరిత్యాగం చేయాలనే ఆశతో కొట్టుమిట్టాడాడు. కుటుంబంతో కలిసి 28 ఏళ్ల వయసు వరకు గడి పాడు. ఆ సమయంలోనే అతని తల్లిదండ్రులు కాలధర్మం చెందారు. ఇక తాను సర్వసంగ పరి త్యాగం చేయాలని, యోగ్యమైన, ఉపయోగకరమైన కార్యం నెరవేర్చాలని భావించాడు. సంపదను పేదలకు పంచాడు. కుటుంబాన్ని విడనాడిన రోజే రాజ్యాన్ని సోదరునికప్పగించాడు. అప్పుడు ముప్పది ఏళ్ల వయసులో ఉన్నాడు. తపస్సు, ప్రార్థనలతో నిండిన జీవితంలోకి ప్రవేశించాడు.

గృహస్థ జీవితాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలి గోశాలుడి వద్ద శిష్యునిగా ఉన్నాడు. ఆ తరువాత జృంబిక గ్రామం దగ్గర పన్నెండు సంవత్సరాల ధ్యానం, తపస్సుల తర్వాత మహావీరునికి వెలుగు కనిపించింది, ఆత్మ వివేకం (జ్ఞానం) కలిగింది. తీర్థంకరుడయ్యాడు. ఈ స్థితిని కైవల్యం అనీ ఈ స్థితిని పొందినవారిని కేవలి అనీ అంటారు.

తదనంతరం వర్ధమానుడు తన తత్వాన్ని ప్రచారం చేశాడు. ఆనందానికి సంతోషానికి సంబంధించిన తన గొప్ప శుభ సందేశాన్ని ప్రబోధించాడు. వర్ధమానుని బోధనల్లో ప్రధానమైనవి అహింస, సత్యం, అపరిగ్రహం, అస్తేయం, బ్రహ్మచర్యం. వీటిని పంచ వ్రతాలు అంటారు. బ్రహ్మచర్యం పాటిస్తూ హింస చేయకుండా, అబద్ధమాడకుండా, ఇతరుల ఆస్తిని కబళించకుండా, దొంగతనం చేయకుండా ఉండాలి. జైన మతానుసారం సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనే మోక్ష మార్గాలను త్రిరత్నాలంటారు.

వీటిని పాటిస్తూ పంచవ్రతాలతో జీవించేవారికి కైవల్యం లభిస్తుందని మహావీరుడు బోధించేవాడు. అవే జైనులకు మార్గదర్శకాలు. సన్యాసి అయినవాడు శాకాహారాన్ని తీసుకోవాలి. అహింసను తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ప్రాణికి, వస్తువుకి, నిర్జీవులు అయినవాటికి కూడా చైతన్యం వుంటుందని వాటికి గాయాలైతే అవి బాధపడతాయని అంటారు. చివరికి భూమిలో ఉండే వానపాములు చనిపోతాయని భూమినే దున్నొద్దు అంటారు. అందుకే చాలామంది జైనులు వ్యాపారాల్లో స్థిరపడ్డారు.

గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుని తిరుగుతారు. నీళ్లు వడకట్టుకుని తాగుతారు. అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాలి కింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన చీపురుతో నేలను ఊడుస్తారు. నేల కింద పండే దుంపలు,  ఉల్లి, వెల్లుల్లి, మసూర్ గింజలు వంటివి కూడా తినరు.
 తన సిద్ధాంతాలను ప్రబోధించేందుకు ఆయన ఒకచోటి నుండి మరోచోటికి నిరంతరమూ ప్రయాణం చేశాడు. ఎందరో అతణ్ని పరిహసించారు. సమావేశాలు జరుగు తున్నప్పుడు ఆయన్ని కలతబెట్టి బాధించేవారు, అవమానపర్చేవారు.

ఒక అడవిలో ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒక ముఠా మనుషులు అతణ్ని కొట్టారు కూడా. అయినా మౌనంగానే ఉన్నాడు. ఆయన మహావీరుడు. గొప్ప విజేత.
మహావీరునకు పదకొండు మంది ప్రధాన అనుచరులు, నాలుగువేలకు పైగా సన్యాసులు మరియు సామాన్యులు - మత ( విశ్వాసం ) కలవారు ఉండేవారు. బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులను కుడా చేర్చుకునేవారు. అతనికి " కులం " మీద నమ్మకం లేదు. 526 బి.సి.లో పావపురి ( బీహార్ )లో తన 72వ ఏట మహావీరుడు దీపావళి రోజున కాలధర్మ చెందాడు.
 ఆయన మోక్షాన్ని పొందిన చోట నేడు జలమందిరం పేరుతో జైన మందిరం ఉంది. దేశమంతా ఆయన పేరు మీద మహిళా విద్యాలయాలు, ఆసుపత్రులు, సంక్షేమ పథకాలు వెలిశాయి. ఆయన నిజంగానే వీరుడు. యుద్ధాల్లో గెలిచిన క్షత్రియ వీరుడు కాదు. సకల సౌకర్యాలనూ వదిలి సామాన్యునిగా జీవించిన వీరుడు. అరిషడ్వర్గాలనీ జయించిన వీరుడు. ప్రతి ఒక్కరి హృదయాలయంలో కొలువైన దేవుడు!

18, ఏప్రిల్ 2016, సోమవారం

ప్రపంచ వారసత్వ దినోత్సవం

ప్ర‌పంచ వార‌స‌త్వ దినోత్స‌వం సంద‌ర్భంగా...........
చ‌రిత్ర చాలా గొప్ప‌ది.
చ‌రిత్ర పుట‌ల్లో ఎన్నో అద్భుతాలు దాగిఉన్నాయి. 
వాటిని చూస్తూ మ‌నం నేర్చుకోవాల్సిన విష‌యాలు ఎన్నో ఉన్నాయి.
ప్ర‌తీ ఏడాది ఏప్రిల్ 18న ప్ర‌పంచ వార‌స‌త్వ‌దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు. 
ప్రజల్లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల పట్ల అవగాహన మరియు వాటి సంరక్షణ ఆవశ్యకతను తెలియ‌జేయ‌డం కోసం యునెస్కో ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.
ఈ రోజున అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి వారసత్వ సంపద ప్రాధాన్యతను తెలియజేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
1972లో ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పాటిస్తారు. 
పురాతన కట్టడాలు, స్థలాలు గురించి అధ్యయనం చేయడం వాటి పరిరక్షణ విషయంలో సభ్యదేశాలు పరస్పరం సహకరించుకోవడం మొదలైన అంశాలు ఈ తీర్మానంలో ముఖ్యాంశాలు.
యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో భారత్ నుండి 30 క‌ట్ట‌డాలు స్థానం సంపాదించుకున్నాయి.
భార‌త్ లో వార‌స‌త్వ సంప‌ద ద‌క్కించుకున్న క‌ట్ట‌డాల్లో 24 క‌ట్ట‌డాలు నిర్మాణాత్మ‌కంగా ఉంటే... 
6 సహజసిద్ధమైన ప్రదేశాలు ఉన్నాయి.
12వ శతాబ్దపు ఓరుగల్లును అరుదైన వారసత్వ నగరంగా గుర్తింపు పొందడం విశేషం.
చరిత్రకు అరుదైన గుర్తింపు లభించింది.
ప్రపంచ పర్యాటక వారసత్వ నగరంగా వరంగల్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
ఘనమైన వారసత్వ సంపద, వేల ఏళ్ల నాటి చరిత్ర నగరాన్ని కీర్తి శిఖరాన నిలబెట్టాయి.
కాకతీయుల నాటి సామ్రాజ్య పాలనలో నెలకొల్పిన వైభవ తోరణాలు నేడు కళారూపాలుగా కనువిందు చేస్తున్నాయి.
రమణీయ శిల్పాల నృత్య వి లాసం, చారిత్రక కట్టడాల అపూర్వ వైభవం 
ఈ గుర్తింపున కు ప్రధాన కారణాలు
మన సంస్కృతిని, మన వారసత్వ సంపదను మనం పోగొట్టుకుంటే జాతి జీవచ్ఛవంగా మిగిలిపోతుంది.
అంతరించిపోతున్న మన మహోన్నత సంస్కృతిని పరిరక్షించుకోవడం ఎలా?

మన అపురూప సంస్కృతీ సంపదల సంరక్షణకు ప్రజల సహకారమూ చాలా అవసరం. మన సంస్కృతీ చిహ్నం ఏదైనా సరే రూపు చెడగొట్టకూడదు. తరతరాలుగా వస్తున్న కళా సంపదను పరిరక్షించుకోవడం మన కర్తవ్యం.
మానవనిర్మిత కట్టడాలు, రాజ ప్రాసాదాలు, ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన అపురూపమైన సుందర ప్రదేశాలు, శిల్పాలు, చిత్రలేఖనాలు, తాళపత్ర గ్రంథాలు, శిలా శాసనాలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల వారికి వారసత్వంగా సంక్రమించాయి.
వీటిని నిర్లక్ష్యం చేయడమంటే, జాతి తన చరిత్రను చెరుపుకోవడమే! అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక నిర్మాణాలు, పురావస్తు సంపద గుర్తింపునకు నోచక మరుగున పడివున్నాయి
చరిత్ర జ్ఞానం లేని ఆకతాయిల చేతుల్లో ఎన్నో దేవాలయాల మీది శిలాశాసనాలు, సున్నం రంగులు పూయబడి కప్పబడి పోతున్నాయి. దీని ఫలితంగా చరిత్రలో దాగిన నగ్న సత్యాలను వెలికి తీయుటకు అవకాశం లేకపోతున్నది. 
ఎన్నో ప్రాచీనమైన చారిత్రక దేవాలయాలు ప్రభుత్వ దేవాదాయ-ధర్మాదాయ శాఖ వారి అధీనంలో ఉన్నాయి. 
ప్రతి సంవత్సరం ఉత్సవాల పేరిట సున్నం, రంగులు అపురూపమైన శిల్పాలు, శాసనాలపై పూయబడుచున్నాయి. 
ఈ సంస్కృతీ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకుండడం విజ్ఞత అనిపించుకోదు.
ఎన్నో అమూల్య తాళపత్ర గ్రంథాలు పూజా మందిరాల్లో పురావస్తు ప్రదర్శన శాలల్లో వెలుగు చూడకుండా పాలిపోతున్నాయి.

ప్రభుత్వపరంగా మన పురావస్తు కేంద్ర రాష్ట్ర శాఖలు వీటి సంరక్షణకు కృషి చేస్తున్నాయి.
కానీ అది చాలదు. ప్రజల సహకారం కూడా ఉండాలి. ప్రాచీన తాళపత్ర గ్రంథాలను ప్రభుత్వ పరం చేయాలి; 
దేవాలయాల మీద శాసనాలను సున్నం, రంగులతో కప్పకూడదు; 
రాగి, శిలా శాసనాల అక్షర రూపాలను పాడుచేయకూడదు; 
త్రవ్వకాలలో దొరికిన నాణేలు ఇత్యాది వస్తుసముదాయాలను సొంత లబ్ధికి కరిగించకూడదు.
మన సం స్కృతీ చిహ్నం ఏదైనా సరే రూపు చెడగొట్టకూడదు.
తరతరాలుగా వస్తున్న మన కళా సంపదను పరిరక్షించుకోవడం మన కర్తవ్యం. మన సంస్కృతిని, మన వారసత్వ సంపదను మనం పోగొట్టుకుంటే యావత్‌ జాతి జీవచ్ఛంగా మిగిలిపోతుంది.
విదేశాలలో మనకున్న కీర్తి మన సంస్కృతిని పురస్కరించుకొని పుట్టిందే! 
ఎన్నో శతాబ్దాల సంస్కృతీ సంపదకు వారసులుగా భారతీయులమైన మనం గర్వంగా నిలబడదాం.
దీనికి ప్రభుత్వ సహకారం, ప్రజల సహకారం ఎంతైనా అవసరం అని గుర్తించాలి. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో మన సంస్కృతీ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించి మెలగుదాం.
వాటిని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ప్ర‌తీ ఒక్క‌రిపై ఉంది.
‪#‎Heritageday‬
‪#‎History‬
‪#‎AAP‬15, ఏప్రిల్ 2016, శుక్రవారం

కాకతీయ కీర్తి తోరణాలు

* కాకతీయ కీర్తితోరణాలు
కాకతీయుల పేరు వినగానే ముందుగా మన మనోఫలకం మీద మెదిలేది కాకతీయ కీర్తితోరణం. ఇప్పటికీ వరంగల్ కోటలో నాలుగు కాకతీయ తోరణాలు సమానదూరాలలో విస్తరించి దర్శనమిస్తాయి. చూడ్డానికి ఓ అలంకారపు ద్వారంలా కనిపించినా అందులో తెలుసుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి.
కాకతీయ తోరణం కేవలం అలంకారం కోసం చేసిన డిజైన్‌ కాదు. దాని మీద కాకతీయుల పాలనా వైభవమంతా పూసగుచ్చినట్టుగా ఉంటుంది. వాళ్ల ఏలుబడిలో ఏయే అంశాలకు ప్రాధాన్యమిచ్చారో తెలియజేస్తుంది. నిలబడ్డ నాలుగు పిల్లర్లు వాళ్ల పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందనడానికి నిదర్శనం. చివరి రెండు పిల్లర్ల మీద ఇరుపక్కల గర్జించిన సింహాలు కాకతీయుల ఎదురులేని నాయకత్వానికి చిహ్నం. దాని పక్కన తల పైకెత్తిన మొసలి జలకళకు ప్రతీతి. ఎందుకంటే కాకతీయుల కాలంలో చెరువుల కుంటలు కాలువల్లో పుష్కలంగా నీళ్లుండేవి. నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మొసళ్లు మెండుగా ఉంటాయి. ఇకపోతే తోరణం నిండా లతలు, తీగలు పారే గొలుసుకట్టు చెరువుల్ని, కుంటల్నీ సూచిస్తాయి. అపార జలరాశి పరవళ్లు తొక్కడంతో ఆ కాలంలో పంటలు బాగా పండేవి. కాకతీయుల కాలంలో ప్రజలకు ఆకలి బాధ ఎలావుంటుందో తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే టాప్‌లో ఇరుపక్కల రెండు హంసలు కాకతీయుల పారదర్శక పాలనకు నిదర్శనం. హంస కింద ఇరుపక్కల చేతులు పైకెత్తిన కుబేరుల విగ్రహాలు ఆర్ధిక పరిపుష్టికి సంకేతం. మొసలి కింది భాగంలో వజ్ర వైఢూర్యాల దండలు కాకతీయుల వైభవానికి చిహ్నం. అప్పట్లో రత్నాలు రాశులుగా పోసి అమ్మకున్నా ఆర్ధికపురోగతి అద్భుతంగా ఉండేదని సంకేతం. కిందిభాగాన బోర్లించిన ఏడు పూర్ణకుంభాలు గ్రామదేవతల ప్రతిబింబాలు. వాటినే సప్తమాతృకలు అని కూడా పిలుస్తారు. పిల్లర్ మధ్యభాగంలో చేపల బొమ్మలు ఓ వెలుగు వెలిగిన మత్య్స పరిశ్రమకు సంకేతం.

మన తెలుగు సంవత్సరాలు


1 (1867,1927,1987) Prabhava ప్రభవ
2 (1868,1928,1988) Vibhava విభవ
3 (1869,1929,1989) Sukla శుక్ల
4 (1870,1930,1990) Pramoda ప్రమోద
5 (1871,1931,1991) Prajāpati ప్రజాపతి
6 (1872,1932,1992) Angīrasa అంగీరస
7 (1873,1933,1993) Srīmukha శ్రీముఖ
8 (1874,1934,1994) Bhāva భావ
9 (1875,1935,1995) Yuva యువ
10 (1876,1936,1996) Dhātri ధాత్రి
11 (1877,1937,1997) Īswara ఈశ్వర
12 (1878,1938,1998) Bahudhānya బహుధాన్య
13 (1879,1939,1999) Pramādhi ప్రమాధి
14 (1880,1940,2000) Vikrama విక్రమ
15 (1881,1941,2001) Vrisha వృష
16 (1882,1942,2002) Chitrabhānu చిత్రభాను
17 (1883,1943,2003) Svabhānu స్వభాను
18 (1884,1944,2004) Tārana తారణ
19 (1885,1945,2005) Pārthiva పార్థివ
20 (1886,1946,2006) Vyaya వ్యయ
21 (1887,1947,2007) Sarvajit సర్వజిత్
22 (1888,1948,2008) Sarvadhāri సర్వధారి
23 (1889,1949,2009) Virodhi విరోధి
24 (1890,1950,2010) Vikruti వికృతి
25 (1891,1951,2011) Khara ఖర
26 (1892,1952,2012) Nandana నందన
27 (1893,1953,2013) Vijaya విజయ
28 (1894,1954,2014) Jaya జయ
29 (1895,1955,2015) Manmatha మన్మథ
30 (1896,1956,2016) Durmukhi దుర్ముఖి
31 (1897,1957,2017) Hevalambi హేవళంబి
32 (1898,1958,2018) Vilambi విళంబి
33 (1899,1959,2019) Vikāri వికారి
34 (1900,1960,2020) Sārvari శార్వరి
35 (1901,1961,2021) Plava ప్లవ
36 (1902,1962,2022) Subhakrit శుభకృత్
37 (1903,1963,2023) Sobhakrit శోభకృత్
38 (1904,1964,2024) Krodhi క్రోధి
39 (1905,1965,2025) Viswāvasu విశ్వావసు
40 (1906,1966,2026) Parābhava పరాభవ
41 (1907,1967,2027) Plavanga ప్లవంగ
42 (1908,1968,2028) Kīlaka కీలక
43 (1909,1969,2029) Soumya సౌమ్య
44 (1910,1970,2030) Sādhārana సాధారణ
45 (1911,1971,2031) Virodhikrit విరోధికృత్
46 (1912,1972,2032) Paridhāvi పరిధావి
47 (1913,1973,2033) Pramādi ప్రమాది
48 (1914,1974,2034) Ānanda ఆనంద
49 (1915,1975,2035) Rakshasa రక్షస
50 (1916,1976,2036) Nala నల
51 (1917,1977,2037) Pingala పింగళ
52 (1918,1978,2038) Kālayukti కాళయుక్తి
53 (1919,1979,2039) Siddhārthi సిద్ధార్థి
54 (1920,1980,2040) Roudri రౌద్రి
55 (1921,1981,2041) Durmukhi దుర్ముఖి
56 (1922,1982,2042) Dundubhi దుందుభి
57 (1923,1983,2043) Rudhirodgāri రుధిరోద్గారి
58 (1924,1984,2044) Raktakshi రక్తక్షి
59 (1925,1985,2045) Krodhana క్రధన
60 (1926,1986,2046) Akshaya అక్షయ

సర్వరోగ నివారిని ప్రాణాయామం


తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు న్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం గురించి తెలుసుకుందాం.
1.ప్రాణాయామ విశేషాలు
ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది.
ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌’’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.
ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్‌ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.మెడికల్‌ సైన్స్‌ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు.
వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.
2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు
ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.
రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా
బయటికి వెళ్లి పోతుంది.
గుండెకు సత్తువ లభిస్తుంది.
మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
జఠరాగ్ని పెరుగుతుంది.
శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.
3. తీసుకోవలసిన జాగ్రత్తలు
మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని,
కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.
ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు.
అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.
నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి.
ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు
రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.
ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.
ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.

బహుముఖ ప్రజ్ఞాశాలి... లియోనార్డో డావిన్సీ .......
లియోనార్డో డావిన్సీ (Leonardo da Vinci) ఇటలీకి చెందిన ప్రముఖ శాస్తవేత్త, పెయింటర్, శిల్పి, రచయిత. ఇతను ఏప్రిల్ 15, 1452న జన్మించాడు. మే 2, 1519న మరణించాడు.
లియొనార్డో డావిన్సి జననం ఏప్రిల్ 15, 1452 – మరణం మే 2, 1519. ఇటలీ కు చెందిన ఒక శాస్త్రజ్ఞుడు, గణితజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు మరియు రచయిత.
ఇతడు చిత్రీకరించిన చిత్రాలలో ప్రసిద్ది చెందినది మొనాలిసా చిత్రం.
డావిన్సి తల్లిపేరు కాటెరిన్స్. 1469 లో ఈయన తండ్రి ష్లోలెంన్స్ కు వెళ్ళీపోయారు. ఈ కారణంగా డావిన్సి కొంతకాలం పాటు బాబాయి వరస అయ్యే వ్యక్తి దగ్గర ఉండేవాడు. 14 ఏళ్ళ వయస్సు నాటికే మోడలింగ్ లో డావిన్సి ఎంతో ప్రతిభ కనబరిచాడు. ఈయనను ఆండ్రియా డెల్ వెర్రాచివో శిల్పాచార్యునివద్ద చేర్చించాడు డావిన్సి తండ్రి.30 యేళ్ళ వరకు డావిన్సి ప్లోరెన్స్ లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు. కాని ఆర్జన మాత్రం యేమీ ఉండేది కాదు.
1482 లో డావిన్సి మిలాన్ రాజుకు తన గురించి తెలియ జెప్పుకున్నాడు. ఫలితంగా ఈయన మిలిటరీ ఇంజనీరింగ్ కాగలిగారు. ఎన్నో రకాల యుద్ధ పరికరాలను రూపొందించారు. రకరకాల ఆయుధాలను తయారు చేసాడు. ఈయన వీధులు,కాలవలు,చర్చిలు,గుర్రపు శాలలు, రాజ ప్రసాదారు- ఎలా ఉండాలో చెబుతూ వాటికి ప్లానులు వేసేవాడు. అంతేకాదు 1495 లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన "లాస్ట్ సప్పర్" చిత్రాన్ని మొదలుపెట్టి 1497 లో పూర్తి చేశాడు.
1499 లో డావిన్సి వెనిస్ నగరం చేరుకున్నాదు. అప్పుడు టర్కీతో యుద్ధం జరుగుతూ ఉండింది. ఆ యుద్ధ సమయంలో ప్రత్యర్థులను కొట్టడానికి కావలసిన సామాగ్రి గురించి, ఆత్మ రక్షణ కోసం ఉపయోగించవలసిన వస్తువుల గురించి, డావిన్సి ఎంతో విశదంగా తెలిపారు. కాని ఆయన ఆలోచనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ఆచరణలో పెట్టలేదు. ఖర్చు విషయం తప్పిస్తే ఈయన చెప్పినవాటికి ఏవీ సాటి రావని చెప్పవచ్చు.
డావిన్సి 1500 లో మళ్ళీ ఫ్లోరెన్స చేరుకున్నాడు. 1503 లో విశ్వ విఖ్యాతమైన "మొనాలిసా" పెయింటింగ్ మొదలుపెట్టాడు. ఈ పెయింటింగ్ పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. అంతవరకు ఆ మోడల్ గర్ల్ వస్తూ పోతూ ఉండేది. ఈ పెయింటింగ్ కు పూర్తి అయ్యాక ఆ చిత్ర్ం లోని అమ్మాయి నవ్వు అతి విచిత్రంగా ఉంది. డావిన్సి ని సైత కట్టి పడేసింది.ఈ నవ్వు మాయాజాలం లా పనిచేసి కోట్లాది మందిని ఆకర్షించగలిగింది.ప్రస్తుతం ఈ పెయింటింగ్. ఫ్రాన్స్ లోని లౌవ్రె మ్యూజియంలో ఉంది.
"మోనాలిసా" తో సుప్రసిద్ధుడయ్యాక డావిన్సి మిలాన్ చేరుకుని 1506-1513 మధ్య కాలంలో "ది వర్జిన్ విత్ చైల్డ్", "పెయింట్ ఆన్నె" వర్ణ చిత్రాలను లోక ప్రియంగా రూపొందించాడు. 1513 లో రోమ్ చేరుకున్నాక ఫ్రాన్సిస్ మహారాజు (మొదటివాడు) ప్రత్యేక అతిధిగా శేష జీవితం గడిపాడు.
ఎగిరే యంత్రాలను గురించి ఆలోచించి డావిన్సి ఎన్నో రకాల నమూనాలను తయారుచేసాడు. విమానాల వంటివి తయారుచేశాడు.మనిషి శరీరం గురించి పూర్తి వివరాలు తెలియజేశాడు. నీటి గడియారాన్ని అందించాడు.బరువైన వాటిని తేలికగా తొలగించే "క్రేన్" లను డావిన్సి ఆకాలం లోనే యేర్పాటు చేశాడు. 1519 లో మరణించాడు.

నటరాజ రామకృష్ణ

సాక్షాత్తు నటరాజ స్వరూపులు, అసేతు హిమాచలం గర్వించదగు మహా మనీషి, నాట్యలోకానికే నిలువెత్తు నిదర్శనం, యావత్త్ భారత జాతి గర్వించదగు గురుదేవులు భారతకళా ప్రపూర్ణ dr.
.
దాదాపు ఏడు వందల ఏళ్ళ క్రితం, ఓ వెలుగు వెలిగి) కనుమరుగై పోయిన "పేరిణి శివతాండవం " నృత్య సాంప్రధాయానికి జీవం పోశారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టారు.
ఆరు దశాబ్దాలపాటు అవిరల కృషి చేసి శోధించి సాధించిన ఓ కళాకారుడు, కళావేత్త, గురువు, సంగీతజ్ఞుడు, మేధావి, కళా దిగ్గజం పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ. ఆంధ్ర నృత్యానికి జీవితాన్ని అర్పించిన అభినవ యోగి.
నాట్యానికి ఓ కొత్త కళాపరిభాషనిచ్చిన కళా తపస్వి.
నటరాజ రామకృష్ణ గారి జన్మ దినం ఈరోజు
ఈ స్వయం చోదక కళా పరిశోధకుడు అనేక కళా విశేషాలను తన రచనల ద్వారా జనాలకి అందించారు. ఆంధ్ర దేశంలో శాస్త్రీయ నృత్యం లేదని కొందరు పెద్దలు సెలవిచ్చారు. ఈ కారణంగా ఆయన ఆంధ్ర దేశమంతా పర్యటించి అనేక కళాకారులని కలసుకుని, ఎన్నో దేవాలయాలను సందర్శించి, శిల్ప కళా సౌందర్యాన్ని, దాని భాషని ఆకళించుకుని, అనేక ప్రాచీన గ్రంధాలను పరిశోధించి విశిష్ట మైన ఆంధ్ర నాట్య కళలను వెలికి తీసి వాటికి " ఆంధ్ర నాట్యం " నామం ఇచ్చారు.
కళాకారుడిగా, కళారాధకుడిగా, కళాసాధకుడిగా, కళాబోధకుడిగా, కళా పరిశోధకుడిగా, కళా విమర్శకుడిగా, కళా ప్రచారకుడిగా, మేధావిగా, నాట్యాచార్యుడిగా నాట్య కళకే జీవితాన్ని అంకితమిచ్చిన మహానీయుడు, ఆజన్మ బ్రహ్మచారి. కూచిపూడి సాంప్రదాయ రీతులని ప్రాచుర్యంలోకి తెచ్చిన మేటి నాట్యాచారుడు.
బాల్యం, నృత్యం వైపు ఆకర్షణ:
రామకృష్ణ గారు ఇండోనేషియా లోని బాలి లో మార్చ్ 31, 1923 లో రాం మోహన రావు, దమయంతి దంపతులకు జన్మించారు. వీరి పూర్వికులది ఆంధ్ర దేశం లోని " కోనసీమ ". తల్లి అకాల మరణం తరువాత ఇండోనేషియా నుండి చెన్నై తిరిగి వచ్చారు. కొంత కాలం నాగ్పూర్ లో ఉన్నారు. తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో స్థిర పడ్డారు.
పదవ ఏటనే కాళ్ళకు గజ్జలు కట్టారు. గజ్జెలు కూడా కొనుక్కోలేని పరిస్తుతుల్లో ఎండిన తుమ్మకాయలను కాళ్ళకు కట్టుకుని నాట్యం అభ్యసించారు. వారికి నృత్యం పట్ల ఎంత మక్కువో చెప్పడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు. సోదరుడు స్యామసుందర్ వీరికి స్పూర్తి. అనేక సందర్భాలలో అండగా నిలిచారు.
మీనక్షి సుందరం పిళ్ళై, నాయుడిపేట రాజమ్మ, పెండ్యాల సత్యభామ, వేదాంతం లక్ష్మినారాయణ శాస్త్రి గార్లు వీరి గురువులు.
పేరిణి శివతాండవం
దాదాపు ఏడు వందల వేళ్ళ క్రితం కాకతీయుల నాటి కాలంలో రాజ ప్రజాదరణ పొంది మనుగడలో ఉన్న " పేరిణి శివతాండం " నృత్య సాంప్రదాయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఏ ప్రభుత్వాలు, అకాడమీలు, విశ్వవిద్యాలయాలు చేయలేని మహత్తర కార్యాన్ని ఆయన సాధించారు. ఈ నృత్య సాంప్రదాయం విశిష్టత ఏమిటంటే ఇది పురుషులు మాత్రమే చేసే నృత్యం.
ఈ నృత్య రీతి పునరుద్ధరణతో అనేక వందల మంది మగవాళ్ళు గజ్జె కట్టారు. ఇలా జరిగిందీ అంటే దానికి నాంది, స్ఫూర్తి " నటరాజ " రామకృష్ణ కారణమే అని నిస్సంకోచముగా చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన శిష్య, ప్రశిష్య సంపద ఈ నృత్య రీతి పరివ్యాప్తికి తమ వంతు కృషి చేస్తున్నారు. వీరిలో శ్రీ కళా కృష్ణ తదితరులు ఉన్నారు.
నాట్య రీతులపై అనేక వ్యాసాలు వ్రాశారు. నలబై కి పైగా పుస్తకాలు రచించారు. అన్నీ కళా సర్వస్వాలే. వీరు పరిశోధించి రాసిన " రుద్ర గణిక " ఓ ఉద్గ్రంధం. ఇందులో ఎన్నో సరికొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఉదాహరణకు " దేవ దాసి " పద ప్రయోగం మునుపెన్నడూ ఏ గ్రంధంలోనూ పేర్కొన్న ఉదంతాలు లేవని చెప్పారు. ప్రముఖ పత్రికా రచయిత స్వయం చోదక పరిశోధకుడైన శ్రీ బి ఎన్ శాస్త్రి ని, ఏ గ్రంధాలలో నైనా కాన వస్తుందేమో చూడవలసిందదిగా కోరారు. శాస్త్రి గారు తాను ఇటువంటి పద ప్రయోగాలు ఎక్కడా చూడలేదని సెలవిచ్చారు. నిష్కారణముగా ఈ పదాన్ని సంబోదనకు వాడరాదని రామకృష్ణ వారి వాదం.
" నటరాజ "రామకృష్ణ గారి పద్దెనిమిదవ ఏట మహారాష్ట్ర బందార సంస్థానం రాజా గణపతి పాండ్య " నటరాజ " బిరుదుతో గౌరవించారు. అప్పటినుంచి అది వారి సార్ధక నామం అయిపోయింది.
నీలం సంజీవ రెడ్డి గారి విన్నపం మేరకు నృత్య నికేతన్ (నృత్య పాఠశాల) ఏర్పాటు చేశారు.
చిందు యక్షగానం తెలంగాణా ప్రాంత జానపద రీతి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని తప్పెటగుళ్ళు, ఉభయ గోదావరి జిల్లాలలోని వీర నాట్యం, గరగలు ఇలా అనేక జానపద, ప్రాంతీయ సాంప్రదాయ నృత్యాలను ఆదరణలోకి తెచ్చారు. వీరు జరిపిన నాట్య ప్రక్త్రియలలో " నవ జనార్ధన పారిజాతం " విశేహ జనాదరణ పొందింది.
ఆంధ్ర నాట్యం రచనలో అనేక అంశాలను ప్రస్తావించారు; కొత్త విషయాలను వెలుగు లోకి తీసుకు వచ్చారు గిరిజన, జానపద నృత్యాలు లో పగటి వేషాలు, పగటి వేషగాళ్ళు (బహురూపులు), జంగమ దేవర వేషం, మాయల ఫకీరు, భట్టి విక్రమార్క, ఇత్యాధి వేషాల గురించి వర్ణించారు. విప్రవినోధులు, సాధన శూరులు, సయ్యం వారు - ఇంద్రజాల మహేంద్ర జాలాలతో అలరించే వారని విసిధ పరిచారు. దొమ్మరిసాని గెడ ఎక్కి గిర గిరా తిరుగుతూ చేతినున్న వేప కొమ్మ విసిరితే, అది పడిన దిక్కున పంటలు బాగా పండుతాయి " అన్న అంశాన్ని వెలికి తీసారు. అందు వల్ల పల్లెలలో వీరిని ఆదరిస్తారు అని వ్రాశారు. " గారిడీ విద్య తూర్పు గోదావరి జిల్లా జానపద కళారూపం. మైదానం లో భేరి మోగిస్తూ, లయ ప్రకారం చేస్తున్న అందెల మోత మైలు దూరం వరకూ వినిపిస్తాయి " అని విశ్లేషించారు.
ఉరుములు (అనంతపురం ప్రాంత నృత్యం), గురువయ్యలు, జముకులవారు, కడ్డీ వాయిద్యం, పులి వేషం, బుర్ర కధ దళాలు, గొబ్బి, సప్తతాళ భజన, బతకమ్మ, గుసాడీ నర్తనం, కోలాటం, చిరుతల రామాయణం, జోగు ఆట, ఉగ్గు గొల్లలు, కీలు గుర్రాలు, తప్పెట గుళ్ళు, డప్పుల నాట్యం, తోలు బొమ్మలాట, కీలు బొమ్మలు, గరగలు, సవరలు, గొండు, కోయ వివరాలను ఆంధ్ర నాట్యం రచనలో పొందుపరిచారు.
వీరు చేసిన విశిష్ట కృషికి సంగీత నాటక అకాడమి " ఫెల్లో షిప్ " ఇచ్చి గౌరవించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంగీత నాటక అకాడమి అధ్యక్షుడిగా ఉన్నారు.
ఆంధ్ర నాట్యం
వేంకటేశ్వర స్వామి మీద నృత్య రూపకం రచించారు. శ్రీనివాస కల్యాణం, " కుమార సంభవం ", " మేఘ సందేసం " నృత్య రూపకాలను రచించారు, ప్రదర్శించారు.
పరిశోధకుడిగా, భారత ప్రభుత్వ సహాయంతో రష్యా (నాటి యు ఎస్ ఎస్ ఆర్), ఫ్రాన్స్ దేశాలు వెళ్ళి భారతీయ నృత్య సాంప్రదాయలను పరిచయం చేసారు.
గతంలో ఆదరణ పొంది కనుమరుగైపోయిన, తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం కుంతీ మాధవ ఆలయంలోని ప్రభంద నృత్య రూపకం " నవ జనార్ధనం " వెలుగు చూసింది.
ఆంధ్ర నాట్యం రీతులు:
ఆరాధన నృత్యం - ఆలయ నృత్యం
ఆస్థాన నృత్యం - రాజ సభలో రాజ నర్తకిలు, ఆస్థాన నర్తకిలు చేసే నృత్యం ప్రబంధ నృత్యం. పిన్నా పెద్దా, రాజు పేదా అందరికి సానుకూలం. పురాణ, ఇతిహాస, సాంస్కృతిక, సాంప్రదాయ స్పూర్తిని చాటే నృత్యం. వీటిలో " భామా కలాపం " (నవ జనార్ధన పారిజాతం), " గొల్ల కలాపం " ఉన్నాయి.
నటరాజ గారు శిలాభాష నేర్చుకున్నారు. కళా వికాసం పొందారు. శిల్పాలు కూడా వీరితో మాట్లడుతాయి అంటే అతిశయోక్తి కాదు. వాటిలో ఉన్న అంతర్గత శక్తిని అర్ధంచేసుకున్న గొప్ప వ్యక్తి. అంతే కాదు దాన్ని ఆకళించుకుని నృత్య సంప్రదాయాలలోకి విలీనం చేశి భవితవ్యానికి అందించారు.
రచనలు:
వీరి రచనలలో అనేక విషయాలు బయటి వచ్చాయి. మరి కొన్ని ఉదాహరణలు తిమ్మరసు తో సహా శ్రీ కృష్ణ దేవరాయలు పగటి వేషం వేసుకుని వెళ్ళి అన్నపూర్ణా దేవిని పరిణయమాడాడు అని వివరించారు.
రామకృష్ణ గారు రచనలలో కొన్ని ముఖ్యమైనవి:
ఆంధ్ర నాట్యం - ఆలయాలు
ఆంధ్ర నాట్యం - నాట్య శాస్త్రాలు
ఆంధ్ర నాట్యం - ఆలయ నృత్యాలు
ఆంధ్ర నాట్యం - ఆస్థాన నర్తనాలు
ఆంధ్ర నాట్యం - అమర నర్తకులు
ఆంధ్ర నాట్యం - అభినయం
ఆంధ్ర నాట్యం - కూచిపూడి నాట్యం
ఆంధ్ర నాట్యం - పేరిణి నవజనార్ధనం
ఆంధ్ర నాట్యం - ప్రజా నర్తనాలు
ఆంధ్ర నాట్యం - భరత నాట్యం
వెంకట బుర్రయ్య తెలుగుకు చేసిన మేలుని కూడా వెలుగు లోకి తీసుకొచ్చారు. రామకృష్ణ గారు తమ రచనలలో, తెలుగు భాషకు ఎనలేని మేలు చేసిన ముగ్గురు ఆంగ్లేయులను ఆర్థర్ కాటన్, మెకంజీ, చాల్స్ బ్రౌన్ ఊటంకిస్తూ ఉంటారు.
"శ్రీమాన్, ధీమాన్, వివేకి, వితరణ, నిపుణోగాన విద్యానిపుణ, కలావాన్, అభినయ చతురహ " అని పెద్దలు చెప్పిన సుగుణాలన్ని రాసి పోసిన కళామూర్తి ఆయన " అని తెలుగు విశ్వవిద్యాలయ కులపతి ఆచర్య ద్రోణప్ప వ్రాశారు.
" నటరాజ రామకృష్ణ కి అతని రచనకి తెడా ఏమీ లేదు. రెండూ " కళా స్వరూపాలు " కళావేత్తలు, కళాసక్తులు, కళా వైవిద్యాలు, కళాలయాలు, కళా పరిభాషలు నటరాజ సమాచార సర్వస్వాలు గానూ, రచనలు ప్రభోదాత్మకంగాను ఉంటాయి " అని ప్రముఖ పాత్రికేయుడు జి కృష్ణ " అప్పుడు ఇప్పుడు " లో వ్రాశారు.
గౌరవాలు:
కళాప్రపూర్ణ బిరుదు అందుకున్నారు
శ్రీశైల దేవస్థానం రామకృష్ణ గారిని ఆస్థాన నాట్యాచార్యుడిగా నియమించింది (1980).
కళా సరస్వతి, రాజ్యలక్ష్మి అవార్డులు అందుకున్నారు
కేంద్ర సంగీత నాట్య అకాడమి వీరికి " దక్షిణ భారత ఉత్తమ నాట్యాచార్యుడు " గౌరవం ఇచ్చింది.
పలు విశ్వవిద్యాలయాలు రామకృష్ణ గారికి గౌరవ డాక్టరేట్లు అందించాయి.
1992 భారత ప్రభుత్వం " పద్మశ్రీ" గౌరవం ఇచ్చి సత్కరించింది.
సోదరీ, సోదరులు పోయిన తరువాత తన శిష్యుల వద్దే కాలం గడుపుతూ వచ్చారు ఈ ఆజన్మ బ్రహ్మచారి.
వృదాప్యంలో కొంత కాలం అనారోగ్యానికి గురై జూన్ 6, 2011 లో కన్నుమూసారు. ఆయన శిష్యుడైన కళా కృష్ణ ఇంటిలో భౌతిక కాయాన్ని ఉంచారు. గురు భక్తి అలా చాటుకున్నారు కళాకృష్ణ. తన శిష్య సంపదను వారసులుగా, వారధిగా మిగిల్చి వెళ్ళి పోయారు. ఆంధ్ర జన కళా హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. నటరాజ గారు నాట్య కళకు చేసిన మేలును ప్రతీ ఆంద్రుడు గర్వించవచ్చు.
" నేను నా సర్వసం నృత్యం (పేరిణి) లో పెట్టాను. నాకు ఏ సహాయం అక్కరలేదు. తెలుగు జాతి భావితరాలకు ఇది పరివ్యాప్తిస్తే చాలు " అని ఓ సందర్భములో చెప్పారు. సంక్రమించిన, వెలికి తీసిన ఈ నృత్య సంప్రదాయాలను భావి తరాలకు అందజేస్తే " నటరాజ " జీవితాంత కృషికి ఫలితం దక్కినట్టే.
‪#‎natarajaramakrishna‬

కాకతీయుల నీటి పారుదల విధానం

ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా...
కాకతీయుల నీటి పారుదల విధానం గురించి
కాకతీయులు వర్షపు నీటిని వృధా కాకుండా నిల్వ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కాకతీయులు కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఒక చెరువు నిండి అదనంగా వచ్చిన నీటిని మరో చెరువులోకి మళ్లించాలనే ఉద్దేశ్యంతో కాలువల నిర్మాణాన్ని చేపట్టారు. 
ఈ కాలువలు ఒక చెరువు నుంచి వేరొక చెరువును, ఆ చెరువు నుంచి మరో సరస్సును అనుసంధానం చేస్తూ నిర్మించారు.
అందుకే వీరి కాలం నాటి చెరువులను గొలుసు కట్ల చెరువులు అని పిలుస్తారుి. గొలుసు కట్టు చెరువులతో వీరు నీటిని నిల్వ చేసిన విధానమూ సిరులు పండించిన తీరు ఇప్పటి తరుణంలో ఆదర్శనీయం.
ప్రజలకు, ప్రభుత్వానికి వ్యవసాయం ముఖ్య ఆదాయ మార్గం.
కాబట్టి కాకతీయ రాజులు సేద్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.
వ్యవసాయానికి అవసరమైన నీటిపారుదల సౌకర్యాలను కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తెలంగాణ ప్రాంతంలో కాకతీయ రాజులే కాక వారి సేనానులు, సామంతులు, ఉద్యోగులు, మతాచార్యులు, సంపన్నులు తటాకాలు నిర్మించడంపై అమిత శ్రద్ధ చూపారు.
ప్రకతి సిద్ధంగా వర్షపు రూపంలో వచ్చేనీటిని నిల్వ చేసుకునే లక్ష్యంలో కాకతీయుల కాలంలో అనేక నిర్మాణాలు జరిగాయి.
అయితే, జలాశయాల నిర్మాణాన్ని వర్తక వాణిజ్యం కోణంలోనే కాకతీయులు చూడలేదు. సప్త పుణ్యకార్యాల్లో ముఖ్య కార్యంగా, అశ్వమేధ యాగంతో సమానమైందిగా భావించారు.
కాకతీయ చక్రవర్తులు కల్పించిన నీటిపారుదల సౌకర్యాలను సరస్సులు, చెరువులు, కాలువలు, బావులు అని నాలుగు రకాలుగా విభజించవచ్చు. మొదటి ప్రోలరాజు నుంచి జలాశయాల నిర్మాణం ప్రారంభమైందని చెప్పవచ్చు.
ఇతడు కేసీయ సముద్రం నిర్మించినట్లుగణపతిదేవుడు వేయించిన మోటుపల్లి స్తంభశాసనం ద్వారా తెలుస్తోంది. రెండవ బేతరాజు అనుమకొండ పట్టణంలో శివపురం పేరుతో తోటను, చెరువును నిర్మించినట్లు మోటుపల్లి శాసనం తెలియజేస్తోంది. గణపతి దేవుడు నెల్లూరు, గంగాపురం, ఎల్లూరు, గణపపురం, ఏకశిలాపురిలలో అనేక చెరువులు నిర్మించినట్లు ప్రతాపరుద్ర చరిత్ర ద్వారా తెలుస్తోంది. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు తవ్వించిన అనేక చెరువుల వివరాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
కాకతీయులు పాలించిన తెలంగాణ ప్రాంతమంతా సముద్ర మట్టానికి వేలాది మీటర్ల ఎత్తులోఉంది. పైగా వర్షపాతం కూడా తక్కువ. ఎత్తయిన ప్రాంతం కావడం వల్ల వర్షాల ద్వారా వచ్చిన నీరు వథాగా పోయి నీటి సమస్య ఏర్పడేది. దీంతో వర్షపు నీటిని నిల్వ చేయాలన్న ఉద్దేశ్యంతో కాకతీయ చక్రవర్తులు చెరువుల నిర్మాణానికి పూనుకున్నారు. వర్షపాతం అధికంగా ఉండే అటవీ ప్రాంతంలో కొండలనే ఆనకట్టలుగా చేసుకొని భారీ జలాశయాలను నిర్మించారు. వాటి కింద మరో చెరువును, దాని కింద మరికొన్ని చెరువులు, కుంటలను నిర్మిస్తూ పోయారు.కాలువల ద్వారా వీటిని అనుసంధానించారు.
వర్షకాలంలో జలాశయాల్లోకి చేరిన నీరు వాటిని నింపిన తరువాత ఎక్కువైన నీటిని మత్తడి ద్వారా కింద ఉండే చెరువులు, కుంటల్లోకి పరుగులు తీసేలా చర్యలు తీసుకున్నారు.
సుమారు 20 వేల చెరువులను కాకతీయులు నిర్మించినట్లు పలువురు పరిశోధకులు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 5 వేల చెరువులను మాత్రమే గుర్తించారు. కష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో విస్తరించిన కాకతీయ సామ్రాజ్యంలో నీటి ప్రవాహ దిశ, నిల్వ చేయడానికి అనువుగా ఉన్న పరిస్థితులను గుర్తించి జలాశయాలను నిర్మించారు. పాకాల, రామప్ప, లక్నవరం సరస్సులు కాకతీయులు నిర్మించిన గొప్ప జలాశయాలు.
‪#‎IRRIGATION‬
‪#‎KAKATIYAS‬
‪#‎AAP‬

Ancient Egyptian burial customs


పురాతన ఈజిప్టు వాసులు విచిత్రమైన
ఖనన సంప్రదాయాలను పాటించేవారు, ఎందుకంటే వారు ఈ సంప్రదాయాలు మరణం తరువాత అమరత్వాన్ని సిద్ధింపజేస్తాయని భావించేవారు. భౌతిక దేహాన్నిమమ్మీగా మార్చడం,
ఖనన క్రియలు నిర్వహించడం మరియు మరణం తరువాత సంబంధిత వ్యక్తులు ఉపయోగించేందుకు శరీరంతోపాటు, వస్తువులను కూడా సమాధి చేయడం వంటి సంప్రదాయాలు ఖనన ప్రక్రియలో భాగంగా ఉండేవి.
భౌతికదేహాలను ఎడారి గొయ్యిల్లో పూడ్చిపెట్టేవారు,శోషణంద్వారా సహజంగా ఈ బౌతికదేహాలు రక్షించబడేవి.
నిర్జలమైన, ఎడారి పరిస్థితులు చరిత్రవ్యాప్తంగా పురాతన ఈజిప్టులో పేదల ఖనన ప్రక్రియలకు ఒక వరంగా ఉండేవి, సంపన్నులకు అందుబాటులో ఉండే విస్తృత ఖనన సంప్రదాయాలు పేదలు భరించేవిధంగా ఉండేవి కాదు.
ధనిక ఈజిప్షియన్ల మృతదేహాలను రాతి సమాధుల్లో పూడ్చిపెట్టేవారు, దీని ఫలితంగా, వీరి మృతదేహాలను కృత్రిమ మమ్మీలగా మార్చేవారు,అంతర్గత అవయవాలనుతొలగించడం, నార వస్త్రంలో శరీరాన్ని చుట్టడం, దీనిని దీర్ఘచతురస్రాకార రాతి శవపేటికలో లేదా చెక్క శవపేటికలో ఉంచి పూడ్చిపెట్టే క్రియలు మమ్మీలుగా మార్చే ప్రక్రియలో భాగంగా ఉన్నాయి.
‪#‎AAP‬

మీర్ ఉస్మాన్ అలీఖాన్మీర్ ఉస్మాన్ అలీ ఖాన్మీర్ అసద్ అలీ ఖాన్ చిన్ చిలిచ్ ఖాన్ నిజాముల్ ముల్క్ ఆసఫ్ జాహ్ 7
میر اسد علی خان چن چلچ خان نظام الملک عاصف جاہ ٧

ఆసఫ్ జాహి వంశానికి చెందిన ఇతడు 1886 ఏప్రిల్ లో హైదరాబాద్ లోని పురాణ హవేలీ లో జన్మించాడు.
తండ్రి మహబూబ్ అలీ ఖాన్ ఆసఫ్ జాహ్ VI
తల్లి ఆమత్ ఉజ్ జాహిరున్నిసా బేగం.
మహబూబ్ అలీ ఖాన్ 2 వ కుమారుడు.
క్రీ.శ.1911లో మరణించడంతో ఇతడు ఏడవ అసఫ్ జా బిరుదుతో నైజాం పదవిని అలంకరించాడు
1911 వ సంవత్సరం సెప్టెంబరు 18 వ తేదీన పట్టాభిషిక్తుడయి దాదాపుగా 37 సంవత్సరాల పాటు నైజాం రాజ్యాన్ని పాలించాడు.
ఈయనే అసఫ్ జాహీపాలకులలో చివరివాడు.


185 క్యారెట్ల వజ్రం… ఆయన పేపర్ వెయిట్ 
ఆయన ఆస్తి . భారతదేశ బడ్జెట్‌కు రెండింతలు.. 
సొంత విమానాశ్రయం, సొంత రైల్వే, సొంత బ్యాంకు.. 
అప్పట్లో ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు..
మిలమిలా మెరిసే 185 కేరెట్ల జాకబ్ వజ్రం ఆయన బల్లపై పేపర్ వెయిట్..
1937లో ఫిబ్రవరి22న టైం మేగజైన్ కవర్‌పేజీపై ‘రిచెస్ట్ మెన్ ఇన్ ది వరల్డ్’ పేరుతో ప్రచురితమైన కథనం ఆయనదే…
ఆయనే ఏడో నిజాం

మీర్ ఉస్మాన్ అలీఖాన్. అసఫ్‌జాహీ వంశంలో చివరి రాజు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో హైదరాబాద్ స్టేట్‌ను పాలిస్తున్న రాజు.
1940వ దశకంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డుపుటల్లోకి ఎక్కిన ఏడో నిజాం..
ప్రపంచ నలుమూలలకూ మేలిమి వజ్రాలను సరఫరా చేసినవాడిగా కూడా రికార్డు సాధించారు.
అదే ఆయనను ప్రపంచ ధనికుడిని చేసింది. అమెరికా మొత్తం సంపదలో రెండు శాతంతో సమంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ సంపద ఉండేది. అప్పట్లోనే ఆయన సంపద విలువ రెండు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.
అప్పుడు భారతదేశ వార్షికాదాయం ఒక బిలియన్ డాలర్లు మాత్రమే. అంతేకాదు హైదరాబాద్ సంస్థానం బడ్జెట్ అప్పట్లోనే రూ.కోట్లలో ఉండేది. మొత్తం బడ్జెట్‌లో 11 నుంచి 15 శాతం దాకా విద్యా రంగానికే కేటాయించే వారు.
ఇళ్లకు విద్యుత్ వెలుగులు, నిజాం విశ్వవిద్యాలయం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి భవనం, నిజాం చక్కెర కర్మాగారం..
ఇవన్నీ ఆయన బడ్జెట్ కానుకలే. ప్రస్తుతం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’గా కొనసాగుతున్న బ్యాంకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సొంతంగా స్థాపించిన బ్యాంకే.

హైదరాబాదులో చేపట్టిన అభివృద్ధి పనులు
హైదరాబాద్ లో బస్సులతో రవాణా వ్యవస్థను ఏర్పాటు చేశాడు.
డెక్కన్ క్వీన్, నిజాం రాజ్య రోడ్డు రవాణా సంస్థకు చెందిన 1932నాటి బస్సు(విజయవాడ బస్సు కాంప్లెక్స్ ఆవరణలో ప్రదర్శితమవుతోంది.
*.ఉస్మాన్ సాగర్,నిజాం సాగర్ ,హిమాయత్ సాగర్ సరస్సుల ను తవ్వించాడు.
*.ఉస్మానియా విశ్వవిద్యాలయం1918 వ సంవత్సరం లో స్థాపించబడినది.
*.సిర్పూరు పేపరు మిల్స్, బోధన్ చక్కెర ఫాక్టరీ, అజంజాహీ నూలు మిల్లులు, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ మొదలైన కర్మాగారాలు నెలకొల్పబడినవి
.*.నిజాం స్టేట్ రైల్వేనెలకొల్పబడినది.
.టైమ్ పత్రిక 1937 సంవత్సరం నిజాం ను ప్రపంచంలోని అత్యంత ధనవంతునిగా ప్రచురించింది
.ఆగష్టు 15, 1947న భారతదేశం స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాదును స్వతంత్ర రాజ్యం చేయడానికి నిజాం ప్రయత్నించాడు.
నైజాం రాజ్యాన్ని భారతదేశంలో కలపడానికి
నిజాం తో అనేక సంప్రదింపులు జరిపిన భారత ప్రభుత్వం నిజాం అంగీకరించకపోవడం తో చివరకు సెప్టెంబరు 13,1948 నఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య జరిపి హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది.
తర్వాత 1948 నుండి 1967 వరకు నిజాం రాజా ప్రముఖ్ గా పని చేశారు
1956లో జరిగిన భాషాప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వలన నిజాం రాజ ప్రముఖ్ పదవి కోల్పోయాడు.
1957 మరియు 1962 సార్వత్రిక ఎన్నికలలో అనంతపురం మరియు కర్నూలు నియోజకవర్గాల నుండి భారత పార్లమెంటుకు రెండు సార్లు ఎన్నికయ్యారు.ఇతడు
1967సంవత్సరం ఫిబ్రవరి 24తేదీన మరణించాడు. కింగ్ కోటీ లోని జుడి మసీదు ఇతని సమాధి స్థలం.
‪#‎nizam‬
‪#‎Hyderabad‬
‪#‎AAP‬


‪#‎meerusmanalikhan‬

మెట్లబావులు

వెయ్యేండ్ల కిందట మెట్లబావులు ప్రజా ప్రాథమికావసరాలు. ప్రజల సామాజిక శ్రేయస్సుకు మెట్ల బావులు తోడ్పడేవి. జలవనరుల కోసం.. వాటి నిర్మాణ...