10, జనవరి 2018, బుధవారం

షోయబ్ ఉల్లాఖాన్

 • షోయబ్ ఉల్లాఖాన్ 1920, అక్టోబరు 17 న ఖమ్మం జిల్లా సుబ్రవేడు లో జన్మించిన తెలంగాణా యోధుడు
 • బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి.
 • తండ్రి హబీబుల్లాఖాన్. 
 • నిజాం ప్రభుత్వంలో రైల్వేలో పనిచేశారు. 
 • తల్లి లాయహున్నీసా బేగం.
 •  షోయబుల్లాఖాన్ వీరికి ఏకైక సంతానం. 
 • వీరి కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడింది.
 •  షోయబ్ భార్య ఆజ్మలున్నిసా బేగం. వీరికి ఇద్దరు కుమార్తెలు.
 •  షోయబ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఎ, జర్నలిజం డిగ్రీ చేశాడు.
 •  బొంబాయిలో ఇంటర్మీడియట్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్ష కూడా పాసయ్యాడు.
 •  తన కుమారునిలో మహాత్ముని పోలికలున్నాయని షోయబుల్లా తండ్రి మురిసిపోయేవాడు. ఈ కారణం చేతనే షోయబ్ ను ఆయన ‘షోయబుల్లా గాంధీ’ అని ముద్దుగా పిలుచుకునే వాడు. 
 • గాంధీలాగానే షోయబ్ కూడా తాను నమ్మిన మార్గంలో ప్రయాణించడంలో నిబధ్ధతను, మొండితనాన్ని ప్రదర్శించాడు.
 •  ప్రోగ్రెసివ్ మూవ్మెంట్ లో పాల్గొన్నాడు, విశాలభావాలు కలవాడు. 
 • ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను వ్యతిరేకంగా రాసినందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు మత దురహంకారులు 1948 ఆగష్టు 22న రజాకార్లు పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో అతిక్రూరంగా కాల్చిచంపారు.


వృత్తి జీవితం


 • షోయెబుల్లా ఖాన్ విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాకా జీవితాన్నంతా పత్రికావృత్తిలో గడిపారు.
 •  షోయబుల్లా రచనా జీవితం తేజ్ పత్రికలో ప్రారంభమైంది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలు రచించారు.
 •  అటువంటి రచనల్ని ప్రచురిస్తున్న కారణంగా నిజాం ప్రభుత్వం తేజ్ పత్రికను నిషేధించింది. ఆ సమయంలోనే ప్రసిద్ధ కాంగ్రెస్‌నాయకుడు ముందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడుతున్న రయ్యత్ పత్రికలో ఉప సంపాదకునిగా బాధ్యతలు చేపట్టారు. 
 • రయ్యత్ పత్రిక కూడా నిజాం నిరంకుశత్వాన్ని విధానపరంగా విభేదించింది. అప్పటికే ముమ్మరంగా తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతోంది. 
 • ఆ సందర్భంలో రయ్యత్ పత్రికలో నిజాం ప్రభుత్వం అమలుచేస్తున్న దమనకాండ, ప్రజాఉద్యమాన్ని అణచివేసేందుకు రజ్వీని ఉసిగొలుపుతున్న పద్ధతులను వ్యతిరేకిస్తూ రచనలు చేశారు. ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం నిషేధించింది.                                                                                      
 • రయ్యత్ నిషేధానికి గురయ్యాకా షోయబుల్లా ఖాన్ స్వంత నిర్వహణలో ఇమ్రోజ్ అనే దినపత్రికను స్థాపించారు. ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు షోయబుల్లా స్వీకరించారు.                                                                     
 •  రాజకీయ స్థితిగతులు అప్పటికే వేడెక్కాయి. పాకిస్తాన్‌కు కోట్లాది రూపాయలు ధనసహాయం చేయడం వంటి చర్యలు నిజాం, రాజ్యంలోని ప్రజలతో దాదాపుగా యుద్ధం చేస్తూ ఖాసింరజ్వీ పరిస్థితుల్ని మార్చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాజ్యానికి చెందిన ఏడుగురు ముస్లిం పెద్దలు ఒక పత్రాన్ని తయారుచేశారు. 
 • నిజాం రాజుకీ, ఆయన ప్రజలకీ హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో రాజ్యాన్ని విలీనం చేయడమే సరైన నిర్ణయమని ఆ పత్రం సారాంశం. ఈ పత్రాన్ని ఇమ్రోజ్ పత్రికలో యధాతథంగా షోయబుల్లా ఖాన్ ప్రచురించారు. ఈ ప్రకటనాంశాన్ని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో ఉపయోగించుకుంటుందేమోనని నిజాం భయపడ్డాడు. ఈ పరిణామాలే చివరకు ఆయన దారుణ హత్యకు కారణమయ్యాయి.


బూర్గుల నరసింగరావు కథనం:

 • "షోయబుల్లాఖాన్ హత్య జరిగేనాటికి ఆయనకు రెండు సంవత్సరాల కూతురు, భార్య నిండు చూలాలు. షోయబ్ చనిపోయాక ఆ కుటుంబాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పునాదులు కోల్పోయిన ఆ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని కాయంగంజ్‌కు వలస వెళ్లింది.
 • షోయబ్ తండ్రి నాలుగేళ్లపాటు వాళ్ల దగ్గర, వీళ్ల దగ్గర ఆర్థిక సాయం పొంది తర్వాత అతను కూడా కోడలి దగ్గరికి వెళ్లిపోయాడు.కాంగ్రెస్ నాయకులు మందుముల నర్సింగరావు బావ అయిన బూర్గుల రామకృష్ణారావు తమ తరఫున నిజాం దౌర్జన్యాలను ఎండగట్టే ఒక పత్రికుండాలని ఆరాటపడుతున్నాడు.          
 •  షోయబుల్లాఖాన్ బూర్గుల సహాయంతో నగలునట్రా అమ్మి ‘ఇమ్రోజ్’ను స్థాపించారు. బూర్గుల రామకృష్ణారావు ఇంట్లో ఇమ్రోజ్ ఆఫీస్ ఉండేది. 
 • ఉర్దూలో ఇమ్రోజ్ అంటే ఈ రోజు. ఆయన దేన్నయినా గుడ్డిగా నమ్మేవాడు కాదు. చాలా తార్కిక దృష్టి. అందుకే సోవియట్ యూనియన్‌లో స్టాలిన్ నియంతృత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడేవాడు. ప్రజాస్వామ్యంలేని సోషలిజం ఎందుకని వాదించేవాడు. 
 • ఎమ్‌ఎన్ రాయ్ రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికను తెప్పించుకునేవాడు. ఆయన రాతలు చాలా సీరియస్సే కాని మనిషి మాత్రం సరదాగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. సైద్ధాంతిక చర్చలప్పుడు కూడా అనవసర ఘర్షణలకు దిగేవాడు కాదు. చర్చను కూడా నెమ్మదిగా, నిలకడగా చేసేవాడు. జర్దాపాన్, సిగరెట్ ఆయన అలవాట్లు. షోయబుల్లాఖాన్ మంచి పెయింటర్. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం.
 •  రవీంవూదనాథ్ ఠాగూర్‌ది పెద్ద పోట్రయిట్ గీసాడు. ఉర్దూ, ఇంగ్లీష్ సాహిత్యాలంటే ప్రాణం పెట్టేవాడు. ఏ మూల నిజాం ఆగడాలు చెలరేగుతున్నా, ఎక్కడ ఆర్మీ క్యాంప్స్ ఉన్నా వాటి గురించి నిర్భయంగా రాపేవాడు. హైదరాబాద్ ఇండియాలో విలీనం కావాల్సిందేనని తన రాతలతో స్పష్టం చేసేవాడు. నిజామ్‌కు వ్యతిరేకంగా ఉన్న ముస్లిం విద్యావంతుల అభిప్రాయాలను ప్రచురించేవాడు. 
 • నిజాం మొండితనానికి, రజాకార్ల ఉన్మాదానికి ఎక్కువ బలవుతోంది పేద ముస్లిం కుటుంబాలు, యువకులేనని ఎన్నో సార్లు ఆవేదన చెందాడు.హైదరాబాద్ ఇండియాలో విలీనం కావడమనేది షోయబుల్లాఖాన్ కల. లక్ష్యం. దాని కోసం నడిరోడ్డుమీద ప్రాణాలను బలిపెట్టాడు. అలాంటి త్యాగమూర్తికి మనమిచ్చిన గౌరవం... మలక్‌పేటలో ఆయన పేరు మీద ఒక గదితో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు. ఇంతే. చూద్దామంటే ఆయన విగ్రహం లేదు. తర్వాత తరాలు తెలుసుకోవడానికి చరిత్ర లేదు. ఎంత విచిత్రం? పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చిన నిజాయితీపరుడు. ఇవాళ ఎంతమందికి తెలుసు ఆయనంటే? ఇంత నిర్లక్ష్యమా?నిజమే..ఎంత అలక్ష్యం?


రావెల సోమయ్య కదనం:


 • 1947 కు ముందు ఎం.ఎన్.రాయ్ ప్రారంభించిన "Independent India " పత్రికను షొయబుల్లాఖాన్ అందరికి పంచేవాడు.స్వతంత్రం వచ్చిన తరువాత పేరు మార్చుకొని రాడికల్ హ్యూమనిస్ట్ పేరుతో ఆ పత్రిక ఇప్పడికీ వస్తుంది 
 • .నిర్దాక్షిణ్యమైన చరిత్రరథం తన గమనంలో పక్షపాతంగా ఎందరో మహానుభావులను ఎక్కించుకోకుండానే వెల్లిపోతుంటుంది.అటువంటి వారిలో షోయబుల్లా ఖాన్ ఒకరు .
 •  ఆ రథం మెడలు వంచి ఇటువంటి మహానుభావుల్ని ఎక్కించాలి. షోయబుల్లా ఖాన్ మీదా ఇంటెర్నెట్ అంతా వెదికినా ఒక్క ఫోటో కానీ, వీకీపీడియాలో అతని చరిత్ర కానీ దొరకదు మనకు .
 •  1990 ల్లో నటరాజన్ అనే అతను అమేరికా నుండి వచ్చి ఒక డాక్యుమెంటరీ తీస్తే ఇంతకీ అది ఎక్కడుందో కూడా తెలియదు. దాన్ని అన్ని భాషల్లోకి అనువదించమని అప్పటి ప్రదాని పి.వి.నరసిమ్హారావు ని అడిగిన కాళోజి మాట ఏమయ్యిందో ఇప్పటికీ తెలియదు. 


సయ్యద్ నశీర్ అహమద్ కథనం:


 • బానిస బంధనాల నుండి విముక్తి కోసం సాగిన ప్రపంచ ప్రజాపోరాటాల చరిత్రలో అన్నివర్గాల ప్రజానీకంతోపాటుగా కలం యోధులైన పాత్రికేయులు, సంపాదకులు పలు నిర్బంధాలకు గురయ్యారు, చిత్రహింసల పాలయ్యారు, ఆంక్షలకు-నిషేధాలకు బలయ్యారు. 
 • ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ఢిల్లీ అక్బార్‌ పత్రిక సంపాదకులు మౌల్వీ మహమ్మద్‌ బాకర్‌ అరుదైన త్యాగంతో 1857లో చరిత్ర సృష్టించారు. చిరస్మరణీయుడైన మహమ్మద్‌ బాకర్‌ మార్గంలో స్వేచ్ఛ-స్వాతంత్య్రాల కోసం అక్షరాలను ఆయుధంగా చేసుకుని చివరి శ్వాసవరకు పోరాడిన హైదరాబాద్‌ యోధుడు షోయాబుల్లా ఖాన్‌.


గాంధీ విజయవాడ యాత్ర - షోయబ్ బాల్యం:


 • అది 1920 సంవత్సరం. జాతీయోద్యమం పరవళ్ళు తొక్కుతుంది. భారతదేశ వ్యాప్తంగా సాగుతున్న పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీ విజయవాడకు వెడుతున్నారు. ఆయన ప్రయాణిస్తున్న రైలు ప్రస్తుత వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ విూదుగా సాగుతోంది. 
 • అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు హబీబుల్లా ఖాన్‌ అను పోలీసు అధికారిని నియమించారు. ఆయన డ్యూటీలో ఉండగా గాంధీజీ ప్రయాణిస్తున్న రైలు రానే వచ్చింది. గాంధీజీని సమీపం నుండి చూసే అవకాశం లభించినందుకు ఆనందిస్తూ డ్యూటీని ముగించుకున్న హబీబుల్లా ఖాన్‌ ఇంటికి వెళ్ళారు. 
 • ఆయన ఇల్లు చేరుకోగానే కుమారుడు పుట్టాడన్న శుభవార్త అందింది. ఆ రోజు అక్టోబరు17. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ బిడ్డను చూసిన ఆయన మరింతగా సంతోషిస్తూ, అరే వీడు అచ్చం గాంధీజీ లాగే ఉన్నాడే ...అవే కళ్ళు...అదే నుదురు. అచ్చం గాంధీలానే ఉన్నాడు, అంటూ మరింత సంబరపడిపోయాడు. ఆ బిడ్డకు షోయాబుల్లా ఖాన్‌ అని నామకరణం చేసినా హబీబుల్లా ఖాన్‌ మాత్రం తన పుత్రరత్నాన్ని ఎంతో ప్రేమతో షోయాబుల్లా గాంధీ అని పిలుచుకోసాగారు. 
 • ఆ బాలుడు చిన్నతనం నుండే, మహాత్మాగాంధీ గురించి వింటూ విద్యార్థిగా ఆయన రచనలను విస్తృతంగా చదువుతూ వచ్చాడు. ఆక్రమంలో గాంధేయ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన ఆయన గాంధీజీ బాటను తన జీవితమార్గంగా నిర్ణయించుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం షోయాబుల్లా ఖాన్‌ నుండి గ్రాడ్యుయేషన్‌ చేశారు.
 •  నైజాం సంస్థానంలో మంచి హోదాగల ఉద్యోగం లభించగల అవకాశం ఉన్నా జాతీయోద్యమానికి సేవలందించేందుకు షోయాబుల్లా ఖాన్‌ జర్నలిజంను ప్రధాన వృత్తిగా చేపట్టారు. 
 • ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల పూర్తి నమ్మకం, గౌరవం గల షోయాబుల్లా ఖాన్‌ తొలుత నుండి నిరంకుశ పాలకులను వ్యతిరేకించారు. ఆ లక్ష్యంగా రచనా వ్యాసంగాన్ని ఆరంభించారు. జాతీయ భావాలను ప్రోత్సహిస్తున్న తేజ్‌ ఉర్దూ వారపత్రికలో ఆయన చేరారు.
 •  ఆనాటి హైదరాబాద్‌ సంస్థానాధీశులైన నిజాం పాలకుల నిరంకుశత్యం, ఆ పాలకుల తాబేదార్లయిన రజాకారుల, భూస్వాముల అమానుషకృత్యాలను విమర్శిస్తూ వ్యాసాలు రాయడం ప్రారంభించారు. ఆయన వ్యాసాలు సహజంగానే పాలకవర్గాలకు రుచించలేదు.
 •  ఆ కారణంగా తేజ్‌ పత్రిక నిషేధానికి గురయ్యింది. ఆ తరువాత స్వాతంత్య్రసమర యోధులు మందుముల నరశింగరావు ఆధ్వర్యంలో నడుస్తున్న రయ్యత్‌ ఉర్దూపత్రికలో షోయాబుల్లా ఖాన్‌ చేరారు. నిజాం పాలకుల దాష్టీకాలను, రజాకారుల చర్యలను తీవ్రంగా ఎండగడ్తూ రచనలు చేయడాన్ని ఆయన కొనసాగించారు.
 •  ఆ కారణంగా షోయాబుల్లా ఖాన్‌ను హెచ్చరిస్తూ అజ్ఞాత వ్యక్తుల నుండి బెదిరింపు లేఖలు రాసాగాయి. ఆ బెదిరింపులను ఆయన ఏ మాత్రం ఖాతరు చేయలేదు. చివరకు రయ్యత్‌ పత్రిక కూడా పాలకవర్గాల ఆగ్రహానికి ఎరకాక తప్పలేదు. ఆయన అధైర్యపడలేదు.
 •  ప్రజల పక్షంగా అక్షరాయుధంతో నిరంకుశ పాలకుల విూద పోరాటం సాగించాల్సిందేనని షోయాబుల్లా ఖాన్‌ నిశ్చయించుకున్నారు. 
 • స్వయంగా జాతీయ భావాలను పెంపొందించగల పత్రికను ఆరంభించడానికి పూనుకున్నారు. భార్య, తల్లి ఆభరణాలను అమ్మగా వచ్చిన సొమ్ముతో ఇమ్రోజ్‌ ఉర్దూ దినపత్రికను ప్రారంభించారు. ఇమ్రోజ్‌ ప్రథమ సంచిక 1947 నవంబరు 15న విడులయ్యింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడ్తున్నా, ఇమ్రోజ్‌ను ప్రజల పత్రికగా తీర్చిదిద్దారు. ప్రభువుల నిరంకుశత్వం, ఉన్మాదుల మత దురహంకారం మీద తిరుగులేని సమరం కొనసాగించారు. 
 • 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది. దేశంలోని సంస్థానాలన్నీ ఇండియన్‌ యూనియన్‌లో కలసి పోతున్నాయి. జునాఘడ్‌, రాంపూర్‌ లాంటి కొన్ని సంస్థానాలతో పాటుగా తొలుత నుండి బ్రిటీష్‌ పాలకులతో స్నేహం నెరపిన నైజాం సంస్థ్ధానాధీశులు ఇండియన్‌ యూనియన్‌లో తమ సంస్థానాలను విలీనం చేయడానికి నిరాకరించారు. 
 • ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ను అడ్డుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో నైజాం పాలకులు చర్యలు చేపట్టారు. ఆ విపత్కర వాతావరణంలో ఇమ్రోజ్‌ పత్రికా సంపాదకునిగా షోయాబుల్లా బృహత్తర బాధ్యతలను నిర్వర్తించారు.
 •  నైజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాలని కోరుతూ సంపాదకీయాలు రాశారు. భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం ఎంతటి అవసరమో వివరిస్తూ నిజాం నిరాకరణ వెనుక గల స్వార్ధ రాజకీయాలను తూర్పార పడుతూ వ్యాసాలు ప్రచురించారు. 
 • హైదరాబాద్‌ సంస్థానం పరిధిలోని ప్రజలలో ఎక్కువ మంది ఉర్దూ చదువుకున్న వారు కావడంతో ఇమ్రోజ్‌ రాతల ప్రభావం వలన రోజురోజుకూ విలీనంకు అనుకూలంగా మేధావులు, ప్రజలు స్పందించసాగారు. 
 • 1948 జనవరి 29 నాటి ఇమ్రోజ్‌ సంచికలో 'పగటి ప్రభుత్వం-రాత్రి ప్రభుత్వం' అను శీర్షికతో షోయాబుల్లా రాసిన సంపాదకీయం ఈ క్రింది విధంగా సాగింది. '...ఈనాడు గ్రామస్తులు ప్రభుత్వ తిరుగలిలో పిండి చేయబడుతున్నారు. 
 • ఇంత వరకు జరిగిన సంఘటనలు ప్రజల ఎదుట ఉన్నాయి. అరాచకం ఏవిధంగా రాజ్యం చేస్తోందో అందరికి తెలుసు ... ఇత్తేహదుల్‌ ముసల్‌విూన్‌ సభ్యులు గాంధీ టోపీలు ధరించి గాంధీజీకి జై అనే నినాదాలు చేస్తూ గ్రామాలను దోచుకుంటున్నారు.
 •  బాధ్యతయుతమైన పదవుల్లో వున్న వ్యక్తులు వీటినన్నిటిని సాధారణ చోరీ నేరాల క్రింద త్రోసివేస్తున్నారు...మా అభిప్రాయంలో ఈ అరాచక వ్యవస్థ ఒక విషవలయంగా పరిణమించింది.
 •  ఒక గ్రావిూణుడు బాధతో 'పగటిపూట ఒక ప్రభుత్వం, రాత్రి మరొక ప్రభుత్వం రాజ్యం చేస్తున్నది' ఆన్న మాట సత్యదూరమేవిూ కాదు...ఇత్తేహదుల్‌ ముస్లివిూన్‌ సంస్థ కార్యకలాపాలపై ప్రభుత్వం ఆంక్షలను ఎందుకు విధించకూడదు? ప్రజలందరికి ప్రాతినిధ్యం వహించే మంత్రివర్గాన్ని యెందువల్ల ఏర్పాటు చేయదు. ప్రజాభిప్రాయాన్ని మన్నించి పరిపాలన సాగిస్తేనే ఏమైనా, ఏ ప్రభుత్వమైనా మనగలుగుతుంది...
 • ఈ పరిణామాలు నిజాం పాలకవర్గాలకు కంటక ప్రాయమయ్యాయి. కలం యోధుడు షోయాబుల్లాను నయానా, భయానా నచ్చచెప్పి ఆయన కలాన్ని నియంత్రించాలని పాలక వర్గాలు శతవిధాల ప్రయత్నించాయి. అన్నిరకాల ఆశలు చూపాయి. తమ ప్రయత్నాలు ఏమాత్రం నెరవేరకపోవడంతో, భయంకర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, చివరికి పరోక్షంగా, ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీ చేశాయి.
 •  ఆ హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయక, నైజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాల్సిందేనని, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిజాం సంస్థ్ధానాన్ని స్వతంత్ర రాజ్యం కానివ్వరాదన్న పట్టుదలతో రచనలు చేస్తూ వచ్చిన షోయాబుల్లా ఖాన్‌ ఆ హెచ్చరికలను గడ్డిపోచ క్రింద జమకట్టారు. అనునిత్యం హెచ్చరికలను ఎదుర్కొంటూ కూడా వజ్ర సంకల్పంతో ముందుకు దూసుకుపోతున్న షోయాబుల్లా అంటే ప్రేమాభిమానాలు గల స్వాతంత్య్రసమరయోధులు బూర్గుల రామకృషారావు జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఆయనకు సలహలిచ్చారు. 
 • ఆ సలహాలకు సమాధానంగా, సత్యాన్వేషణలో ఒక వ్యక్తి మరణిస్తే అది గర్వించదగిన విషయమని గాంధీజీ చెప్పారుకదా! అటువంటప్పుడు నేనెందుకు భయపడాలి' అంటూ షోయాబుల్లా ఖాన్‌ ప్రత్యుత్తర మిచ్చి బూర్గులను ఆశ్చర్యచకితుల్ని చేశారు. 
 • మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా జీవించాలని కోరుకుంటూ తన రచనల ద్వారా ప్రజలను ప్రభావితం చేస్తున్న షాయాబుల్లా ఖాన్‌ వలన కలుగుతున్న నష్టాలను రజాకారులు, నిజాంను సమర్థిస్తున్న భూస్వామ్యవర్గాలు గమనించసాగాయి. 
 • మతం పేరుతో ప్రజలను విడదీసి, స్వతంత్ర రాజ్యాన్ని నిలుపుకోవాలనుకుంటున్న స్వార్థపరశక్తులకు షోయాబుల్లా రచనలు భరించరానివిగా తయారయ్యాయి. మతసామరస్యం ఐక్యత, పరస్పర సదవగాహన, మత మనోభావలను గౌరవించడం లాంటి ప్రయత్నాలు నైజాం పాలకవర్గాల కలలను కల్లలు చేస్తాయని నైజాం అనుకూడ శక్తులు నిర్ణయానికి వచ్చాయి. 
 • ఒక చిన్న ఉర్దూ పత్రిక సంపాదకుడు బలమైన నైజాం ప్రభువుల అభీష్టానికి వ్యతిరేకంగా రాయడాన్ని, ప్రభువు పక్షాన వెలువడిన ఆజ్ఞలను ఎదిరిస్తూ ముందుకు సాగుతున్న షోయాబుల్లా ఖాన్‌ను ఏమాత్రం నియంత్రించలేక పోవడాన్ని అవమానంగా భావించారు. 
 • ఆ విధంగా ఆగ్రహించిన పాలకవర్గాల తొత్తులు నైజాం సంస్థ్దానానికి, రజాకారులకు వ్యతిరేకంగా పత్రికల్లో రాసేవారి, ప్రజల్లో మాట్లాడేవారి అంతు చూస్తామని బహిరంగంగా ప్రకటించారు.
 •  ఈ మేరకు 1948 ఆగస్టు 19న హైదరాబాదులోని జమురుద్‌ సినిమా హాలులో జరిగిన సభలో రజాకారుల నాయకుడు ఖాశింరజ్వీ ప్రసంగిస్తూ, ముస్లింల ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులు సజీవంగా ఉండటానికి వీలులేదు. భారతప్రభుత్వ ఏజెంట్లుగా మా సమైక్యతను ధ్వంసం చేయాలన్న కీలుబొమ్మల చేతులు ఉండడానికి వీలులేదు.
 •  ఆ చేతులు క్రిందకు దిగాలి లేదా నరికి వేయబడాలి' అని ప్రకటించాడు. ఆ ప్రకటను అనుగుణంగా కార్యాచరణ దూపుదిద్దుకుంది. అది 1948 సంవత్సరం ఆగస్టు 21. అర్థరాత్రి గడిచింది. ఆ రాత్రి షోయాబుల్లా ఖాన్‌ జీవితంలో భయంకర కాళరాత్రి అవుతుందని ఎవ్వరూ ఊహించ లేదు. 
 • ఆయన ఇమ్రోజ్‌ ఉర్దూ పత్రిక కార్యాలయం నుండి సహచరులు మహమ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌తో కలసి లింగంపల్లి చౌరాస్తా సవిూపాన ఉన్న ఇంటికి బయలు దేరారు. చౌరాస్తా దాటి కొంత ముందుకు వెళ్ళేసరికి వారిని ఎవరో అను సరిస్తున్నట్టు అన్పించింది. అది ఆయన దారిలో మృత్యువు రూపంలో కాపువేసి ఉన్న గుంపు. ఆయన దాన్ని ఏమాత్రం పట్టించు కోలేదు. 
 • ఆ గుంపు ఆయనను అనుసరిస్తూ వెనకాల వచ్చింది. ఆకస్మికంగా షోయాబుల్లా ఖాన్‌, ఆయన సహచరుడు ఇస్మాయిల్‌ విూద దాడి చేసింది. షోయాబుల్లా పైన తుపాకి గుళ్ళ వర్షం గురిసింది. తుపాకి గుండ్లకు గురైన షోయబుల్లా నేల కూలారు. బాధను పంటిబిగువున పట్టి, దుండగుల నుండి తప్పించుకోటానికి ప్రయత్నించారు. అయినా వదలకుండా ఆ హంతక ముఠా ఆయనను తరిమి తరిమి చేజిక్కించుకుని మతోన్మాద చర్యలను, నిరంకుశత్వాన్ని నిరసిస్తూ సంపాదకీయాలు రాసిన ఆయన చేతులను నరికి వేసింది.
 •  ఈ విధంగా నైజాం పాలకుల ఉద్దేశ్యాలకు వ్యతిరేకంగా వ్యాసాలు, సంపాదకీయాలు రాసిన షోయాబుల్లా ఖాన్‌ చేతులు తెగి హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున పడ్డాయి. ఆ దుర్మార్గాన్ని అడ్డుకున్న షోయాబుల్లా ఖాన్‌ సహచరులు ఇస్మాయిల్‌ కూడా దాడికి గురయ్యారు. 
 • ఆయన ముంజేతిని దుండగులు దారుణంగా నరికేశారు. ఆయన మీద కత్తులు దాడులు చేశాయి. ఆయన మరో చేతి వేలు కూడా తెగిపడింది. ఆయన కేకలు వేశారు. ఆ కేకలకు సమీపంలోగల ప్రజానీకం ఇళ్లనుండి బయటకు రావడంతో కిరాతకులు పరారయ్యారు. 
 • తుపాకి కాల్పుల వలన, కత్తుల దాడి వలన బాగా గాయపడి రక్తంవోడుతున్న షోయాబుల్లా ఖాన్‌ను ప్రజలు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న చివరి క్షణాలలో కూడా తనకు ప్రియమైన ఇమ్రోజ్‌ను సక్రమంగా నడపాలన్న ఆకాంక్షను షోయాబుల్లా ఖాన్‌ వ్యక్తంచేశారు. కన్నీరు మున్నీరుగా రోదిస్తున్న తల్లితండ్రులను సముదాయిస్తూ, మరణం అనివార్యం.
 •  చావు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ మరణం ఒక లక్ష్యం కోసం సంభవిస్తే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు విూరు సంతోషించాలి, అన్నారు. అసమాన ధైర్య సాహసాలతో చివరిక్షణం వరకు అక్షరసమరం సాగించిన షోయబుల్లా ఖాన్‌ మృత్యువుతో పోరాడుతూ 1948 ఆగస్టు22 తెల్లవారుజామున కన్నుమూశారు. కలంయోధుడు అంతిమ యాత్రకు నైజాం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అతికొద్ది మంది బంధువులు, జాతీయ కాంగ్రెస్‌  కార్యకర్తలు, బహు కొద్దిమంది జర్నలిస్టులు మాత్రమే అంతిమ యాత్రలో పాల్గొన్నారు. 
 • ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారన్న విషయమై ఆరా తీసేందుకు ప్రభుత్వ గూఢచారి విభాగం పెద్ద సంఖ్యలో అంతిమ యాత్రను అనుసరించడం వలన భయానక వాతావరణం నెలకొంది. ప్రజల మనస్సులో ఆ కలం యోధునికి అంతిమ శ్రద్ధాంజలి అర్పించాలని ఉన్నా ప్రభుత్వ పోలీసువర్గాల భయం కారణంగా ఆయన చివరి యాత్రలో పాల్గొనలేక పోయారు.
 •  చివరకు షోయాబుల్లా ఖాన్‌ భౌతికకాయాన్ని గోషామహాల్‌ కుంట ఎదురుగా ఉన్న ఖబరస్థాన్‌లో ఖననం చేశారు. ఆ మరుసటి రోజున షోయాబుల్లా ఖాన్‌ హత్యోదంతం మీద నైజాం ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడింది.
 •  ఈ సంఘటన విూద గూఢచారి విభాగం దర్యాప్తు జరిపిందని, అది రాజకీయ హత్య ఏమాత్రం కాదని, ఈ హత్యవెనుక ఎటువంటి రాజకీయ కారణాలు ఏమీ లేవని ప్రకటించింది. అది వ్యక్తిగతమైన శత్రుత్వం వలన మాత్రమే జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందంటూ, ఈ సంఘటన మీద ఇంకా విస్తృతంగా దర్యాప్తు జరుగుతుందని ప్రకటించి నైజాం ప్రభుత్వం చేతులు దులుపుకుంది. 
 • 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం జరిపి ముహమ్మద్‌ బాకర్‌ అమరుడైన తరువాత ఒక సంపాదకునిగా జాతీయ ప్రయోజనాలను కాంక్షిస్తూ, నిరంకుశ పాలకుల కిరాతకత్వానికి బలైన ఏకైక పాత్రికేయుడిగా షోయాబుల్లా ఖాన్‌ మరోచరిత్ర సృష్టించారు. 
 • భారతదేశ స్వాతంత్య్రసంగ్రామ చరిత్రలో 1857లో ముహమ్మద్‌ బాకర్‌, 1948లో షోయాబుల్లా ఖాన్‌ తప్ప, ఆంగ్లేయుల, ఆంగ్లేయుల వత్తాసుదారుల దాష్టీకాలను అక్షరాయుధాలతో ఎదుర్కొని, ఆ క్రమంలో ప్రాణాలను సైతం బలిపెట్టిన మరో సంపాదకుడు గాని, ఇంకో పత్రికాధిపతి గాని కన్పించరు. 
 • ఆ విధంగా భారత స్వాతంత్య్రసంగ్రామ చరిత్ర తొలిథలో ఢిల్లీ అక్బార్‌ పత్రిక సంపాదకులు మౌల్వీ ముహమ్మద్‌ బాకర్‌, మలిథలో ఇమ్రోజ్‌ పత్రిక సంపాదకులు షోయాబుల్లా ఖాన్‌ ప్రాణ త్యాగాలు చేసి భారతీయ పత్రికారంగానికి ఎనలేని గౌరవప్రతిష్టలు సమకూర్చిపెట్టారు.


పాత్రికేయునిగా:


 • సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన బలంగా ఉన్న షోయబ్ జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు. 
 • మొదట షోయబ్ 'తేజ్ 'అనే ఉర్దూ పత్రికలో ఉప సంపాదకుడిగా చేరాడు. నిరంకుశ నిజాం ప్రభుత్వం, ఆయన తాబేదార్లయిన రజాకార్ల దౌర్జన్యాలు, అరాచకాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వార్తలనే అస్త్రాలను సంధించాడు. ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు.
 •  చివరకు ‘తేజ్’ పత్రికను నిషేధించారు.తేజ్ పత్రిక తర్వాత మందుముల నర్సింగరావు ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘రయ్యత్’ అనే ఉర్దూ దినపత్రికలో చేరాడు. పాలకవర్గాల దౌర్జన్యాలను, దోపిడీని చీల్చి చెండాడాడు. 
 • కొంత కాలానికి నిజాం ప్రభుత్వం ‘రయ్యత్’ పత్రికను కూడా మూసివేయించింది. తన భార్య, తల్లి ఆభరణాలు అమ్మి ‘ఇమ్రోజ్’ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించాడు. ‘ఇమ్రోజ్’ అంటే ‘నేడు’ అని అర్థం. ‘ఇమ్రోజ్’ దినపత్రిక తొలి సంచిక 1947 నవంబరు 1 వ తేదీన వెలువడింది. 
 • నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయాల్సిందేనని ఖరాఖండిగా చెబుతూ సంపాదకీయాలు రాశాడు. విశాల దేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం తప్పనిసరి అని పేర్కొన్నాడు.
 •  ‘పగటి ప్రభుత్వం - రాత్రి ప్రభుత్వం’ పేరుతో 1948 జనవరి 29 న ఒక వ్యాసంలో ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థపై ఎందుకు నిషేధం విధించదు ? అంటూ తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించాడు. 
 • కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ వారు, విద్యార్థులు, యూత్ లీగ్ ఎవరు పోరాటాలు చేసినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్తలన్నీ ప్రముఖంగా ప్రచురించాడు. 
 • రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ 1948 ఆగష్టు 19 సభలో షోయబ్ చేతులు నరికివేస్తామన్నాడు. 1948 ఆగస్టు 21వ తేదిన కాచిగూడ రైల్వే స్టేషన్ రోడ్ లో ముష్కరులు ఆయన వార్తలు రాసే కుడి అరచేతిని ముష్కరులు నరికేశారు. 1948 ఆగస్టు 22 న తెల్లవారుజామున షోయబ్ తుది శ్వాస విడిచాడు.
 • నిజాం సర్కార్. షోయబ్ అంతిమయాత్రను నిషేదించింది. అంతిమ యాత్ర పోలీసు బందూకుల మధ్య జరిగింది. గోషామహల్ మాలకుంట స్మశాన వాటికలో ఆయన ఖననం జరిగింది. నిజాం ప్రభుత్వం ఈ హత్యోదంతంపై ఎలాంటి విచారణా జరపలేదు.

సుద్దాల హనుమంతు

 • సుద్దాల హనుమంతు కలం నుండి జాలువారిన ఈ పాట వినని వారుండరు. 
 • కవిగా, కళాకారుడుగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టుగా జీవితమంతా కష్టజీవుల కోసం, కమ్యూనిస్టు ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి. తెలంగాణ జాతి యావత్తుని తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు. 
 • ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుంది. ఆ భావాల్లో సామాజిక స్పృహ ఉంటుంది. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత.
 • నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో 1908 డిసెంబర్‌ నెలలో పేద పద్మశాలి కుటుంబంలో జన్మించిన హనుమంతు ఇంటి అసలు పేరు గుర్రం. కానీ, తర్వాత ఆయన నివసించిన ఊరు పేరే ఇంటి పేరుగా మారింది.
 •  సుద్దాల హనుమంతు పేరు ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు, యావదాంధ్ర దేశం మారుమోగిందంటే అతిశయోక్తి కాదు. పాట ద్వారా ప్రజల్లో ప్రచారమై ప్రజాకవిగా నిలబడ్డారు. నాటి నిజాం వ్యతిరేకోద్యమంలో బతికున్నంతకాలం ప్రజల బాణీలోనే పాటలందించి పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేసిన అచ్చమైన ప్రజాకవి సుద్దాల హనుమంతు.
 •  హన్మంతు తండ్రి ఆయుర్వేద వైద్యవృత్తితో కుటుంబం గడుస్తోంది. హన్మంతు బతుకుతెరువు కోసం ఉద్యోగానికి హైదరాబాదు చేరాడు. ప్రభుత్వ కార్యాలయంలో అటెండరుగా పనిచేశాడు. ఆర్యసమాజం వైపు ఆకర్షితుడై కార్యకర్తగా పనిచేశాడు.
 • విద్య పెద్దగా లేదు- ఆనాడు చదువుకు అవకాశాల్లేవు. వీధిబడిలో ఉర్థూ, తెలుగుభాషలు నేర్చుకున్నాడు. శతకాలు, కీర్తనలు, సీస, కంద పద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలో యక్షగానాలు, కీర్తనలు, భజనల్లాంటి కళారూపాలంటే ఆసక్తి వుండేది. అందుకే యక్షగానాల్లో పాత్రలు ధరించారు. గొంతెత్తి పాడటం నేర్చుకున్నాడు. చిన్నతనం నుండే నాటకాల పై ఆసక్తిని పెంచుకున్న హనుమంతుకు ప్రజా కళారూపాలైన హరికథ, బురక్రథ, యక్షగానాలే తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రచారాసాధనాలుగా ఉపయోగపడ్డాయి.
 •  ఆయన బురక్రథ చెబితే ఆనాడు గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమయ్యేదని జనంలో ప్రచారం బలంగా ఉండేది. హైదరాబాద్‌ సంస్థానంలో జరిగిన అనేక అక్రమాలను, భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను బురక్రథల రూపంలో చాటి చెప్పారు.
 • కమ్యూనిస్టు పార్టీ దళ సభ్యునిగా చేరి తన పాటల ద్వారా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశారు. భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు హన్మంతు వాలంటీర్‌గా పనిచేశారు. 
 • ఆ మహాసభ ప్రభావంతో సుద్దాల గ్రామంలో `సంఘం’ స్థాపించారు. ఈ `సంఘం’ ఆధ్వర్యంలో ఆందోళనలు, తిరుగుబాటు పోరాటాలు మొదలైనయ్‌. 
 • సంఘం పెట్టి, పాటలు కట్టి ప్రజల్ని ఉద్రేకపరుస్తున్నాడని హనుమంతు పై నిజాం ప్రభుత్వం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అప్పుడే హనుమంతు అజ్ఞాతవాసంలోకి వెళ్ళాల్సి వచ్చింది.
 • ఆ రోజుల్లో ఉపన్యాసాలకంటే పాటే జనంలోకి బాగా చొచ్చుకుపోయేది. పాటే జనంలో చైతన్యాన్ని కలిగించేది. వెట్టిచాకిరీ విధానాన్ని వ్యతిరేకిస్తూ, దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ అనేక పాటలు రాశారు. ఇవన్నీ `వీర తెలంగాణ’ పేరుతో అచ్చయ్యాయి.
 •  అపారమైన ఆత్మవిశ్వాసం, అలుపెరగని వీరావేశం ఆయన పాటకు బలాన్ని, బలగాన్ని సమకూర్చి పెట్టాయి.నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు ఎందరినో కవులుగా, గాయకులుగా, ఉద్యమకారులుగా తయారు చేసింది. భూమి కోసం, భుక్తి కోసం, బానిస జన విముక్తి కోసం జరిగిన ఈ పోరాటం అంతర్జాతీయ స్థాయిలోనే ఒక గుర్తింపును తెచ్చిపెట్టింది.
 • చరిత్రాత్మకంగా జరిగిన ఈ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రాంతాలకు చెందిన 4 వేల మంది ప్రజలు ప్రాణ త్యాగాలు చేస్తే ఇందులో సగం మంది నల్లగొండ జిల్లా వారేనంటే సాయుధపోరాటంలో ఆ జిల్లా పాత్ర ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
 • ప్రాణ త్యాగాల్లోనే కాకుండా సాయుధ పోరాటానికి ఇరుసుల్లా పనిచేసే గొప్ప నాయకత్వాన్ని, తిరుగులేని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసి ప్రజల్ని గెరిల్లా పోరాట వ్యూహాలకు కూడా సిద్ధం చేసింది.ఒక చేత్తో పెన్నూ, మరో చేత్తో గన్నూ పట్టుకొని పోరాటంలో పాల్గొన్న వీరసేనాని హనుమంతు.జానపద కళా రూపాలకు జీవం పోసి, అనేక పాటలను ప్రజలకు అందించిన సుద్దాల హనుమంతు క్యాన్సర్‌ వ్యాధితో 1982 అక్టోబర్‌ 10న అమరుడయ్యాడు.

operation polo

1946,1948ల మధ్య హైదరాబాదు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ప్రజలు కలత చెందారు. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆసిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాము ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్‌ ముస్లిమీను, దాని సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి ద్వారా దీన్ని సాధించాలని నిజాము ప్రయత్నించాడు.

రాష్ట్రానికి చెందిన అధిక శాతం ప్రజలు భారతదేశంలో కలిసిపోవాలని ఉద్యమం మొదలుపెట్టారు. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో కాంగ్రెసు నాయకులు ఉద్యమంలో పాలుపంచుకునారు. రాష్ట్ర కాంగ్రెసును నిజాము నిషేధించడం చేత, ఈ నాయకులు విజయవాడ, బొంబాయి వంటి ప్రదేశాల నుండి ఉద్యమాన్ని నడిపించారు. రజాకార్ల దాడులను ఎదుర్కోడానికి కమ్యూనిస్టులు గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసారు.

భారత ప్రభుత్వానికి, నిజాముకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారత దేశంలో విలీనానికి నిజాము అంగీకరించలేదు. మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ మరియు రాజాకార్ల కార్య కలాపాలు శాంతికి, సామరస్యానికి భంగకరంగా తయారయ్యాయి. వాస్తవ పరిస్థితిని నిజాముకు అర్ధమయ్యేలా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి, 1947 నవంబర్‌ 29న యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. 1947 ఆగష్టు 15కు పూర్వపు పరిస్థితికి ఒక సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. ఒప్పందంలో భాగంగా హైదరాబాదులో భారత్ తరపున ఏజంట్ జనరల్‌గా కె.ఎం.మున్షీ నియమితుడయ్యాడు. విదేశాల్లో ఆయుధాలు కొనుగోలు చేసి, హైదరాబాదుకు దొంగతనంగా తరలించే సమయం పొందడమే ఈ ఒప్పందంతో నిజాము ఉద్దేశ్యం. ఈలోగా పరిస్థితిని ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా సమితికి నివేదించడానికి నిజాము ఒక బృందాన్ని పంపించాడు.

1948 ఆగష్టు 9 న టైంస్‌ ఆఫ్‌ లండన్‌ లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాదు 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. హైదరాబాదు ప్రధాన మంత్రి లాయిక్‌ ఆలీ ఇలా అన్నాడు భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లక్ష మందితో సైన్యం సిద్ధంగా ఉంది, బొంబాయిపై బాంబులు వెయ్యడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉంది

నిజాము చేపట్టిన ఈ చర్యలకు తోడు రజాకార్ల హింస, హైదరాబాదుపై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది. దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుండి హైదరాబాదును ముట్టడించింది. 1948 సెప్టెంబర్ 18న నిజాము లొంగిపోయాడు. పోలీసు చర్య ఐదు రోజుల్లో ముగిసింది. 1373 మంది రజాకార్లు హతమయ్యారు. మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. ఆతని ప్రధానమంత్రి మీర్‌ లాయిక్‌ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. తరువాత ఖాసిం రిజ్వీ కొన్నాళ్ళు భారత దేశంలో జైలు జీవితం గడిపి, విడుదలయ్యాక, పాకిస్తాను వెళ్ళి స్థిరపడ్డాడు. కొన్నాళ్ళకు అక్కడే అనామకుడిలా మరణించాడు.

సెప్టెంబర్ 23న భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాము ఉపసంహరించుకున్నాడు. హైదరాబాదు భారతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించాడు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు.

దొడ్డి కొమరయ్య

 • హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. 
 • దీన్నే తెలంగాణ విమోచనోద్యమం గా పిలుస్తారు. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య . 
 • 1927లో వరంగల్లు జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో సాధారణ కుటుంబంలో పుట్టాడు.

నిజాం నిరంకుశత్వం:

 • విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రామచంద్రా రెడ్డి తల్లి జానకమ్మా దొరసాని. ఆమె కడికవెండిలో వుండేది. ఈమె ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేది. 
 • మనషులను వెట్టిచాకిరి చేయించడంలో వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో పేరుగాంచింది.
 • వెట్టి చాకిరికి దొపిడికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాట సేనాని ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కడివెండి వెళ్లి ఆంధ్ర మహా సభ సందేశాన్ని ప్ర్ర్రజలకు వినిపించాడు. దీంతో గ్రామంలో సంఘమేర్పడింది.
 •  ఉత్సాహంగా యువతీ యువకులు ముందుకొచ్చారు. దిన దినంగా కడివెండిలో సంఘం బలంగా అయింది. వెట్టచాకిరిని నిర్మూలించారు. దొరలు, విసునూర్‌ ల ఆటలను అరికట్టించారు.
 • భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. 
 • దేశమంతటా స్వాతంత్ర్యత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు.
 • 1946 జులై 2న విసునూర్‌ నైజాం అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వాచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గునపాలు అందుకుని విసునూర్‌, నిజాం, రజాకర్లను తరిమికొట్టారు.
 •  నైజాం అల్లరి మూకలు, విసునూర్‌ తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమురయ్య. మరణ వార్త జనగామ ప్రాంత ఆంధ్రమహాసభ కార్యకర్తలందరకీ విషాదకరమైన వార్తయింది.
 •  దేశ్‌ముఖ్‌, విసు నూర్‌ ఆగడాలన ఎదుర్కోవవడానికి పాలకుర్తి ప్రాంతం నుంచి యాదగిరిరావు, నిర్మల్‌ కృష్ణమూర్తి, నాయకత్వంలో ఆరు వేల మంది ప్రజాసైన్యం దొడ్డి కొమరయ్య మృతదేఠహానికి పోస్టుమార్టం జరిగింది. వేలాది మంది జనం నాయకత్వంలో అంతిమ యాత్ర జరిగింది.

చాకలి ఐలమ్మ

 • చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణా వీరవనిత.
 • సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్య శాలి.

జననం - వివాహం- పిల్లలు:

 • 1919 లో వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామం లో జన్మించింది. 
 • పాలకుర్తి కి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది.
 •  వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. 
 • ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం.
 • అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’అని ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు. 
 • దొరా అని పిలువకపోతే ఉన్నతకులాలతో పాటు వారి అనుంగు ఉంపుడుకత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకు వచ్చేది. 
 • వెనుకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి ఆఘాయిత్యం చేయించేవారు. 
 • ఈ భూమినాది. పండించిన పంటనాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు. నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ.                                                                                                             
 • మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. అందులో నాలుగు ఎకరాలు సాగుచేశారు. 
 • పాలకుర్తి పట్వారీ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు. 
 • పాలకుర్తి పట్వారీ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది. 
 • పాలకుర్తి పట్వారీ పప్పులుడకక అయిలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. 
 • కేసులో అగ్రనాయకులతో పాటు అయిలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయినప్పటికీ కోర్టులో తీర్పు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వచ్చింది.
 • అయిలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్‌ముఖ్‌ పట్వారిని పిలిపించుకొని, అయిలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు. 
 • భూమి తనదని, వండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వందమందిని దేశ్‌ముఖ్‌ పంపాడు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు.
 •  భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోసారు. 
 • కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది. 
 • రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్‌ముఖ్‌ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టారు. ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 • ఐలమ్మ కుమారులు ముగ్గురు పాలకుర్తి పట్వారీ ఇంటిని కూల్చి అదే స్ధలంలో మొక్కజొన్న పంటను పండించారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం ఎరజ్రెండాను వీడలేదు.
 • ‘ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏవిధంగా నష్టపెట్టగలడు’ అని తనలో తాను ప్రశ్నించుకొన్నది.
 • నీ దొరోడు ఏం చేస్తాడ్రా’ అని మొక్కవోని ధెైర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరమి కొట్టింది.
 • కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. అయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు.
 •  అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. అయిలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది.

మరణం:

 • ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన అయిలమ్మ సెప్టెంబర్‌ 10, 1985న అనారోగ్యంతో మరణించింది.
 • పాలకుర్తిలో అయిలమ్మ స్మారక స్థూపం, స్మారక భవనంను సిపిఎం పార్టీ వారు నిర్మించారు.

రాయగిరి

రాయగిరి
నల్గొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరిది ఒక విస్మృత చరిత్ర. ఆ వూరెందుకు రాయగిరయిందో తెలియదు.రాయగిరి రైల్వేస్టేషన్ ప్రాంతాన్ని తిరుమలగిరి తండ అని పిలిచేవారట వెనకటికి.అక్కడ వున్న గుట్టకు వెంకటేశ్వర్లు వెలిసినందువల్ల ఆ ప్రాంతం తిరుమలగిరి అయిందేమో.అక్కడ గుట్ట మీద వెంకన్న కింద అనంతపద్మనాభుడు, ఆంజనేయుడు,ధ్వజస్తంభాలు రైలుపట్టాల ఆవల అద్భుతమైన కొలను వుంది. కొలను అవతల శివలింగం, పానవట్టాలు, చామరగ్రాహుల శిల్పాలు పడివున్నాయి. దేవుడి కళ్యాణమంటపం వుందక్కడ.రథోత్సవానికి రథాన్ని నిలిపే షెడ్డు వంటి నిర్మాణం వుంది.ఒకప్పుడు ఆర్కియాలజీ వారు,బ్రిటిష్ వారు చేపట్టిన తవ్వకాల వల్ల సింధునాగరికతతో సరిపోలె నాగరికసంస్కృతి అక్కడి సమాధులలో బయటపడింది.
రాయగిరి చరిత్ర అసంపూర్ణంగానే వుంది.తిరుమలగిరి గుట్టకు పడమట వున్న మల్లన్న గుట్ట మీద ఒక పురాతన చరిత్ర మరుగునపడి వుంది. మాకివాళ ఆ చరిత్రను సందర్శించే అవకాశం కలిగింది.రాయగిరి రైల్వే స్టేషన్ కు పడమరగా,ఫ్లై వోవర్ మొదలయేచోట వున్న మల్లన్నగుట్ట వుంది.మేం, నేను,సహాయకుడు చంటి, మిత్రుడు వినోద్, రాయగిరి గ్రామస్తులు మైలబోయిన శ్రీశైలం,వీసం ప్రభాకర్ రెడ్డి కలిసి మల్లన్న గుట్ట ఎక్కాం ఈరోజు. మల్లన్నగుట్ట ఒక అద్భుతం.పురాతనస్మృతుల విషాదం.తూర్పు దిశ మధ్యలోనే కోట గోడ కనిపిస్తుంది.ఇది మట్టిగోడ.చిన్న చిన్న రాళ్ళని కడుపులో పెట్టుకున్న పెద్దరక్షణ కవచం. అక్కడికి దగ్గరలో చేదబాయికోట వుంది.కోటగోడ మూడు ప్రాకారాలుగా వుంది. ఒకటిః మట్టిగోడ, రెండవదిః చెక్కిన పెద్దరాతిబండలతో రెండవ వరుస కోటగోడ.మూడవది చక్కగా గోడలకోసం చెక్కిన రాతిబిళ్ళలతో కట్టిన గోడ.సరిగా కోట మధ్యలో మల్లన్నగుడి.మల్లన్నగుడి రాతిద్వారం రెండు శేరలమీద కలశాలు వున్నాయి.ఇది జైనబసది లేదా గుడికి వుండే గుర్తులు.అంటే మొదట జైనదేవాలయంగా వున్న ఈ గుడి తర్వాత శివాలయంగా మార్చబడిందన్నమాట.గుడి ముందు వినాయకుడు,తలలేని నంది,ఆంజనేయుడు వున్నారు.గుడికి దగ్గరలో రెండు సహజసిద్ధమైన నీటికుండాలున్నాయి.ఒకదానిలో నిరంతరం తామరలు వుండేవి.వర్షాభావం వల్ల తామరలను చూడలేకపోయాం.అట్లే అక్కడికి దగ్గరలో వుండే ‘దూసరి వడ్లు’ పండే మరో కుండం చూసాం.నీళ్ళులేక ఆ కుండం కళతప్పింది.
కోటకు నైరుతిలో రెండురాతిగుండ్ల నడుమ చిన్నసొరికెలో వెలసివున్న నరసింహస్వామిని చూసాం.
కోటగోడ దాదాపు 30 కిలోమీటర్లవిస్తీర్ణంలో కట్టబడివుంది.కాని ఇపుడు కనిపించేవి కోట శిథిలాలే.7 లేదా8 కి.మీ.పొడవు,5 కి.మీ.ల వెడల్పుండే గుట్టపై మైదానప్రాంతం 40 కి.మీ.ల వైశాల్యంతో వుంది.నాలుగుకొలనులు,ఎన్నో నివాసగృహాల ఆనవాళ్ళు కనిపించాయక్కడ.అంతేకాదు, శాతవాహనులవా లేక విష్ణుకుండినులవా ఇటుకలు దొరికాయక్కడ.స్తూపనిర్మాణం వుండవచ్చనిపించే ఇటుకలతో కట్టిన తొట్లు,ఇతర నిర్మాణాలు అక్కడక్కడ కనిపించాయి.
రాయగిరికోట భువనగిరికోట కన్నా ముందే నిర్మాణం చేసినకోట.ఇక్కడి కోట నిర్మాణం,భవనాల కట్టుకం, కుండాల నిర్వహణ, దేవాలయాలు,స్తూపాలవంటి నిర్మాణాలు...ఇవన్నీ ఈ రాయగిరి కోట విష్ణుకుండినుల కాలం లేదా అంతకన్నా ముందే ఇక్కడ కట్టివుంటారని తెలుస్తున్నది.
గ్రామంలో నిజాంల నాటి గడి,బురుజులు, అతి పురాతనమైన,ఆళ్వార్లు గుడి ద్వారపాలకులుగా వున్న వేంకటేశ్వర్ల గుడి వుంది వూరిలో.ఇదొక చరిత్రే.
రాయగిరికోటలో శిథిలాలతో పాటు నైవాసికప్రాంతాలలో కుండపెంకులు చాలా లభించాయి. వాటిలో వంటపాత్రలు,నీటిపాత్రలు, కర్మకాండలకు వాడే పాత్రలు,ప్రమిదల వంటి వాటి పెంకులున్నాయి.వాటిలో అంగుళం మందం,3 రకాల మట్టిపొరలతో కొన్ని, చిక్కని,పలుచని ఎరుపురంగు ముక్కలు,బూడిదరంగు,నలుపురంగువి,వాటిపై చక్కని డిజైన్లు కనిపిస్తున్నాయి.ఆ పాత్రల రకాలను బట్టి, మందాలను బట్టి,రంగులను బట్టి అవి వేరు వేరు కాలాలకు చెందినవిగా తెలుస్తున్నది.
అక్కడ లభించిన ఇటుకలు,కుండపెంకులు,శిథిలగృహాల ఆనవాళ్ళు శాతవాహన కాలం నాటివనిపిస్తున్నది.రాయగిరి ఈ ప్రాంతంలో అత్యంతపురాతనమైన రాచ దుర్గమని, మూడు,నాలుగు రాజవంశాలు ఇక్కడి నుండి పాలించివుంటాయని తెలుస్తున్నది. ఇక్కడ తవ్వకాలు,పరిశోధనలు జరిపితే మరిన్ని విశేషాలు బయట పడతాయని తెలంగాణచరిత్రకు కొత్తపుట చేరుతుందని మా కొత్తతెలంగాణ చరిత్రబృందం ఆశిస్తున్నది.
భువనగిరిలో కోటకట్టక పూర్వం ఇక్కడే ముందుగా కోటకట్టారని,నచ్చక వదిలేసి భువనగిరిలో తర్వాతకాలంలో కోటనిర్మాణం చేసారని జనంలో ఒక కథ ప్రచారం వుంది.అది నిజమవునో లేదో కాని రాయగిరి మల్లన్నగుట్ట అంత సులువుగా ఎక్కేందుకు వీలు కాదు.ఇక్కడ గండ్రశిలలెక్కువ.భువనగిరిఖిల్లాలెక్క నునుపుగా వుండదు.ఏకశిల కాదు.కాని,రాయగిరి కోట విస్తీర్ణం చాలా ఎక్కువ.చాలా గొప్పగా వ్యూహాత్మకంగా కట్టింది రాయగిరికోట.కాని, నేడది శిథిలచరిత్ర.

ఫలక్‌నుమా ప్యాలెస్‌
ఫలక్‌నుమా అంటే 'ఆకాశదర్పణం' అని అర్థం. ప్రపంచంలోని అత్యంత అందమైన, రాజఠీవి ఉట్టిపడే భవనాలలో ఫలక్‌నుమా ప్యాలెస్‌ ఒకటి. చార్మినార్‌కు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో చాంద్రాయణగుట్టవెళ్ళే మార్గంలో ఉన్న ఈ ప్యాలెస్‌ను పైగా వంశానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాని సర్‌వికారుల్‌ ఉమ్రా ఇక్బాదుదౌలా బహదూర్‌ నిజాంమీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌కు కానుకగా ఇచ్చారు. దీన్ని హైదరాబాద్‌ రాజులు అతిథి గృహంగా వాడారు. బ్రిటిష్‌ ఐదో కింగ్‌ జార్జ్‌, క్వీన్‌మేరీ, ఎనిమిదో కింగ్‌ ఎడ్వర్డ్స్‌, వైస్రాయ్‌ లార్డ్‌వేవెల్‌, తొలి భారత గవర్నర్‌ జనరల్‌ సి.రాజగోపాలాచారి, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ లోగడ ఈ భవనంలో విడిది చేయడం విశేషం. చిన్నకొండపై నిర్మించిన ఈ భవనంపైనుంచి చూస్తే నగరం సమస్తం కనుచూపుమేర కనిపిస్తుంది. ఈ ప్యాలెస్‌కు 1884 మార్చి 3వ తేదీన పునాది వేసి, 1893 నాటికి నిర్మాణం పూర్తిచేశారు. అప్పట్లో ఈ ప్యాలెస్‌ నిర్మాణానికి నలభై లక్షల రూపాయలు ఖర్చయినట్లు చరిత్ర చెబుతోంది. ఈ భవనాల్లోనే ఆరో నిజాం మహబూబ్‌ అలీ పాషా 1911లో మరణించాడు. మూడు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్‌ నిర్మాణంలో ఇటాలియన్‌ పాలరాయి, ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించిన కలపను ఉపయోగించారు. సీలింగ్‌ను, కుడ్యాలను ఫ్రెంచి వారితో చేయించారు. డ్రాయింగ్‌ రూంలో ఆభరణాలతో అలంకరించిన అపురూపమైన అద్దం ఉంది. దీని విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా జేడ్‌ కలక్షన్‌ కూడ ఇక్కడే ఉంది. సీలింగ్‌పై, కుడ్యాలపై ఉన్న పెయింటింగ్‌లు, చిత్రాలు, విశాలమైన డైనింగ్‌ హాల్‌లో పెద్ద డైనింగ్‌టేబుల్‌ దాని చుట్టూ నూటరెండు కుర్చీలు ఉన్నాయి. ఈ ప్యాలెస్‌లోని ఫర్నిచర్‌ విక్టోరియన్‌ పద్ధతి పనితనానికి ఆనవాళ్ళు. ప్రస్తుతం ప్యాలెస్‌ ఉన్న స్థలంలో లోగడ ఖులీ ఖుతుబ్‌షా 1580-1611లో నిర్మించిన కోహెతూర్‌ భవనం ఉండేది. ప్రస్తుతం ఈ ప్యాలెస్‌ను తాజ్‌ గ్రూప్‌నకు లీజుకిచ్చారు. ఈ ప్యాలెస్‌లో విందులు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

షోయబ్ ఉల్లాఖాన్

షోయబ్ ఉల్లాఖాన్ 1920, అక్టోబరు 17 న ఖమ్మం జిల్లా సుబ్రవేడు లో జన్మించిన తెలంగాణా యోధుడు .  బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగ...